The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది.సభలోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. శాసనసభ ఎన్నికలతో పాటు, లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాష్ట్రం లోని 25 లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
మనమే 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 19న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
18 వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు ఎన్నికలు 2024 మే 13 న జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
బర్రెలక్కగా పేరొందిన కర్నె శిరీష తెలంగాణకు చెందిన నిరుద్యోగి, రాజకీయ నాయకురాలు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్శించింది. ఆమెకు ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, అలాగే, ఆమె పాల్గొనే ఎన్నికల సమావేవాలకు సెక్యూరిటీ ఇవ్వాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 2023 నవంబరు 24న ఆదేశించింది.
మూస:ఇస్లాం దీన్ (ధర్మం) ఇస్లాం దీన్ (ధర్మం): ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం.అల్లాహ్ సృష్టించిన తొలి మానవుడు , ప్రథమ ప్రవక్త ఆదాము మొట్టమొదటి ముస్లిం (దైవవిదేయుడు). ముహమ్మద్ (ఆయనపై శాంతి శుభాలు వర్షించునుగాక) ఆఖరి ప్రవక్త . ఇది ముహమ్మద్ (ఆయన పై శాంతి,శుభాలు కలుగుగాక) ద్వారా పరిపూర్ణం చేయబడిన దీన్ (ధర్మం), దాదాపు 200 కోట్ల జనాభాతో ప్రపంచంలో క్రైస్తవం తరువాత ఇస్లాం రెండవ అతి పెద్దది ఇస్లాం అనునది సిల్మ్, సలాం అనే అరబ్బి పదం నుండి వచ్చింది దీని అర్థం శాంతి, ముస్లిం అనగా అల్లాహ్‌కి తన విధేయత ప్రకటించిన వ్యక్తి అని అర్ధం.
ఇండియా కూటమి (ఆంగ్లం: Indian National Developmental Inclusive Alliance) అనేది భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో దేశంలోని 26 రాజకీయ పార్టీల కూటమి. ఇండియా(ఐఎన్‌డిఐఎ) అంటే ది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్ కాగా 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడం దీని ప్రాథమిక లక్ష్యం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కొనసాగించుటకు ఏర్పడిన రాష్ట్ర కాబినెట్ చేత 2014 జూన్ 8న సంయుక్త రాష్ట్రల గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు.విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట కాబినెట్ మంత్రుల వివరాలు ఈ క్రింద పట్టికలో చూపబడ్డాయి.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్గ్రాడ్యుయేట్) (లేదా నీట్ (యుజి) ) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి) అనేవారు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
లవ్, మౌళి 2024 లో విడుదల కానున్న తెలుగు సినిమా. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సి స్పేస్ నిర్మించిన ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహించాడు. నవదీప్, పంఖురి గిద్వానీ, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 నవంబర్ 27న, ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 9న విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేశారు.
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) వై.ఎస్.ఆర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో పొర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రి. అతను కృష్ణా జిల్లా లోని గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి 2004 నుండి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. అతను 2004, 2009 శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా, 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
అనుప్రియా పటేల్ (జననం 1981 ఏప్రిల్ 29) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె లోక్‌సభలో 2014 నుండి మీర్జాపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుత మోడీ మంత్రిత్వ శాఖలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి .ఆమె 2016 నుండి 2019 వరకు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఉన్నారు.
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.
కింజరాపు ఎర్రన్నాయుడు (జ.23 ఫిబ్రవరి, 1957 -మ.2 నవంబర్, 2012 ) 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
సునీల్ ఛెత్రి (జననం 1984 ఆగస్టు 3) ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ బెంగుళూరు FCకి స్ట్రైకర్ లేదా వింగర్‌గా ఆడుతున్న భారతీయ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టు రెండింటికీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కెప్టెన్ ఫెంటాస్టిక్‌గా ప్రసిద్ధి చెందిన క్రిస్టియానో రొనాల్డో లియోనెల్ మెస్సీ తర్వాత అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ చేసిన మూడో ఆటగాడు. అతను దేశంలోని అత్యుత్తమ అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ గోల్‌స్కోరర్ల జాబితాలో అత్యధిక క్యాప్‌లు సాధించిన రెండవ ఆటగాడు.