The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.
రామోజీ ఫిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ) గా పేరుగాంచింది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 65వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉంది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది.
మనమే 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 19న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది. శాసనసభ లోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్
మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, అనే పేరుతో ఉన్న సంస్థ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్థిక లావాదేవీలతో వ్యవహరిస్తున్న ఒక చిట్ ఫండ్ కంపెనీ. రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్సి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు పనిచేస్తూ ప్రారంభించారు.ఈ సంస్థ రామోజీ గ్రూప్ లో ఒకటిగా నిర్వహింపబడుతుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
కింజరాపు ఎర్రన్నాయుడు (జ.23 ఫిబ్రవరి, 1957 -మ.2 నవంబర్, 2012 ) 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.
సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
రామోజీ గ్రూప్ అనగా రామోజీ రావు నేతృత్వంలోని మిశ్రమసంస్థ, ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ గ్రూప్ యొక్క వ్యాపారాలు టెలివిజన్, వార్తాపత్రిక మీడియా, చిత్ర నిర్మాణం, ఆర్థిక సేవలు, రిటైల్, విద్య, ఆతిథ్యాన్ని కవర్ చేస్తాయి. 1996 లో దీని వ్యాపారాలలో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలో అతిపెద్ద సినిమా స్టూడియోగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
18 వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు ఎన్నికలు 2024 మే 13 న జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి.
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్గ్రాడ్యుయేట్) (లేదా నీట్ (యుజి) ) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి) అనేవారు.
ఇండియా కూటమి (ఆంగ్లం: Indian National Developmental Inclusive Alliance) అనేది భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో దేశంలోని 26 రాజకీయ పార్టీల కూటమి. ఇండియా(ఐఎన్‌డిఐఎ) అంటే ది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్ కాగా 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాన్ని కూలదోయడం దీని ప్రాథమిక లక్ష్యం.
గోడం నగేశ్ (జననం 21 అక్టోబరు 1964), తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. గోండు వర్గానికి చెందిన నగేశ్ బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు (1994 – 1999, 1999 - 2004, 2009 - 2014) శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశాడు.ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం 2014 నుండి 2019 వరకు, 2024 జూన్ నుండి ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా కోనసాగుతున్నాడు.
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం: Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) వై.ఎస్.ఆర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో పొర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రి. అతను కృష్ణా జిల్లా లోని గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి 2004 నుండి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. అతను 2004, 2009 శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా, 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ,వీరు హేతువాది, నాస్తికుడు. మహాప్రస్థానం అతను రచనల్లో పై మనసులో ఉన్న మాటలు రాసే వారు.