The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సంక్రాంతికి వస్తున్నాం 2025లో విడుదలకానున్న సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
ఓం నమో నారాయణాయ అనేది సంస్కృత మంత్రం, ఇది హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరైన విష్ణువుకు నివాళులర్పించే మార్గంగా హిందూ మతంలో తరచుగా ఉపయోగించబడుతుంది. మంత్రం సాధారణంగా "నేను నారాయణుడికి నమస్కరిస్తున్నాను" లేదా "నా నారాయణుడికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను" అని అర్థం. ఈ మంత్రాన్ని పఠించడం హిందూ మతంలో విశ్వం యొక్క రక్షకుడిగా పరిగణించబడే విష్ణువు యొక్క ఆశీర్వాదాలను కోరడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
బొల్లినేని రాజగోపాల్ నాయుడు ( బిఆర్ నాయుడుగా సుపరిచితుడు.) టీవీ 5 మీడియా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ వ్యవస్థాపకుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నాయుడుకు అవకాశం కల్పించారు.
డాకు మహారాజ్ 2025లో విడుదలకానున్న సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 15న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల చేయనున్నారు.
రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)
శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మదగమగమగే దాసున్ షనక, శ్రీలంక క్రికెటర్, శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే మ్యాచ్ ల కెప్టెన్. ఆల్ రౌండర్ అయిన దాసున్, కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ గా రాణిస్తున్నాడు. 2019లో పాకిస్తాన్‌తో జరిగిన ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు, ఇతని కెప్టెన్సీలో శ్రీలంక సిరీస్‌లో పాకిస్తాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
హరిదాసు అనే పేరుతో మూడు వర్గాలలో ప్రసిద్దులు కలరు.నారదుడు మొదటి హరిదాసు అంటారు. హరిదాసు వేషధారణ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు. తెలుగు రాష్ట్రాలలో పండులప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది, హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు .
ఆంధ్ర మరియా తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకులలో భాగంగా ఒక ముఖ్యమైన వేడుక భోగి పళ్ళ సంబరం. సంక్రాతి సంబరాలలో మొదటి రోజు వచ్ఛే పండుగ భోగి. మామూలు ఆంగ్ల సంవత్సరంలోని జనవరి మాసంలో పదమూడవ రోజు, లీపు సంవత్సరంలో పద్నాల్గవ రోజు వస్తుంది.ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ఊర్వశి రౌటేలా (జననం 1994 ఫిబ్రవరి 25) ఒక భారతీయ నటి, మోడల్, ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు, తెలుగు సినిమాలో కనిపిస్తుంది. మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె ప్రాముఖ్యతను సంతరించుకుంది, అయినప్పటికీ ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ యూనివర్స్ 2015 పోటీలో స్థానం పొందలేదు. రౌతేలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ (2013)తో తొలిసారిగా నటించింది, ఆ తర్వాత సనమ్ రే (2016).
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం || హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో శ్రీమహావిష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి స్థితి కర్త, లయ కర్త, సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మం, సర్వేశ్వరుడు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము