The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సంక్రాంతికి వస్తున్నాం 2025లో విడుదలకానున్న సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్ ద్వారా జనవరి 9 న ఏటా జరిగే వేడుక రోజు. జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబై కి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవము జరుపుకొనబడుతున్నది. 2003 లో స్థాపించబడి, ఇది భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (FICCI), భారత పరిశ్రమల సమాఖ్య, నార్త్ ఈస్టర్న్ రీజియన్ యొక్క అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత స్పాన్సర్ చేయబడింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
బొల్లినేని రాజగోపాల్ నాయుడు ( బిఆర్ నాయుడుగా సుపరిచితుడు.) టీవీ 5 మీడియా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ వ్యవస్థాపకుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నాయుడుకు అవకాశం కల్పించారు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
హరిదాసు అనే పేరుతో మూడు వర్గాలలో ప్రసిద్దులు కలరు.నారదుడు మొదటి హరిదాసు అంటారు. హరిదాసు వేషధారణ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు. తెలుగు రాష్ట్రాలలో పండులప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది, హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు .
ఆంధ్ర మరియా తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకులలో భాగంగా ఒక ముఖ్యమైన వేడుక భోగి పళ్ళ సంబరం. సంక్రాతి సంబరాలలో మొదటి రోజు వచ్ఛే పండుగ భోగి. మామూలు ఆంగ్ల సంవత్సరంలోని జనవరి మాసంలో పదమూడవ రోజు, లీపు సంవత్సరంలో పద్నాల్గవ రోజు వస్తుంది.ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు.
రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)
శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
యోగితా రాణా 2003 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమె 2002లో సివిల్ సర్వీసెస్‌లో మూడో ప్రయత్నంలో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికై తిరిగి 2003లో సివిల్ సర్వీసెస్‌లో నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ కు ఎంపికైంది. యోగిత నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా 2017లో 'ఈ-నామ్' అమలులో జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
డాకు మహారాజ్ 2025లో విడుదలకానున్న సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 15న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల చేయనున్నారు.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా
షెడ్యూల్డు కులాలు అనగా (ఎస్సీల్లో) చేర్చడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన అర్హత - ‘సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం. ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కోకులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది. ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.