The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
అందెశ్రీ (1961 జూలై 18 - 2025 నవంబరు 10) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
బీహార్ ముఖ్యమంత్రి భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి ప్రభుత్వాధినేత. భారత రాజ్యాంగం ప్రకారం, బీహార్ గవర్నరు రాష్ట్ర డి జ్యూర్ హెడ్, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. బీహార్ శాసనసభ ఎన్నికల తరువాత, గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947
1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారతదేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
భారత స్వాతంత్ర్యోద్యమంలో జవాహర్ లాల్ నెహ్రూ
1920ల్లో ప్రారంభించి 1945-47 వరకూ జవాహర్ లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్యోద్యమంలో వహించిన పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కావడంతో పాటుగా కేంబ్రిడ్జిలో చదువుకున్న రోజుల్లోనే వలసవాద వ్యతిరేకత మొగ్గతొడిగింది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సాలుమరద తిమ్మక్క (1911 జూన్ 30 - 2025 నవంబరు 14), కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త. ఈమె హులికుల్ నుండి కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు. ఈమె పర్యావరణానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం భారత జాతీయ పౌర పురస్కారంతో తిమ్మక్కను గౌరవించింది.
ప్రశాంత్ కిశోర్ (జననం:1977) భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త. జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను పౌరసత్వ సవరణ చట్టం (2019) పై, పార్టీ అధిపతి అయిన నితీష్ కుమార్ అవలంబించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు గాను ఆయనను 2020 జనవరి 29న పార్టీ నుండి బహిష్కరించారు. ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్, భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు.
మహాఘట్బంధన్ ( MGB, ISO : Mahagaṭhabaṁdhana) దీనిని గ్రాండ్ అలయన్స్ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోని బీహార్‌లోని రాజకీయ పార్టీల సంకీర్ణం, ఇది బీహార్‌లో 2015 విధానసభ ఎన్నికలకు ముందు ఏర్పడింది. కూటమిలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ -CPIML (లిబరేషన్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) ఉన్నాయి. తేజస్వి యాదవ్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
రాజకీయ నాయకునిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా మాత్రమే కాక జవాహర్లాల్ నెహ్రూ రచయితగా విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1928 నుంచి పలుమార్లు తాను అనుభవించిన జైలు జీవితంలో ఖాళీ సమయాన్ని అధ్యయనంతో పాటుగా తన కుమార్తె ఇందిరకు ప్రపంచ చరిత్ర మీద ఉత్తరాలుగా రాయడంతో ప్రారంభించి క్రమేపీ పలు విశిష్టమైన, ప్రాచుర్యం పొందిన రచనలు చేశాడు. 1918 నాటికే తండ్రి ప్రారంభించిన ఇండిపెండెంట్ పత్రిక సంపాదకత్వ బాధ్యతలతో పాటు వ్యాసరచన కూడా చేసేవాడు.
తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. తేజ్ ప్రతాప్ బాధ్యతారహితంగా ప్రవర్తించడం, నిజాయితీ & కుటుంబ విలువలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ 25 మే 2025న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుండి ఆరు సంవత్సరాలు బహిష్కరించాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఆంగ్లం : All India Majlis-e-Ittehadul Muslimeen) (ఉర్దూ : کل ہند مجلس اتحاد المسلمين, కుల్ హింద్ మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అర్థం: అఖిల భారత సమైక్య ముస్లిం మండలి) భారత్ లోని, ముఖ్యంగా హైదరాబాదు పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని ప్రదేశాలలో బలమైన ఉనికి గల పార్టీ.
భారత ప్రధాన మంత్రి, భారత ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడుగా, కేంద్రమంత్రుల మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ, నామమాత్ర, ఉత్సవ సంబంధమైన దేశాధినేత అయినప్పటికీ, ఆచరణలో సాధారణంగా, కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి, వారు ఎన్నుకున్న మంత్రుల మండలికే ఉంటుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన శాసనమండలి అయిన లోక్‌సభ, భారత పార్లమెంటు దిగువసభలో మెజారిటీతో పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలకానున్న తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మూడవ తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నవంబరు 30న జరిగాయి. ఓట్లు లెక్కింపు 2023 డిసెంబరు 03న జరిగింది.ఎన్నికల సంఘం ఫలితాలు అదేరోజు ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-64, బీఆర్ఎస్-39, బీజేపీ-8, ఎంఐఎం-7, సీపీఐ-1 ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.
నెహ్రూ-గాంధీ కుటుంబం భారత రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన భారతీయ రాజకీయ కుటుంబం. వివిధ సభ్యులు సాంప్రదాయకంగా పార్టీకి నాయకత్వం వహించినందున, కుటుంబం ప్రమేయం సాంప్రదాయకంగా భారత జాతీయ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు జవాహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధాన మంత్రిగా పనిచేశారు, ఇంకా చాలా మంది పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు.
అలీనగర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దర్భంగా జిల్లా, దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అంటూర్, మోతీపూర్, అందౌలీ, ఘనశ్యాంపూర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లు, అలీనగర్, తర్దిహ్, మోతీపూర్, పూర్వ ఆంటూర్ గ్రామా పంచాయతీలు ఉన్నాయి.
కాంత 2025లో విడుదలైన పీరియాడికల్ డ్రామా సినిమా. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 28న, ట్రైలర్‌ను నవంబర్ 6న విడుదల చేయగా, సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడి నవంబర్ 7న విడుదల చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
భారత జాతీయ కాంగ్రెస్, (కాంగ్రెస్ పార్టీ, INC) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 శాసనసభను ఏర్పాటు చేయడం కోసం, 2024 మే 13న రాష్ట్రంలో 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2024 భారత సాధారణ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎకకాలంలో జరిగాయి. వోట్ల లెక్కింపు 2024 జూన్ 4న జరిగింది.
పూర్ణ స్వరాజ్ లేక భారత స్వాతంత్ర్య ప్రకటన అన్నది 1929 డిసెంబరు 19న బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి అన్ని విధాలా తెగతెంపులు చేసుకునే పూర్ణ స్వరాజ్యం లేక పూర్తి స్వయం పరిపాలన సాధించేందుకు పోరాటం చేయనున్నట్టు భారత జాతీయ కాంగ్రెస్ చేసిన తీర్మానం. లాహోర్ కాంగ్రెస్‌లో ఈ తీర్మానం ఆమోదమైంది. 1929 డిసెంబరు 31 అర్థరాత్రి నాడు జవాహర్లాల్ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు.
కిరణజన్య సంయోగ క్రియ అనగా మొక్కలు సూర్యకాంతి సమక్షంలో వాతావరణం లోని కార్బన్ డయాక్సైడ్ ని వినియోగించుకొని పిండిపదార్థాలనును తయారుచేసే జీవ రసాయనిక చర్య. ఈ జీవరసాయన ప్రక్రియలో మొక్కలు కాంతిశక్తిని వినియోగించుకొని కార్బన్ డయాక్సైడ్, నీరులను ఆక్సిజన్, పిండి పదార్ధాలుగా మారుస్తాయి. మొక్కల పత్రముల కణములలో గల హరితరేణువు (క్లోరోప్లాస్టు) అనే కణాంగం లో జరుగును.
క 2024లో విడుదలైన పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 15న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి, అక్టోబర్ 31న విడుదలైంది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అనేది భారతీయ రాజకీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో 2021లో స్థాపించబడింది. భారత ఎన్నికల సంఘం ఒకప్పటి ప్రధాన లోక్ జనశక్తి పార్టీ చిహ్నాన్ని స్తంభింపజేసి రెండు వర్గాలకు కొత్త పేరు, గుర్తును కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.