The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
అందెశ్రీ (1961 జూలై 18 - 2025 నవంబరు 10) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 1973 అక్టోబరు 10 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్‌గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు.
సాలుమరద తిమ్మక్క (1911 జూన్ 30 - 2025 నవంబరు 14), కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త. ఈమె హులికుల్ నుండి కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు. ఈమె పర్యావరణానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం భారత జాతీయ పౌర పురస్కారంతో తిమ్మక్కను గౌరవించింది.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
బీహార్ ముఖ్యమంత్రి భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి ప్రభుత్వాధినేత. భారత రాజ్యాంగం ప్రకారం, బీహార్ గవర్నరు రాష్ట్ర డి జ్యూర్ హెడ్, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. బీహార్ శాసనసభ ఎన్నికల తరువాత, గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
క్షణక్షణం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మమ్నూర్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ మండలానికి చెందిన గ్రామం. ఇది జనగణన పట్టణం 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన ఖిలా వరంగల్ మండలం లోకి చేర్చారు.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు,1996 లోశ్రీ దుర్గాఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు.దగ్గుబాటివెంకటేష్,సౌందర్య, వినీత ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం కోటి సమకూర్చారు .
తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. తేజ్ ప్రతాప్ బాధ్యతారహితంగా ప్రవర్తించడం, నిజాయితీ & కుటుంబ విలువలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ 25 మే 2025న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుండి ఆరు సంవత్సరాలు బహిష్కరించాడు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
ప్రశాంత్ కిశోర్ (జననం:1977) భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త. జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను పౌరసత్వ సవరణ చట్టం (2019) పై, పార్టీ అధిపతి అయిన నితీష్ కుమార్ అవలంబించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు గాను ఆయనను 2020 జనవరి 29న పార్టీ నుండి బహిష్కరించారు. ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్, భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
అలీనగర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దర్భంగా జిల్లా, దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అంటూర్, మోతీపూర్, అందౌలీ, ఘనశ్యాంపూర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లు, అలీనగర్, తర్దిహ్, మోతీపూర్, పూర్వ ఆంటూర్ గ్రామా పంచాయతీలు ఉన్నాయి.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలకానున్న తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
కాంత 2025లో విడుదలైన పీరియాడికల్ డ్రామా సినిమా. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 28న, ట్రైలర్‌ను నవంబర్ 6న విడుదల చేయగా, సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడి నవంబర్ 7న విడుదల చేశారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది.