The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అందెశ్రీ (1961 జూలై 18 - 2025 నవంబరు 10) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 1973 అక్టోబరు 10 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్‌గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు.
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
చెరుకూరి రామోజీ రావు ( 1936 నవంబరు 16-8 2024 జూన్ 8) ఒక భారతీయ వ్యాపారవేత్త, మీడియా యజమాని సినిమా నిర్మాత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, టీవీ ఛానళ్ల ఇటివి నెట్వర్క్, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ యాజమాన్యంలోని రామోజీ గ్రూప్‌కు రామోజీరావు అధిపతిగా ఉన్నారు రామోజీరావు సినీ నిర్మాతగా వ్యాపారవేత్తగా మీడియా అధిపతిగా పత్రికా అధినేతగా అనేక రంగాలలో రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారారు. రామోజీరావు ఇతర వ్యాపార సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా ఫుడ్స్ ఈటీవీ విన్, ఒ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
సార్ మేడమ్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 10న, ట్రైలర్‌ను జులై 17న విడుదల చేయగా, తమిళంలో తలైవన్ తలైవి పేరుతో జూలై 25న, తెలుగులో సార్ మేడమ్ పేరుతో ఆగష్టు 1న సినిమాను విడుదల చేశారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
క్షణక్షణం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి ప్రభుత్వాధినేత. భారత రాజ్యాంగం ప్రకారం, బీహార్ గవర్నరు రాష్ట్ర డి జ్యూర్ హెడ్, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. బీహార్ శాసనసభ ఎన్నికల తరువాత, గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు,1996 లోశ్రీ దుర్గాఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు.దగ్గుబాటివెంకటేష్,సౌందర్య, వినీత ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం కోటి సమకూర్చారు .
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
కాంత 2025లో విడుదలైన పీరియాడికల్ డ్రామా సినిమా. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 28న, ట్రైలర్‌ను నవంబర్ 6న విడుదల చేయగా, సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడి నవంబర్ 7న విడుదల చేశారు.
రమా రాజమౌళి ఒక భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్ , ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తుంది. రమ 2001లో వచ్చిన స్టూడెంట్ నెం: 1 సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ గా సీని రంగ ప్రవేశం చేసింది. రమ మగధీర (2009), ఈగ (2012), బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) RRR (2022) సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.
శ్రీకాంత్ బొల్లా భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త. ఆయన 2012లో హైదరాబాద్ కేంద్రంగా ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’ పేరుతో పేపర్ ప్లేట్స్ (పేపర్ అరిటాకులు), కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో స్థాపించి రూ.150 కోట్ల టర్నోవర్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా హిందీలో సినిమాగా వచ్చింది.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
కోటిలింగాల, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలో, వెల్గటూర్ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం,ప్రాచీన బౌద్ధ క్షేత్రం. ధర్మపురికి 15 కి.మీ దూరంలో వున్న కోటిలింగాలలో బయటపడిన శిలాఫలకాలు, శాతవాహనుల కాలం నాటి అంతకన్నా ముందరి రాజుల నాటి (సామగోపుని గోభద్రుడు) నాణేలు, అలాగే 2003లో పుష్కరాల సమయంలో భూమిని చదును చేస్తున్నపుడు బయటపడిన యజ్ఞవాటికలు, బౌద్ధ స్థూపాలు వాటిలో వాడిన ఇటుక, మొదలైనవి బయట పడ్డాయి. కోటిలింగాల మండల కేంద్రమైన వెల్గటూరు నుండి ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో, గోదావరి నది, పెద్దవాగు సంగమస్థలంలో ఉంది.
ఇస్లాం దీన్ (ధర్మం): ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం.అల్లాహ్ సృష్టించిన తొలి మానవుడు , ప్రథమ ప్రవక్త ఆదాము మొట్టమొదటి ముస్లిం (దైవవిదేయుడు). ముహమ్మద్ (ఆయనపై శాంతి శుభాలు వర్షించునుగాక) ఆఖరి ప్రవక్త . ఇది ముహమ్మద్ (ఆయన పై శాంతి,శుభాలు కలుగుగాక) ద్వారా పరిపూర్ణం చేయబడిన దీన్ (ధర్మం), దాదాపు 200 కోట్ల జనాభాతో ప్రపంచంలో క్రైస్తవం తరువాత ఇస్లాం రెండవ అతి పెద్దది ఇస్లాం అనునది సిల్మ్, సలాం అనే అరబ్బి పదం నుండి వచ్చింది దీని అర్థం శాంతి, ముస్లిం అనగా అల్లాహ్‌కి తన విధేయత ప్రకటించిన వ్యక్తి అని అర్ధం.