The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
2025 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
2025 తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని తెలిపారు. మెుత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ (జననం 2001 డిసెంబరు 28) భారత క్రికెట్ జట్టు తరపున ఆడే అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2023 వెస్టిండీస్ లో జరిగిన మొదటి టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, టెస్ట్ క్రికెట్ లో తన మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ఆయన దేశీయ క్రికెట్లో ముంబై తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడతాడు.
గుమ్మడి నర్సయ్య ఒక భారతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) న్యూ డెమోక్రసీ లేదా CPI (ML) లో ప్రముఖ సభ్యుడు. ఆయన 1983–1994, 1999–2009 మధ్య యెల్లండు నుండి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన నియోజకవర్గంలోని సభ్యులలో ప్రజా మనిషిగా పేరు సంపాదించారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ది గర్ల్‌ఫ్రెండ్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ & ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. రష్మికా మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 డిసెంబర్ 12న, ట్రైలర్‌ను అక్టోబర్ 25న విడుదల చేసి, సినిమాను నవంబర్ 7న విడుదల చేశారు.
అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు, క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేఅవకాశం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లీపాలు కూడా ఇవ్వాలి.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
అయోధ్య వివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద యెత్తున చేరి 1992 డిసెంబరు 6 న బాబ్రీ మసీదును కూల్చివేసారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన రాజకీయ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో, ఉత్తర ప్రదేశ్, అయోధ్య నగరంలోని 16 వ శతాబ్దపు బాబ్రీ మసీదు వారి లక్ష్యంగా మారింది. అప్పటికే సంవత్సరాలుగా వివాదం జరుగుతున్న ప్రదేశం కావడం, కొద్ది నెలలుగా మత ఘర్షణలు జరుగుతూండడం వంటివి ఈ సంఘటనకు నేపథ్యం.
'ఇటలీ రాజ్యం అనేది సార్డినియా రాజ్యం విక్టరు 2వ ఇమ్మాన్యుయేలు ఇటలీ రాజుగా ప్రకటించబడినప్పుడు 1946 జూన్ 10 వరకు ఉనికిలో ఉన్న ఏకీకృత రాజ్యం, పౌర అసంతృప్తి తరువాత సంస్థాగత ప్రజాభిప్రాయ సేకరణ తరువాత 1946 జూన్ 2న రాచరికం రద్దు చేయబడింది. దీని ఫలితంగా ఆధునిక ఇటాలియను రిపబ్లిక్కు ఏర్పడింది. దశాబ్దాలుగా కొనసాగిన ప్రక్రియలో అనేక రాష్ట్రాల ఏకీకరణ ద్వారా రాజ్యం స్థాపించబడింది.
గూనపాటి దీపక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
మడావి హిడ్మా (1974 - 2025 నవంబరు 18) భారతీయ నక్సలైట్, అతను తన నియామకం సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు. ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాలపై జరిగిన వివిధ దాడులకు, 2013లో దర్భా లోయలో జరిగిన నక్సల్ దాడికి హిడ్మాకు బాధ్యత ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆయన ఉన్నాడు.
ప్రభాస్‌గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
జటాధార 2025లో విడుదలైన థిల్లర్ సినిమా. జీ స్టూడియోస్ & ప్రేరణా అరోరా సమర్పణలో ఎస్ కే జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణా అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 8న, ట్రైలర్‌ను అక్టోబర్ 17న విడుదల చేసి, సినిమాను నవంబర్ 7న తెలుగు, హిందీలో భాషల్లో విడుదల చేశారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఆంధ్రా కింగ్ తాలూకా 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బాబు పచ్చిగొల్ల రచించి దర్శకత్వం వహించాడు. రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 12న, ట్రైలర్‌ను న విడుదల చేయగా, నవంబర్ 27న సినిమా విడుదల చేశారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు మాసములో ఏడవ తేదిన దేశమంతట చేసుకొనుట ఆనవాయితీ. సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి, శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు, వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈనాటి ప్రత్యేకత. 1949 లో రక్షణ మంత్రి కమిటీ పతాకదినోత్సవం ప్రతి ఏటా 7 డిసెంబరు న జరుపుకోవాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
సురేష్ బొబ్బిలి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. 2017లో వచ్చిన మా అబ్బాయి అనే చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సాయి పల్లవి, రానా దగ్గుపాటి నటిస్తూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విరాటపర్వం చిత్రానికీ సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.