The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
గుమ్మడి నర్సయ్య ఒక భారతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) న్యూ డెమోక్రసీ లేదా CPI (ML) లో ప్రముఖ సభ్యుడు. ఆయన 1983–1994, 1999–2009 మధ్య యెల్లండు నుండి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన నియోజకవర్గంలోని సభ్యులలో ప్రజా మనిషిగా పేరు సంపాదించారు.
2025 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు
2025 తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని తెలిపారు. మెుత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
"అమెరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (English: United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA యు.ఎస్.ఏ), సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
బాలభారతము వీనస్ మహీజా పిక్చర్స్ బ్యానర్‌పై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో సి.హెచ్.ప్రకాశరావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ పౌరాణిక సినిమా 1972, డిసెంబర్ 7వ తేదీన విడుదల అయ్యింది. ఈ చిత్రంలో సామర్ల వెంకట రంగారావు, అంజలీదేవి,బేబీ శ్రీదేవి, హరనాథ్, ఎస్ వరలక్ష్మి,కాంతారావు మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.
వేయించడం అంటే ఆహారాన్ని నూనెలో లేదా ఇతర కొవ్వులో వండటం. పెనం మీద వేయించడం మాదిరిగానే, పాన్ పై వేయించిన ఆహారాలను సాధారణంగా వంట సమయంలో ఒకటి లేదా రెండుసార్లు తిప్పి ఆహారం సమానంగా ఉడికిందని నిర్ధారించుకుంటారు, పట్టుకారు లేదా గరిటెలాంటిని ఉపయోగించి, వేయించిన ఆహారాలను "పాన్‌లో విసిరి" వండుతారు. అనేక రకాల ఆహారాలను వేయించవచ్చు.
20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలి
భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది.
గూనపాటి దీపక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
లిటిల్ హార్ట్స్ (2025 తెలుగు సినిమా)
లిటిల్ హార్ట్స్ 'నో టచింగ్... ఓన్లీ హార్ట్ టచింగ్' 2025లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు.
యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ (జననం 2001 డిసెంబరు 28) భారత క్రికెట్ జట్టు తరపున ఆడే అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2023 వెస్టిండీస్ లో జరిగిన మొదటి టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, టెస్ట్ క్రికెట్ లో తన మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ఆయన దేశీయ క్రికెట్లో ముంబై తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడతాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
ది గర్ల్‌ఫ్రెండ్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ & ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. రష్మికా మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 డిసెంబర్ 12న, ట్రైలర్‌ను అక్టోబర్ 25న విడుదల చేసి, సినిమాను నవంబర్ 7న విడుదల చేశారు.
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమాకు మహేష్ బాబు పచ్చిగొల్ల రచించి దర్శకత్వం వహించాడు. రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 12న, ట్రైలర్‌ను న విడుదల చేయగా, నవంబర్ 27న సినిమా విడుదల చేశారు.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
పలాష్ ముచ్చల్ (జననం 1995 మే 22) ఒక భారతీయ సంగీత స్వరకర్త, చిత్ర నిర్మాత. గుండె జబ్బుల వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అవసరమైన పేద పిల్లల కోసం నిధులు సేకరించడానికి ఆయన, అతని అక్క పాలక్ ముచ్చల్ భారతదేశం, విదేశాలలో రంగస్థల ప్రదర్శనలు చేస్తున్నారు. మే 2013 నాటికి వారు ఆమె స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా 25 మిలియన్ల రూపాయల నిధులను సేకరించారు, ఇది గుండె జబ్బులతో బాధపడుతున్న 885 మంది పిల్లల ప్రాణాలను కాపాడటానికి సహాయపడింది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
సురేష్ బొబ్బిలి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. 2017లో వచ్చిన మా అబ్బాయి అనే చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సాయి పల్లవి, రానా దగ్గుపాటి నటిస్తూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విరాటపర్వం చిత్రానికీ సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాలకి ఆయన జన్మదినానికి 30 సంవత్సరాలు తేడా ఉంది ఎవడో ఒక అబద్ధాన్ని ఇక్కడ క్రియేట్ చేశాడు ఉపవాస దినాలు తర్వాతనే క్రిస్టమస్ అనేది వస్తుందని అది తప్పు వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
రీతూ చౌదరి భారతీయ టెలివిజన్ నటి. ఆమె కుచ్ ఝుకీ పల్కైన్లో నియతి వంశ్ ఖన్నా , క్యుంకీ సాస్ భీ కభీ బహు థీలో శోభా విరాణి , దిల్ నా జానే క్యూన్లో మానసి అమర్ జైట్లీ, ఆవాజ్‌లో రితికా భాకర్ గుప్తా – దిల్ సే దిల్ తక్ , వేదశ్రీ శేఖర్ రాథోడ్ , నాజర్కాలో సున్పతి శేఖర్ రాథోడ్ , నాజర్కాలో త్రితా పన్కాలో నటించారు. ఇమ్లీ టీవీ షోలో కనిపించే నటి రీతు సేథ్, షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి మొత్తం బృందం హైదరాబాద్‌కు మారాల్సి వచ్చినప్పుడు తాను మొదట్లో అసంతృప్తిగా ఉన్నానని అంగీకరించింది.