The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఈస్టర్ డే అనేది క్రైస్తవ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి 22, ఏప్రిల్ 25 మధ్య వచ్చే వసంత విషువత్తు తరువాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత మొదటి ఆదివారం నాడు జరుపుకుంటారు. పవిత్ర బైబిల్ యేసుక్రీస్తు పునరుత్థానానికి దారితీసిన, అనుసరించే సంఘటనలను వివరిస్తుంది, విశ్వాసులకు గొప్ప, శక్తివంతమైన కథనాన్ని అందిస్తుంది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022 కు బీసీసీఐ ప్రకటించిన పదిహేడు మంది సభ్యులలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆయన 2025 ఐపీఎల్లో ఏప్రిల్ 14న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచుతో అరంగేట్రం చేశాడు.
రాజులుగా పిలవబడే ఈ కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.వీరు తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు హిందూ మతాన్ని ఆచరించారు.నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్టా, ఉభయ గోదావరి జిల్లాలలోను, విశాఖ,విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు ఓసి విభాగానికి చెందుతారు. కర్నాటక రాష్ట్రంలో బీసీ విభాగానికి చెందుతారు.వీరు స్థానికంగా భూస్వామ్య కులంగా పిలుస్తారు.బ్రిటీష్ పాలన వీరు జమీందారులుగా ఉండేవారు.ఆంధ్ర ప్రాంతంలో అసలు సూర్య వంశ రాజు క్షత్రియ వర్ణం లేనప్పటికీ వర్ణ వ్యవస్థలో క్షత్రియ హోదాలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గమైన బలిజ,తెలగ/కాపులు, ముఖ్యముగా తెలుగు నాట ప్రముఖమైన సామాజిక వర్గము.ఈ కులము ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా లలో విస్తరించి ఉంది. ఈ కులంలో ప్రాంతాలను బట్టి అనేక పేర్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఒడెలా 2'. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్, సంగీతం: బి.అజనీష్ లోక్ నాథ్.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) ) ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
ఓదెల రైల్వేస్టేషన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించగా అశోక్‌తేజ దర్శకత్వం వహించాడు. వశిష్ఠ సింహ, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజిత పొన్నాడ, నాగమహేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో ఆగష్టు 26న విడుదలైంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
నగరం లేదా నగరాలు (ఆంగ్లం: City), అంటే విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం లేదా జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించి జనాభా కలిగియున్న జనావాస ప్రాంతం/ప్రాంతాలను నగరం లేదా నగరాలు అని అంటారు. ఇవి చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేక అధికారం కలిగి స్వయంపరిపాలన, అనేక చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.వీటిని నిర్వచించటంలో భారత జనాభా గణాంకాల శాఖ ప్రముఖ పాత్ర వహించింది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా
షెడ్యూల్డు కులాలు అనగా (ఎస్సీల్లో) చేర్చడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన అర్హత - ‘సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం. ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కోకులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది. ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం.
వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) అనేది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే అఖిల భారతదేశ సాధారణ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. అత్యంత కఠినమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఒకటిగా దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. 2012 లో, అంతకు పూర్వం ప్రభుత్వం నడుపుతున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే AIEEE, ఐఐటీ-జేఈఈ స్థానంలో ఈ సాధారణ పరీక్షను ప్రభుత్వం ప్రకటించింది.
మజాకా 2025లో విడుదలైన తెలుగు సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 23న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేశారు.