The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఒడెలా 2'. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్, సంగీతం: బి.అజనీష్ లోక్ నాథ్.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
జేమ్స్ డేవిడ్ వాన్స్ (జననం జేమ్స్ డోనాల్డ్ బౌమాన్; ఆగస్టు 2, 1984) ఒక అమెరికన్ రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, మెరైన్ కార్ప్స్ అనుభవజ్ఞుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న యునైటెడ్ స్టేట్స్ 50వ ఉపాధ్యక్షుడు. రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) సభ్యుడైన ఆయన 2023 నుండి 2025 వరకు యుఎస్ సెనేట్‌లో ఒహియోకు ప్రాతినిధ్యం వహించారు. వాన్స్ ఒహియోలోని మిడిల్‌టౌన్‌లో జన్మించాడు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్‌లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్‌పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా
షెడ్యూల్డు కులాలు అనగా (ఎస్సీల్లో) చేర్చడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన అర్హత - ‘సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం. ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కోకులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది. ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
భారతదేశంలో బహుళ-పార్టీ వ్యవస్థ ఉంది. భారత ఎన్నికల సంఘం, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా గుర్తింపునిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ రిజర్వు చేయబడిన పార్టీ చిహ్నం, ప్రభుత్వ టెలివిజన్, రేడియోలో ఉచిత ప్రసార సమయం, ఎన్నికల తేదీల సెట్టింగ్‌లో సంప్రదింపులు, ఎన్నికల నియమాలు, నిబంధనలను రూపొందించడం, ఇన్పుట్ ఇవ్వడం వంటి అధికారాలను పొందుతుంది.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) ) ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.
కార్ల్ మార్క్స్ (మే 5, 1818 - మార్చి 14, 1883) జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్‌లో జీవితం గడిపాడు.
1947, అక్టోబర్ 26న చికాగోలో జన్మించిన హిల్లరీ డయాన్ రోధమ్ క్లింటన్ (Hillary Rodham Clinton) రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి. ఒక అమెరికన్ రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆమె అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆధ్వర్యంలో 67వ యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా 2009 నుండి 2013 వరకు యునైటెడ్ స్టేట్స్ కు, 2001 నుండి 2009 వరకు న్యూయార్క్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సెనేటర్, ఆమె 1993 నుండి 2001 వరకు U.S. ప్రథమ మహిళ. డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు, ఆమె 2016 U.S. అధ్యక్ష ఎన్నికలకు పార్టీ నామినీ, U.S. ద్వారా అధ్యక్ష నామినేషన్‌ను గెలుచుకున్న మొదటి మహిళ.
తూర్పు గోదావరి జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. రాజమహేంద్రవరం దీని ముఖ్యపట్టణం. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, దీనిలో కొన్ని ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చేర్చగా, గతంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు.
అడోబీ ఫోటోషాప్ (Adobe Photoshop) లేక ఫోటోషాప్, ఫోటోలపై (ఛాయా చిత్రాలు) మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. ఈ సాఫ్టువేరును ఉపయోగించి ఫోటోలను కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీనిని అభివృద్ధి చేస్తూ, అమ్మకం చేస్తున్నది అడోబీ సిస్టమ్స్ (Adobe systems).
దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి.
భారత ఆర్ధిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ (PPP-పిపిపి) లెక్కల బట్టి 3.36 ట్రిలియన్ డాలర్ల జిడిపితో ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. డాలర్ మారక ద్రవ్య విలువల బట్టి చూసినా, భారత్ 691.87 బిలియన్ డాలర్ల GDP తో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది. 2005 మొదటి త్రైమాసికం నాటికి భారత్ 8.1 శాతం పెరుగుదలతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
ఓదెల రైల్వేస్టేషన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించగా అశోక్‌తేజ దర్శకత్వం వహించాడు. వశిష్ఠ సింహ, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజిత పొన్నాడ, నాగమహేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో ఆగష్టు 26న విడుదలైంది.
ఐస్లాండ్ (ఆంగ్లం : The Republic of Iceland) అధికారిక నామం ది రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం.దేశం ఆగ్నేయప్రాంతంలో మూడింట రెండు వంతుల ప్రజలు నివసిస్తున్నారు.ఐరోపాలో జనసాధ్రత తక్కువగా ఉన్న దేశంగా గుర్తించబడుతుంది. భౌగోళికంగా ఐస్లాండ్ అగ్నిపర్వతాలు చురుకుగా ఉన్నాయి.లోతట్టు మైదానప్రాంతంలో ఇసుక భూములు, లావా ప్రాంతాలు ఉన్నాయి.ఈ దేశం ఐరోపా ఖండంలోని ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 1,03,000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఒక చిన్న ద్వీపం. ఇప్పుడు (2009) దీని జనాభా 3,20,000 మంది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారత, భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణపాండవీయం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జనవరి,13, 1966 లో విడుదలయింది. "పరిత్రాణీయా సాధునాం, వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్ధాపనార్ధాయ సంభవామి యుగే యుగే" అని భగవద్గీతలో పలికిన శ్రీకృష్ణుడు ధర్మపథంలో నడిచే పాండవులను కష్టంలో కాపాడి, వారి అభ్యుదయానికి దోహద పడిన విధానం ఈ చిత్రకథ.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గం
మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలం ఈ నియోజకవర్గంలో భాగం కాగా, ఇది వరకు ఉన్న గోపాలపేట మండలం వనపర్తి నియోజకవర్గానికి తరలించబడింది.