The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సింధు నదీజలాల ఒప్పందం అన్నది ప్రపంచ బ్యాంకు (అప్పట్లో అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకు) మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం. ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు మూడు - బియాస్, రావి, సట్లెజ్ లపై భారతదేశానికి, మూడు పశ్చిమ నదులు - సింధు, చీనాబ్, ఝీలంలపై పాకిస్తాన్‌కూ నియంత్రణ ఉంటుంది.
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. 2013 నవంబరు 16 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
భర్త పట్ల క్రౌర్యం అనగా స్త్రీల రక్షణ కొరకు ఉన్న చట్టాలను తనకనుకూలంగా ఉపయోగించుకొని భర్త, అయన కుటుంబీకులు ప్రమేయం లేనప్పటికిని దుర్వినియోగం చేస్తూ, డబ్బు కోసం వేధిస్తూ భయపెట్టడం. కొన్ని సందర్భాలలో శారీరకంగానూ, మాససికంగానూ, సామాజికం గానూ భర్తను వేధించటం. చట్టం స్త్రీలకే అనుకూలంగా ఉన్నది అనే భ్రమ నెలకొని ఉండటం మూలాన భార్య/ఆమె కుటుంబీకులు/ఆమె బంధుమిత్రులు తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరించటం, వాటికి కట్టుకొన్న భర్త ఒప్పుకోని పక్షంలో స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలనే అమాయక భర్త పై అస్త్రాలుగా ప్రయోగించటం/లేదా ప్రయోగిస్తామని బెదిరించటమే "భర్త పట్ల క్రౌర్యం".
2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
మహారాష్ట్ర శాసనసభలోని మొత్తం 288 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబరు 20న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో 66.05% పోలింగ్ నమోదైంది. ఇది 1995 తర్వాత అత్యధికం.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.
గుప్త సామ్రాజ్యము భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం (సంస్కృతం:samskrutam: गुप्त राजवंश, గుప్త రాజవంశం) గుప్త వంశపు రాజులచే సుమారు సా.శ.280 నుండి సా.శ.550 వరకు పాలించబడింది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్,రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. పాటలీపుత్ర (ప్రస్తుత బీహారు రాజధాని పాట్నా) వీరి రాజధానిగా ఉంది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)
పంచాయితీ గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ. దీనినే స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థని, భారతదేశంలో పంచాయతీ రాజ్ అని అంటారు. నేపాల్‌లో కూడా ఇలాంటి పంచాయితీ వ్యవస్థ నడుస్తుంది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది.
మే (May),జూలియన్, గ్రెగోరియన్ క్యాలెండర్లు ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఐదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.సంవత్సరంలో 31 రోజులున్న 7 నెలలులో మూడవది. "మే " ఉత్తరార్ధగోళంలో, వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు వాతావరణం కలిగి ఉంటుంది.అందువల్ల, దక్షిణార్ధగోళంలో మే, ఉత్తరార్ధగోళంలో నవంబరుతో సమానమైన కాలానుగుణమైంది, దీనికి విరుద్ధంగా ఉంటుంది.యునైటెడ్ స్టేట్స్, కెనడాలో వేసవి సెలవుల కాలం సాధారణంగా మే తో ఆలస్యంగా ప్రారంభమవుతుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆంగ్లభాషలో Indian Institute of Technology) భారతదేశం యొక్క ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలో ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి. వీటన్నింటికీ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
జమ్మూ కాశ్మీరు (Jammu and Kashmir), /dʒəmmuː ənd kəʃmiːr/, కాశ్మీరీ:ज्वम त॒ कॅशीर, హిందీ:जम्मू और कश्मीर, ఉర్దూ:جموں و کشمیر) భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రముంది.
అక్టోబరు (October), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో పదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.అక్టోబరు నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబరు రెండవ నెల.పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబరులో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
సారంగపాణి జాతకం 2024లో విడుదలకానున్న సినిమా. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేశ్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 21న నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయగా, డిసెంబరు 20న విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
నవంబరు (November), జూలియన్, గ్రెగోరియన్ క్యాలెండర్ల ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో పదకొండవ నెల.ఈ నెలలో 30 రోజులు ఉన్నాయి.సా.శ.ఫూ.750లో రోములస్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఇది తొమ్మిదివ నెలగా ఉంది. రోమన్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చినప్పుడు, నవంబరు నెల తొమ్మిదివదిగా మారి, దాని పేరును నిలుపుకుంది. (లాటిన్లో దీనికి "తొమ్మిది" అని అర్ధం సూచిస్తుంది) నిలుపుకుంది.
చీనాబ్ నది, భారతదేశం, పాకిస్తాన్లలో ప్రవహించే ఒక ప్రధాన నది.ఇది పంజాబ్ ప్రాంతంలో ప్రవహించే 5 ప్రధాన నదులలో ఒకటి.భారతదేశం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లాహౌల్, స్పితి జిల్లాలోని ఎగువ హిమాలయాలనుండి వృద్ధిచెందింది.ఉచ్ షరీఫ్ నగరానికి సమీపంలో ఉన్న సింధు నదిలోకి ప్రవహించే ముందు జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ ప్రాంతం గుండా పాకిస్తాన్‌లోని పంజాబ్ మైదానంలోకి ప్రవహిస్తుంది. సింధు జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం చెనాబ్ జలాలను పాకిస్తాన్‌కు కేటాయించారు. సింధూ నది ఉపనదులలో ఒకటైన చీనాబ్ నది (Chenab River) హిమాచల్ ప్రదేశ్‌లో చంద్ర, భాగ అనే రెండు నదుల కలయిన వలన ఏర్పడింది.
22 ఏప్రిల్ 2025న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు హిందూ పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు, కనీసం 28 మంది మరణించాగా 20 మందికి పైగా గాయపడ్డారు. 2019 పుల్వామా బాంబు దాడి తరువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాణాంతకమైన ఈ దాడి, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్ లోయలో జనాభా మార్పులను నిరోధించడమే లక్ష్యంగా జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో పర్యాటకులు, అధికారులతో సహా కనీసం 28 మంది మరణించారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు.
2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్ లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది.
యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ (జననం 2001 డిసెంబరు 28) భారత క్రికెట్ జట్టు తరపున ఆడే అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2023 వెస్టిండీస్ లో జరిగిన మొదటి టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, టెస్ట్ క్రికెట్ లో తన మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ఆయన దేశీయ క్రికెట్లో ముంబై తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడతాడు.
అట్రోపిన్ అనేది (S)-, (R) -అట్రోపిన్ యొక్క ఈక్విమోలార్ సాంద్రతలతో కూడిన రేస్మేట్(racemate).రేస్మేట్ అనగా ఒకే సమ్మేళనం యొక్క సమాన మొత్తంలో డెక్స్ట్రోరోటేటరీ, లెవోరోటేటరీ రూపాలతో కూడిన, దృవణ క్రియాశీలంగా లేని సమ్మేళనం లేదా మిశ్రమానికి సంబంధించినది, లేదా ఏర్పరుచునది.అట్రోపిన్ ఒక ఆల్కలాయిడ్. ఇది ప్రాణాంతకమైన నైట్‌షేడ్ (అట్రోపా బెల్లడోన్నా) మొక్కల నుండి ]మరియు సోలనేసి కుటుంబానికి చెందిన ఇతర మొక్కల నుండి లభిస్తుంది.ఇది మస్కారినిక్ విరోధి, అనస్థీషియా సహాయక మందు,యాంటీ అరిథ్మియా డ్రగ్, మైడ్రియాటిక్ ఏజెంట్, పారా సింపథో లిటిక్, బ్రోంకోడైలేటర్ ఏజెంట్, ప్లాంట్ మెటాబోలైట్, సారిన్ పాయిజనింగ్‌కు విరుగుడుగా, వన్ఇరోజెన్గా పాత్రను కలిగి ఉంది.ఇది ఒక (S)-అట్రోపిన్, a (R)-అట్రోపిన్ను కలిగి ఉంటుంది. అట్రోపిన్ ఒక యాంటికోలినెర్జిక్, కోలినెర్జిక్ మస్కారినిక్ విరోధి.అట్రోపిన్ చర్య యొక్క విధానం కోలినెర్జిక్ విరోధి, కోలినెర్జిక్ మస్కారినిక్ విరోధి.అట్రోపిన్ సాపేక్షంగా చవకైన ఔషధం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చే అవసరమైన ఔషధాల జాబితాలో అట్రోపిన్ చేర్చబడింది.
భారత పాకిస్తాన్ యుద్ధాలు, ఘర్షణలు
1947 లో దేశ విభజన తరువాత భారతదేశం, పాకిస్తాన్ల మధ్య అనేక యుద్ధాలు ఘర్షణలూ జరిగాయి. 1971 యుద్ధాన్ని మినహాయించి మిగిలిన ప్రధాన ఘర్షణలన్నిటికీ కాశ్మీర్ సమస్య, సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదమే ప్రధాన కారణాలు. 1971 యుద్ధం ఆనాటి తూర్పు పాకిస్తాన్‌ను (ప్రస్తుత బంగ్లాదేశ్) విముక్తి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం వల్ల జరిగింది.
స్టీఫెన్ విలియం హాకింగ్ (1942 జనవరి 8 - 2018 మార్చి 14) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు (విశ్వనిర్మాణ శాస్త్రవేత్త). మరణించే సమయానికి ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీకి రీసెర్చ్ సంస్థకి డైరెక్టరుగా ఉన్నాడు. ఈయనకు 21 ఏళ్ళ వయసులో మొదలైన ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు క్రమక్రమంగా విస్తరిస్తూ పోయింది.
రాజమహేంద్రవరం (రాజమండ్రి, రాజమహేంద్రి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని రాజధాని. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది.