The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సింధు నదీజలాల ఒప్పందం అన్నది ప్రపంచ బ్యాంకు (అప్పట్లో అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకు) మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం. ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు మూడు - బియాస్, రావి, సట్లెజ్ లపై భారతదేశానికి, మూడు పశ్చిమ నదులు - సింధు, చీనాబ్, ఝీలంలపై పాకిస్తాన్‌కూ నియంత్రణ ఉంటుంది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
22 ఏప్రిల్ 2025న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు హిందూ పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు, కనీసం 28 మంది మరణించాగా 20 మందికి పైగా గాయపడ్డారు. 2019 పుల్వామా బాంబు దాడి తరువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాణాంతకమైన ఈ దాడి, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్ లోయలో జనాభా మార్పులను నిరోధించడమే లక్ష్యంగా జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో పర్యాటకులు, అధికారులతో సహా కనీసం 28 మంది మరణించారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
విజయనగరం జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉంది. జిల్లా కేంద్రం విజయనగరం. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధి ప్రాతిపదికగా జిల్లా చేయుటకు, పార్వతీపురం రెవెన్యూ డివిజనులోని 11 మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో చేర్చి, శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజనులోని 4 మండలాలు జిల్లాలో కలిపారు.
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
చూడండి తెలుగు సాహిత్య విభాగాలు, రచయితల జాబితా కొందరు సాహితీకారులు బహుముఖ ప్రజ్ఞాశాలురు (ఉదాహరణ: కందుకూరి వీరేశలింగం, విశ్వనాధ సత్యనారాయణ). అనేక రంగాలలో ఖ్యాతి వహించినవారు. అటువంటివారి పేర్లను కేవలం వర్గీకరణ కోసం ఈ క్రింద ఏదో ఒక ప్రధాన శీర్షికలో చేర్చవచ్చును.
సారంగపాణి జాతకం 2024లో విడుదలకానున్న సినిమా. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేశ్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 21న నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయగా, డిసెంబరు 20న విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
బెనిన్ Benin ( beh-NEEN, bih-NEEN; అధికారికంగా " రిపబ్లిక్కు ఆఫ్ బెనిన్ " అంటారు. దీనికి సరిహద్దుగా పశ్చిమసరిహద్దులో టోగో, తూర్పుసరిహద్దులో నైజీరియా, ఉత్తరసరిహద్దులో బుర్కినా ఫాసో, నైజర్ ఉన్నాయి. ప్రజలలో అధికభాగం అట్లాంటికు మహాసముద్రం ఉత్తరప్రాంతంలో ఉన్న ఉష్ణమండలంలో భాగంగా ఉన్న గినియా గల్ఫులోని బైటు ఆఫ్ బెనిన్ దక్షిణ తీరప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ. పూర్వం నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది.నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి జిల్లా, ఈశాన్యాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లా, తూర్పున కృష్ణా జిల్లాలు, పశ్చిమాన శంషాబాద్ మండలం, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022 కు బీసీసీఐ ప్రకటించిన పదిహేడు మంది సభ్యులలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆయన 2025 ఐపీఎల్లో ఏప్రిల్ 14న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచుతో అరంగేట్రం చేశాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.
జమ్మూ కాశ్మీరు (Jammu and Kashmir), /dʒəmmuː ənd kəʃmiːr/, కాశ్మీరీ:ज्वम त॒ कॅशीर, హిందీ:जम्मू और कश्मीर, ఉర్దూ:جموں و کشمیر) భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రముంది.
పోరంకి, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం జనగణన పట్టణం.ఇది విజయవాడకు పొరుగు ప్రాంతం, జనగణన పట్టణంగా ఉంది. ఇది సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తులో ఉంది.2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంటు జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
వికీలీక్స్ వికీమీడియా ప్రాజెక్ట్ లో భాగం , అందువల్ల వికీపీడియాతో ఎటువంటి అనుబంధము లేదు వీకీలీక్స్ ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. మామూలుగా, అందరికి అందుబాటులోలేని సమాచారాన్ని, పత్రాలను, దస్తావేజులను, చిత్రాలను , రహస్యంగా, గుప్తచారుల ద్వారా సేకరించి, సమూకరించి ప్రచురిస్తుంది. అంతేకాదు, సంస్థకోసం మాత్రమే ఇంటర్నెట్లో పొందుపరచబడిన గుప్తసమాచారాన్ని క్రోడీకరించి ప్రచురిస్తుంది.
నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం ఆర్థికశాస్త్ర బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది.
ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.
బెనజీర్ భుట్టో (సింధీ: بينظير ڀُٽو; 1953 జూన్ 21 – 2007 డిసెంబరు 27) పాకిస్తాన్ 11వ ప్రధానమంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు. ఒక ముస్లిం సంఖ్యాధిక్య దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళ, అలాంటి దేశానికి రెండు మార్లు ప్రధాని అయిన ఏకైక మహిళ. ఆమె 1970ల్లో పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసిన జుల్ఫీకర్ అలీ భుట్టో కుమార్తె.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.