The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
హిట్: ది థర్డ్ కేస్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 ఫిబ్రవరి 24న, ట్రైలర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేసి, సినిమాను 2025 మే 1న విడుదల చేశారు.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
3 రోజెస్ 2021లో తెలుగులో విడుదలైన వెబ్ సిరీస్. యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సిరీస్‌కు రవి నంబూరి కథ అందించగా, మ్యాగీ దర్శకత్వం వహించాడు. పూర్ణ, ఈషా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, ఇషాన్, ప్రిన్స్, సంగీత్ శోభన్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఫస్ట్ పోస్టర్ ను అక్టోబర్ 1న, టీజర్‌ను నవంబర్ 6న విడుదల చేసి, నవంబర్ 12న ఆహా ఓటిటిలో విడుదలైంది.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
కొత్తకోట, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న కొత్తకోట పురపాలకసంఘంగా ఏర్పడింది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం (ప్రపంచ పత్రికా దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (18 జూలై, 1918 - డిసెంబరు 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశానికి ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారత దేశానికి వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి.
డెన్మార్క్ (English: Denmark, Danish: Danmark - దానుల నేల అని అర్ధం), అధికార డెన్మార్క్ రాజ్యం (English: Kingdom of Denmark కింగ్డం ఆఫ్ డెన్మార్క్, Danish: Kongeriget Danmark), మూడు స్కాండినేవియన్ దేశాల్లో ఒకటి. ఇది నార్డిక్ దేశం, సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఉంది. ప్రధాన భూభాగం దక్షిణ సరిహద్దులో జర్మనీ, ఈశాన్య సరిహద్దులో స్వీడన్, ఉత్తర సరిహద్దులో నార్వే ఉన్నాయి.
జూలై (July) నెల, జూలియన్,గ్రెగోరియన్ క్యాలెండర్లు ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఏడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.పురాతన రోమన్ క్యాలెండర్లో ఐదవ నెల కావడంతో జూలై నెలను గతంలో లాటిన్లో "క్విన్టిలిస్" అని పిలిచేవారు. జూలియన్ క్యాలెండర్ సంస్కరణ సందర్భంగా జూలియస్ సీజర్ గౌరవార్థం నెల పేరు జూలైగా మార్చబడింది.
లాల్ బహదూర్ శాస్త్రి ( వినండి ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
సైమన్ కమీషన్ (Simon Commission) అనగా సర్ జాన్ సైమన్ (Sir John Simon) అధ్యక్షతన ఏడుగురు సభ్యులుతో 1927 సంవత్సరమున భారతదేశ రాజ్యాంగ సంస్కరణసూచించే బాధ్యతనిర్వహించు నిమిత్తము ఇంగ్లండులో నెలకొలపబడిన రాజ్యాంగ వ్యవస్థ (రాజ్యాంగాధికారముతో నియమించబడ్డ విచారణ సంఘము). సైమన్ విచారణ సంఘము ( Simon committee) భారతదేశానికి 1928 సంవత్సరము ఫిబ్రవరి మాసములో పర్యటించుటకు వచ్చింది. ఆ విచారణ సంఘముయెక్క నియామకము, భారతదేశ పర్యటన గవర్నర్ జనరల్ (వైస్రాయి) లార్డు ఇర్విన్ పరిపాలించుచుండిన (1925-1931) కార్యకాలమందు జరిగిన ప్రముఖమైన బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022 కు బీసీసీఐ ప్రకటించిన పదిహేడు మంది సభ్యులలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆయన 2025 ఐపీఎల్లో ఏప్రిల్ 14న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచుతో అరంగేట్రం చేశాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
1947, అక్టోబర్ 26న చికాగోలో జన్మించిన హిల్లరీ డయాన్ రోధమ్ క్లింటన్ (Hillary Rodham Clinton) రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి. ఒక అమెరికన్ రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆమె అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆధ్వర్యంలో 67వ యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా 2009 నుండి 2013 వరకు యునైటెడ్ స్టేట్స్ కు, 2001 నుండి 2009 వరకు న్యూయార్క్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సెనేటర్, ఆమె 1993 నుండి 2001 వరకు U.S. ప్రథమ మహిళ. డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు, ఆమె 2016 U.S. అధ్యక్ష ఎన్నికలకు పార్టీ నామినీ, U.S. ద్వారా అధ్యక్ష నామినేషన్‌ను గెలుచుకున్న మొదటి మహిళ.
స్పానిష్ లేక కస్తీలియన్ (castellano) ఒక రోమనుల భాష. ఇది ఉత్తర స్పెయిన్‌లో మొదలై, కస్తీల్ సామ్రాజ్యం ద్వారా విస్తరించబడి, పాలనా వ్యవహారాలు నెరపడంలోను, వ్యాపార సంబంధాలలోను ప్రధాన భాషగా వృద్ధి చెందింది. తర్వాత ఈ భాష 15-19 శతాబ్దాల మధ్య స్పానిష్ సామ్రాజ్య విస్తరణతో అమెరికా,ఆఫ్రికా మరియూ స్పానిష్ ఈస్టిండీస్లకు వ్యాపించింది.
సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్ప దేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి, ఇతర సర్పాలు సుబ్రమణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
2007 ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ వెస్ట్ ఇండీస్ లో 13 మార్చి నుండి 2007 ఏప్రిల్ 28, వరకు జరిగింది. అది తొమ్మిదవ ప్రపంచ క్రికెట్ కప్, ఇందులో ఆటలన్నీ మామూలు వన్డే ఇంటర్నేషనల్ లాగే జరిగాయి.మొత్తం 51 మ్యాచ్ లు ఆడారు, 2003 ప్రపంచ క్రికెట్ కప్ కన్నా మూడు మ్యాచ్ లు ఎక్కువ ఆడారు. (2003 కన్నా రెండు జట్లు పెరిగాయి).
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
హిట్:ది ఫస్ట్ కేస్ 2020, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ సారథ్యంలో శైలేష్ కొలను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, భాను చందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది.