The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
హిట్: ది థర్డ్ కేస్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 ఫిబ్రవరి 24న, ట్రైలర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేసి, సినిమాను 2025 మే 1న విడుదల చేశారు.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలి
భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది.
అడోబీ ఫోటోషాప్ (Adobe Photoshop) లేక ఫోటోషాప్, ఫోటోలపై (ఛాయా చిత్రాలు) మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. ఈ సాఫ్టువేరును ఉపయోగించి ఫోటోలను కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీనిని అభివృద్ధి చేస్తూ, అమ్మకం చేస్తున్నది అడోబీ సిస్టమ్స్ (Adobe systems).
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
జిఒఎపి అని సంక్షిప్తీకరించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనకు బాధ్యత వహించే రాష్ట్ర ప్రభుత్వపరిపాలనా సంస్థ. ఇది అమరావతి రాష్ట్ర రాజధాని, రాష్ట్ర కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థ అధిపతిని కలిగి ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం, డి జ్యూర్ ఎగ్జిక్యూటివ్ అధికారం గవర్నర్‌కు ఉంటుంది, అయితే వాస్తవ అధికారం ముఖ్యమంత్రి, అతని మంత్రివర్గం ద్వారా లేదా వారి సలహాపై మాత్రమే అమలవుతుంది.
చంద్రశేఖరేంద్ర సరస్వతి (1894 మే 20 – 1994 జనవరి 8) కంచి కామకోటి పీఠం జగద్గురుగా అధిష్టించిన వారి వరసక్రమంలో 68వ వ్యక్తి. పీఠం అధిష్టించినప్పటి నుండి పీఠం అదిష్టించినవారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటాడు.
లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి
సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠానికి 71వ ఉత్తరాధికారిగా నియమితులయ్యాడు. 2025 ఫిబ్రవరి 30న అక్షయ తృతీయ సందర్భంగా అతనిని 70వ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల ద్వారా సన్యాస దీక్ష స్వీకరించాడు. విజయేంద్ర సరస్వతి గణేష్ శర్మను సన్యాస దీక్షనిచ్చి "శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి" గా నామకరణం చేశారు.
నారాయణపేట, తెలంగాణ రాష్ట్రములోని నారాయణపేట జిల్లా, నారాయణపేట మండలానికి చెందిన గ్రామం/పట్టణం. ఇది హైదరాబాదుకు 168 కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. 2016 అక్టోబరు 11 న పునర్వ్యవస్థీకరించిన మహబూబ్ నగర్ జిల్లాలో చేరిన ఈ గ్రామం, 2019 ఫిబ్రవరి 17 న నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసినపుడు, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.
భారతదేశంలో విద్య ప్రధానంగా ప్రభుత్వం నడిపే విద్యావ్యవస్థచే నిర్వహించబడుతుంది, ఇవి కేంద్ర, రాష్ట్ర, స్థానిక అనే మూడు స్థాయిలలోని ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనల క్రింద ఉచిత, నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం, 2009 ప్రకారం, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడుతుంది. భారతదేశంలోని ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి 7: 5.
Netherton Tunnel Branch Canal, in the West Midlands county, England, is part of the Birmingham Canal Navigations, (BCN). It was constructed at a 453–foot elevation, the Wednesbury or Birmingham level; it has no locks. The total length of the branch canal is 2.4 మైళ్లు (3.9 కి.మీ.) and the canal tunnel is 9,081 అడుగులు (2,768 మీ.) long.
సెప్టెంబరు (September), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో తొమ్మిదవ నెల. ఈ నెలలో 30 రోజులు ఉన్నాయి.రోమన్ క్యాలెండరు ప్రకారం అసలు సంవత్సరంలో సెప్టెంబరు ఏడవ నెలగా ఉండేది.దానిపేరు ఇక్కడే నిర్ణయించబడింది.తరువాత క్యాలెండరుకు జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చినప్పుడు ఇది తొమ్మిదవ నెలగా మారింది.బ్రిటిష్ వారు 1752 లో జూలియన్ క్యాలెండరు నుండి గ్రెగోరియన్ క్యాలెండరుకు మారినప్పుడు, నెలలతో సీజన్లను సమలేఖనం చేయడానికి వారు కొన్ని రోజులు సర్దుబాటు చేసారు.సెప్టెంబరు నెల నుండి నేరుగా సెప్టెంబర్ 3 నుండి 14 వరకు 11 రోజులు తీసుకున్నారు.1752 లో సెప్టెంబర్ 3, 13 మధ్య రోజులు బ్రిటిష్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
1967 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా దిగువనీయబడింది.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
waiting for results అగ్నికులక్షత్రియులు అనే కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఏ విభాగానికి చెందుతారు. నేడు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్టా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.
అల్లూరి సీతారామ రాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల కొంత భాగాలను కలిపి 2022లో కొత్తగా ఏర్పరచిన జిల్లా. ఈ ప్రాంతం నుండి వచ్చిన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు ఈ జిల్లాకు పెట్టడం జరిగింది. జిల్లా కేంద్రం పాడేరు పట్టణం కాగా, వారానికి రెండు రోజులు జిల్లా కలెక్టరు రంపచోడవరం గ్రామంలో బసచేస్తారు.
స్పానిష్ లేక కస్తీలియన్ (castellano) ఒక రోమనుల భాష. ఇది ఉత్తర స్పెయిన్‌లో మొదలై, కస్తీల్ సామ్రాజ్యం ద్వారా విస్తరించబడి, పాలనా వ్యవహారాలు నెరపడంలోను, వ్యాపార సంబంధాలలోను ప్రధాన భాషగా వృద్ధి చెందింది. తర్వాత ఈ భాష 15-19 శతాబ్దాల మధ్య స్పానిష్ సామ్రాజ్య విస్తరణతో అమెరికా,ఆఫ్రికా మరియూ స్పానిష్ ఈస్టిండీస్లకు వ్యాపించింది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.