The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాల జాబితా
ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాల జాబితా, ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశరాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది.భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ఈ గణాంకాలు ఉన్నాయి.
అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఒడెలా 2'. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్, సంగీతం: బి.అజనీష్ లోక్ నాథ్.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
బలోచిస్తాన్ విమోచన సైన్యం దిద్దుబాటు (Balochistan Liberation Army) పాకిస్తాన్ లోని బలోచీ గిరిజన జాతుల విమోచన కోసం పోరాడుతోంది. పాకిస్తాన్ లో సింధీయులు, పంజాబీయులు నివసించే ప్రాంతాలు మాత్రమే కొంత వరకు అభివృద్ధి చెందాయి. గిరిజన ప్రాంతాలు, ముఖ్యంగా బలోచీ భాష మాట్లాడే ప్రాంతాలు చాలా వెనుకబడి ఉండడం వల్ల ఆ ప్రాంతాలలో తిరుగుబాటు ఉద్యమాలు బలపడ్డాయి.
క్షత్రియులు (Kshatriya) అనునది హిందూ మతములోని పురాణాల ప్రకారం చతుర్వర్ణ్యాలలో రెండవది క్షత్రియ వర్ణం. "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ క్షత్రియః" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు.
కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు
1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే.
భగవంతుడు ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అని పిలుస్తారు. చాలా మంది నాస్తికత్వాన్ని, ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడంతో సమానంగా చూస్తారు, అయితే కొన్ని సార్లు నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని పాటించని వాళ్లుగా చూడొచ్చు. ఉదాహరణకు బౌద్ధమతంలో దేవుడున్నాడనే భావనకు విలువలేదు, కాబట్టి ఆ మతాన్ని ఆచరించే వారందరినీ నాస్తికులుగానే చూడొచ్చు.
భారత పాకిస్తాన్ యుద్ధాలు, ఘర్షణలు
1947 లో దేశ విభజన తరువాత భారతదేశం, పాకిస్తాన్ల మధ్య అనేక యుద్ధాలు ఘర్షణలూ జరిగాయి. 1971 యుద్ధాన్ని మినహాయించి మిగిలిన ప్రధాన ఘర్షణలన్నిటికీ కాశ్మీర్ సమస్య, సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదమే ప్రధాన కారణాలు. 1971 యుద్ధం ఆనాటి తూర్పు పాకిస్తాన్‌ను (ప్రస్తుత బంగ్లాదేశ్) విముక్తి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం వల్ల జరిగింది.
అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నమీబియా అని పిలవబడే నమీబియా ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. దీని పశ్చిమ సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో అంగోలా - జాంబియా దేశాలు ఉన్నాయి, తూర్పుసరిహద్దులో బోత్సువానా - జింబాబ్వే దేశాలు ఉన్నాయి, దక్షిణ - తూర్పుసరిహద్దులను దక్షిణ ఆఫ్రికాతో పంచుకుంటుంది. ఇది నమీబియా స్వతంత్ర పోరాటం తర్వాత 1990 మార్చి 21న దక్షిణ ఆఫ్రికా నుండి స్వాతంత్ర్యాన్ని పొందింది.
భారతదేశ జిల్లా, అనేది భారతదేశం లోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భూ భాగం.ప్రస్తుతం భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థగా ఉంది.కొన్ని సందర్భాల్లో, జిల్లాలు ఉపవిభాగాలుగా, మరికొన్నింటిలో నేరుగా తహసీల్లు లేదా తాలూకాలుగా విభజించబడ్డాయి. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం 593 జిల్లాలు నమోదయ్యాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 640 జిల్లాలు నమోదయ్యాయి.
రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం.
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుంది. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్ హంట్ జయంతి రోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు. వివిధ సమస్యలతో భాదపడుతున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి.
కాల్సియం కార్బైడ్ ఒకరసాయన సంయోగ పదార్థం.ఇది ఒక కర్బన రసాయన సమ్మేళనపదార్థం. కాల్సియం కార్బైడ్ రసాయన సంకేతపదం CaC2.కాల్సియం, కార్బన్ మూలకాల సమ్మేళనం వలన కాల్సియం కార్బైడ్ఏర్పడినది.కాల్సియం కార్బైడ్ నుండి పారిశ్రామికంగా ఎసిటిలిన్ వాయువును, కాల్సియం సైనమిడ్ ను ఉత్పత్తి చేయుదురు.శుద్ధమైన కాల్సియం కార్బైడు రంగులేని ఘనపదార్థం, కాని టెక్నికల్ గ్రేడ్ కాల్సియం కార్బైడ్ గ్రే లేదా బ్రౌన్ రంగులో ఉండును.ఇలాంటి టెక్నికల్ గ్రేడ్/సాంకేతిక స్థాయి సంయోగపదార్థంలో 80–85% వరకు కాల్సియం కార్బైడ్ ఉండి మిగిలినశాతంలో కాల్సియం ఆక్సైడ్ (CaO, కాల్సియం ఫాస్పైడ్ (Ca3P2 ), కాల్సియం సల్ఫైడ్ (CaS), కాల్సియం నైట్రైడ్ (Ca3N2),, సిలికాన్ కార్బైడ్ (SiC) వంటివి ఉండును.ఇలాంటి టెక్నికల్ గ్రేడ్/సాంకేతిక స్థాయి సంయోగపదార్థంలో తేమవలన అది వెల్లుల్లి వాసనను పోలిన ఘాటైన వాసన వెలువరించును. కాల్సియం కార్బైడ్‌ను అసిటిలిన్ వాయువు ఉత్పత్తి చెయ్యుటకు, రసాయన ఎరువుల ఉత్పత్తిలో, ఉక్కు తయారీలో,, కార్బైడ్ దీపాలలో అసిటిలిన్ వాయుజనకానికై ఉపయోగిస్తారు.
భారత సాయుధ దళాలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క సైనిక దళాలు. ఇది మూడు వృత్తిపరమైన యూనిఫాం సేవలను కలిగి ఉంటుంది: భారత సైన్యం, ఇండియన్ నేవీ, భారత వైమానిక దళం. అదనంగా, భారత సాయుధ దళాలకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, అండమాన్, నికోబార్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వంటి వివిధ ఇంటర్-సర్వీస్ కమాండ్లు, సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. .
అకీరా కురొసావా (మార్చి 23, 1910 - సెప్టెంబరు 6, 1998) జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. 57 సంవత్సరాల కెరీర్ లో 30 చలన చిత్రాలకు దర్శకత్వం వహించిన కురసోవా సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన, ముఖ్యమైన సినీ దర్శకుల్లో ఒకరుగా పేరొందారు. 1936లో కురసోవా జపనీస్ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
బ్రూస్ లీ (నవంబర్ 27, 1940 - జులై 20, 1973) అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన మార్షల్ ఆర్టిస్ట్ (యుద్ధ క్రీడా నిపుణుడు), నటుడు, నిర్మాత, తత్వవేత్త. ఇతను తాను ఆచరించిన నిరాయుధ పోరాటం, ఆత్మరక్షణ పద్ధతులు, జెన్ బౌద్ధం, టావోయిజం లాంటి అనేక సాంప్రదాయాల మిశ్రమమైన జీత్ కున్ డు అనే ఒక హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ తత్వాన్ని కనిపెట్టాడు. అటు అమెరికా, ఇటు హాంగ్‌కాంగ్ దేశాల సినిమాలలో నటించిన లీ, చైనా ప్రాంతం నుంచి వచ్చిన మొట్టమొదటి గ్లోబల్ స్టార్ అని చెప్పవచ్చు.
దూబచర్లఅన్ని ఊర్ల కథ లాగానే దూబచర్ల అసలు పేరు వేరు.ఒక్కప్పుడు మన పూర్వీకుల కాలం లో మన దూబచర్ల అను పిలువబడే గ్రామంలో ,ఐరన్ మూలికలు కలిగి ఉన్న రాయి ఉండేది .హా ఖనిజం నీ కరగపెట్టి ఐరన్ వేరుగా హా రాయిని వేరుగా చేసే వారు.ఈ ప్రక్రియ జరిగినప్పుడు దానిని కరగపెట్టడనికి అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు పుట్టించి అనగా మంట అధిగా వేడి తో దానిని కరగపెట్టేవారు .హా సమయం లో ఎక్కువ మోతాదులో పొగ వచ్చి ఊపిరి పీల్చడం ఇబ్బందిగా ఉండేది అక్కడ నివసికులకు ,దాని బారి నుండి వారిని వారు కాపాడుకోవడానికి ,హా ఊరు ప్రజలు దూపాలు (సాంబ్రాణి దోపలు) వేసుకునే వారు అలా అప్పుడు సమయంలో హా గ్రామం నీ అందరూ "దూప శాల" గా పిలిచేవారు అలా పిలువగా పిలువగా హా పేరు కాస్తా దూబచర్ల అని పలికి మొత్తానికి హా పేరు దూబచర్ల గా మారింది....ఈ కథ నాకు మా తెలుగు టీచరు గారు నా చిన్నపుడు పాటశాల లో చెప్పారు ...నిజంగానే హా ఐరన్ కరిగిన తర్వాత వచ్చే రాళ్లు ఇప్పటికీ సంఘమిత్ర స్కూల్ దగ్గర సస్తిగుడి దగ్గర ఒక పెద్ద గుట్ట హా ఉన్నాయి....కథ రాసిన వారు తోంటా రాముగారి అబ్బాయి...జై హింద్..మన గ్రామం మన భాధ్యత .. దూబచర్ల పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన నల్లజర్ల నుండి 6 కి. మీ.
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎక్కువగా సంస్కృతం, తెలుగు ఎక్కువగా కనిపిస్తుంది. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబద్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
విశ్వామిత్రుడు హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. గాయత్రీ మంత్ర సృష్టి కర్తగా, శ్రీరామునకు గురువుగా, హరిశ్చంద్రుని పరీక్షించినవానిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవానిగా, శకుంతలకు తండ్రి అందువలన భరతునకు తాతగా గుర్తిస్తారు.