The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం.
కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు
1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే.
లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
లాట్వియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ లాట్వియా) ఉత్తరఐరోపాలో బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న మూడు దేశాలలో ఇది ఒక దేశము. ఈ దేశానికి ఉత్తరసరిహద్దులో ఎస్టోనియా, దక్షిణసరిహద్దులో లిథువేనియా, తూర్పుసరిహద్దులో రష్యా, ఆగ్నేయసరిహద్దులో బెలారస్ దేశాలు ఉన్నాయి. బాల్టిక్ సముద్ర తీరానికి ఆవల పశ్చిమసరిహద్దులో స్వీడన్ దేశం ఉంది.లాట్వియా జనసంఖ్య 19,57,200.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
భారత పాకిస్తాన్ యుద్ధాలు, ఘర్షణలు
1947 లో దేశ విభజన తరువాత భారతదేశం, పాకిస్తాన్ల మధ్య అనేక యుద్ధాలు ఘర్షణలూ జరిగాయి. 1971 యుద్ధాన్ని మినహాయించి మిగిలిన ప్రధాన ఘర్షణలన్నిటికీ కాశ్మీర్ సమస్య, సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదమే ప్రధాన కారణాలు. 1971 యుద్ధం ఆనాటి తూర్పు పాకిస్తాన్‌ను (ప్రస్తుత బంగ్లాదేశ్) విముక్తి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం వల్ల జరిగింది.
భారతదేశ జిల్లా, అనేది భారతదేశం లోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భూ భాగం.ప్రస్తుతం భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థగా ఉంది.కొన్ని సందర్భాల్లో, జిల్లాలు ఉపవిభాగాలుగా, మరికొన్నింటిలో నేరుగా తహసీల్లు లేదా తాలూకాలుగా విభజించబడ్డాయి. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం 593 జిల్లాలు నమోదయ్యాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 640 జిల్లాలు నమోదయ్యాయి.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఒడెలా 2'. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్, సంగీతం: బి.అజనీష్ లోక్ నాథ్.
బలోచిస్తాన్ విమోచన సైన్యం దిద్దుబాటు (Balochistan Liberation Army) పాకిస్తాన్ లోని బలోచీ గిరిజన జాతుల విమోచన కోసం పోరాడుతోంది. పాకిస్తాన్ లో సింధీయులు, పంజాబీయులు నివసించే ప్రాంతాలు మాత్రమే కొంత వరకు అభివృద్ధి చెందాయి. గిరిజన ప్రాంతాలు, ముఖ్యంగా బలోచీ భాష మాట్లాడే ప్రాంతాలు చాలా వెనుకబడి ఉండడం వల్ల ఆ ప్రాంతాలలో తిరుగుబాటు ఉద్యమాలు బలపడ్డాయి.
భారత సాయుధ దళాలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క సైనిక దళాలు. ఇది మూడు వృత్తిపరమైన యూనిఫాం సేవలను కలిగి ఉంటుంది: భారత సైన్యం, ఇండియన్ నేవీ, భారత వైమానిక దళం. అదనంగా, భారత సాయుధ దళాలకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, అండమాన్, నికోబార్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వంటి వివిధ ఇంటర్-సర్వీస్ కమాండ్లు, సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. .
అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
అంతర్జాల చరిత్ర 1950ల్లో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల అభివృద్ధితో మొదలైంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని పలు కంప్యూటర్ సైన్స్ లాబొరేటరీల్లో వైడ్ ఏరియా నెట్వర్కింగ్ ఆరంభ అంశాలు ప్రారంభమయ్యాయి. 1960ల్లోనే రాబర్ట్ టేలర్ మార్గదర్శనంలో, లారెన్స్ రాబర్ట్స్ నిర్వహణలో ఆర్పానెట్ వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి, సంబంధిత పరిశోధనలకు అమెరికన్ రక్షణశాఖ కాంట్రాక్టులు ఇచ్చింది.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
కన్ఫ్యూషియస్ (ఆంగ్లం : Confucius) (చైనీస్ భాష : 孔 夫 子 Kǒng Fūzǐ లేదా K'ung-fu-tzu), సాహిత్యపరమైన అర్థం: "కాంగ్ గురువు" ("Master Kong"), (సెప్టెంబరు 28, క్రీ.పూ 551 – క్రీ.పూ. 479) చైనాకు చెందిన శోధకుడు,, సామాజిక తూర్పు దేశాల తత్వవేత్త. ఇతని బోధనలు, తత్వము అనేకానేక దేశాల ప్రజలపై తన లోతైన ప్రభావాన్ని చూపగలిగింది.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఏదైనా ప్రాణి, జీవి, లేదా వస్తువు యొక్క మనసుకింపైన సౌందర్యాన్ని 'అందము' (Beauty) అంటారు. శరీర అవయవ అందాన్ని మనసుతో చూస్తాము కావున ఒకే వస్తువు లేదా మనిషి యొక్క www.shorterlife.xyz అందము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఈ విశ్వములో ఎన్నెన్నో జీవులు, ఎన్నో వస్తువులు దేని అందము దానికే గొప్ప,, ప్రత్యేకము.
కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
1972 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా దిగువనీయబడింది.
సోమేపల్లి వెంకటసుబ్బయ్య (ఆంగ్లం: Somepalli Venkata Subbaiah) (మే 1, 1958 - డిసెంబర్ 14, 2023) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కవి, రచయిత, రిటైర్డ్ ప్రభుత్వ అధికారి. గుంటూరు జిల్లా రచయితల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి అధ్యక్ష్యుడు. తొలినాట నానీల కవిత్వానికి స్ఫూర్తిని కల్గించిన వారిలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఒకరు.
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలోని అలంపురం గ్రామం కొరకు చూడండి.) ఆలంపురం , తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి.