The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది.
జయ జయహే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం.ఈ గీతాన్ని అందెశ్రీ రచన చేశాడు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన 'జయ జయహే తెలంగాణ' గీతం 9 చరణాలతో రాష్ట్ర గీతం ఉంటుంది. పూర్తి గీతాన్ని 13:30 నిమిషాల నిడివితో ఒకటి, రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2:30 నిమిషాల నిడివితో మరొక రాష్ట్ర గీతాన్ని అందె శ్రీ, ఎంఎం కీరవాణి రూపొందించారు.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
మొనాకో (; French pronunciation: [mɔnako]), అధికారికంగా " ప్రిసిపాలిటీ ఆఫ్ మొనాకో " (French: Principauté de Monaco), అన్నది స్వార్వభౌమాధికారం కలిగిన నగర రాజ్యం, దేశం, దీనికి మైక్రో స్టేట్ అన్న ప్రత్యేకత ఉంది. ఇది పశ్చిమ యూరప్‌లో " ఫ్రెంచి రివేరా "లో ఉంది. దేశానికి మూడు వైపులా ఫ్రెంచి దేశ సరిహద్దు ఉంది.
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది. 1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు.
మిస్ వరల్డ్ 2025, అనేది మిస్ వరల్డ్ పోటీ 72వ ఎడిషన్ .చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈవెంట్ ముగింపులో ఎన్నికైన వారిని తన వారసురాలిగా పట్టాభిషేకం చేస్తుంది. హైదరాబాదులో 2025 మే 7 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ అందాల పోటీలలో 120 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నది.
కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( November 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టాడు) భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.
ఇండియా హౌస్, 1905 - 1910 మధ్య కాలంలో ఉత్తర లండన్‌లో, హైగేట్ లోని క్రోమ్‌వెల్ అవెన్యూలో ఉన్న విద్యార్థి వసతి భవనం. న్యాయవాది శ్యామ్‌జీ కృష్ణ వర్మ ప్రోత్సాహంతో, బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద భావాలను పురికొల్పడానికి దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువుల కోసం వచ్చే భారతీయ యువకులకు స్కాలర్షిప్లను మంజూరు చేసేది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
అలెగ్జాండర్ (సా.పూ 356 జూలై 20/21 - సా.పూ 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని బాసిలియస్ అంటారు), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III అని, అలెగ్జాండర్ ది గ్రేట్ (గ్రీకులో అలెగ్జాండ్రోస్ హో మెగాస్) అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు.
భారతదేశ జిల్లా, అనేది భారతదేశం లోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భూ భాగం.ప్రస్తుతం భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థగా ఉంది.కొన్ని సందర్భాల్లో, జిల్లాలు ఉపవిభాగాలుగా, మరికొన్నింటిలో నేరుగా తహసీల్లు లేదా తాలూకాలుగా విభజించబడ్డాయి. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం 593 జిల్లాలు నమోదయ్యాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 640 జిల్లాలు నమోదయ్యాయి.
జవహర్ నవోదయ విద్యాలయాలు (సంక్షిప్తంగా జె ఎన్ వి లు) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల వ్యవస్థ. ఈ పాఠశాలలను భారత ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ, విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నవోదయ విద్యాలయ సమితి అనే స్వతంత్ర సంస్థ నిర్వహిస్తుంది. జెఎన్వీలు గురుకుల పాఠశాల పద్ధతిలో, బాల బాలికలకు విద్యనందిస్తాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
తూర్పు తిమోర్ () లేక తిమోర్- లెస్టే (), టేటం భాష: తిమోర్ లో రోసె అధికారికంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తిమోర్- లెస్తె (పోర్చుగీసు: " రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్తె " టటం: రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్) మేరీటైం ఈశాన్య ఆసియాలో సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఇది తిమోర్ ద్వీపం పూర్వార్ధభూభాగంలో (ఈస్ట్ హాఫ్) ఉంది. దీనికి సమీపంలో అటౌరో ద్వీపం, ఒఎక్యూస్, జాకో ద్వీపం ఉన్నాయి.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
భారత జాతీయ కాంగ్రెస్, (కాంగ్రెస్ పార్టీ, INC) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.
భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా
భారత ప్రధాన న్యాయమూర్తి భారతీయ న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయి అధికారి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు అధిపతిగా, ప్రధాన న్యాయమూర్తి కేసుల కేటాయింపు, చట్టానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలతో వ్యవహరించే రాజ్యాంగ బెంచ్‌ల నియామకానికి బాధ్యత వహిస్తాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145, 1966 సుప్రీం కోర్టు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి అన్ని పనులను ఇతర న్యాయమూర్తులకు కేటాయించటానికి అధికారముంది.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అనేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలు. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు నిర్వహించబడిన ఈ ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. జూన్ 2న జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగిసాయి.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal () (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ, "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.
డోమనికా ( DOM-i-NEE-kə; French: Dominique;ఐలాండ్ కరీబ్: [Wai‘tu kubuli] Error: {{Lang}}: text has italic markup (help)),అధికారికంగా " కామంవెల్ట్ ఆఫ్ డొమనికా " సార్వభౌమాధికారం కలిగిన ద్వీప దేశం. జమైకా రాజధాని " రొసైయు " ద్వీపం లీవార్డ్ (గాలి తక్కువగా వీస్తున్న వైపు) సైడుగా ఉంది. కరీబియా సముద్రంలోని లెసర్ ఆంటిల్లెస్ ఆర్చిపెలాగొలోని ద్వీపాలలోని విండ్ వర్డ్ ఐలాండులలో జమైకా ఒకటి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.