The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశాడు. ఆయన 2025 జూన్ 30న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి, శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది. తిరుపతికి 36 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం, పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి (గాలి లింగం) ప్రసిద్ధి చెందింది, ఇది గాలిని సూచిస్తుంది.
షెఫాలీ జరీవాలా (ఆంగ్లం: Shefali Jariwala; 1982 డిసెంబరు 15 - 2025 జూన్ 27), గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె అనేక హిందీ మ్యూజిక్ వీడియోలు, రియాలిటీ షోలు, కన్నడ సినిమాలలో నటించింది. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లతో కలిసి ముజ్సే షాదీ కరోగి సినిమాలో బిజిలీగా నటించి గుర్తింపు పొందింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
కుబేరా 2025లో విడుదలైన భారతీయ డ్రామా చిత్రం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, జిమ్ సర్బ్, రష్మిక మందన్న, దలీప్ తహిల్ తదితరులు నటించారు.
కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసంతెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత, ధర్మశాస్త్రం సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.
భక్త కన్నప్ప బాపు దర్శకత్వం వహించగా, కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించిన 1976 నాటి తెలుగు భక్తిరస ప్రధాన చలనచిత్రం. సినిమాను గోపీకృష్ణా మూవీస్ పతాకంపై నటుడు కృష్ణంరాజు తమ్ముడు యు.వి.సూర్యనారాయణరాజు నిర్మించారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన తిన్నడు లేదా కన్నప్ప కథను స్వీకరించి సినిమాగా తీశారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.
భారత జాతీయ కాంగ్రెస్, (కాంగ్రెస్ పార్టీ, INC) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.
దాదాభాయ్ నౌరోజీ (హిందీ - दादाभाई नौरोजी) (సెప్టెంబర్ 4, 1825 – జూన్ 30, 1917) పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడు. ఇతను 1892 నుండి 1895 వరకు పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగాడు. ఇతను అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి.గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా అని అంటారు.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ కమిటీ
తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రం లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగం . పార్టీ ప్రధాన కార్యాలయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా జి.
ప్రభాస్‌గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
క్వాంటం కంప్యూటింగ్ అనేది గణనలను నిర్వహించడానికి క్వాంటం మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించే ఒక రకమైన కంప్యూటింగ్. క్లాసికల్ కంప్యూటింగ్‌లో, డేటా 0 లేదా 1 బిట్లను ఉపయోగించి సూచించబడుతుంది. దీనికి విరుద్ధంగా, క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం బిట్లు లేదా క్విట్‌లను ఉపయోగిస్తుంది, ఇవి ఒకేసారి 0, 1 రెండింటినీ సూచించగలవు, ఇది విపరీతంగా మరింత శక్తివంతమైన గణనలను అనుమతిస్తుంది.