The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ (జననం భావరాజు వేంకట పట్టాభిరామ్; మరణం 2025 జూన్ 30), రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్. అతను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేసాడు. అతను విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతోపాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సుసులు నిర్వహిస్తున్నారు.
నారపరాజు రామచందర్ రావు తెలంగాణ రాష్ట్ర చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2015 నుండి 2021 వరకు హైదరాబాద్, రంగారెడ్డి & మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పని చేశాడు. రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా 2025 జూన్ 30న ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శోభా కరంద్లాజే జులై 1న అధికారికంగా ప్రకటించింది.
పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశాడు. ఆయన 2025 జూన్ 30న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి, శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది. తిరుపతికి 36 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం, పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి (గాలి లింగం) ప్రసిద్ధి చెందింది, ఇది గాలిని సూచిస్తుంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
కుబేరా 2025లో విడుదలైన భారతీయ డ్రామా చిత్రం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, జిమ్ సర్బ్, రష్మిక మందన్న, దలీప్ తహిల్ తదితరులు నటించారు.
కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు.
షెఫాలీ జరీవాలా (ఆంగ్లం: Shefali Jariwala; 1982 డిసెంబరు 15 - 2025 జూన్ 27), గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె అనేక హిందీ మ్యూజిక్ వీడియోలు, రియాలిటీ షోలు, కన్నడ సినిమాలలో నటించింది. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లతో కలిసి ముజ్సే షాదీ కరోగి సినిమాలో బిజిలీగా నటించి గుర్తింపు పొందింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
జగదేకవీరునీ కధ 1961 ఆగస్టు 9 న విడుదల.విజయా ప్రొడక్షన్ పతాకంపై , కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి ముఖ్య తారాగణం.పెండ్యాల నాగేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం అందించారు.. తనకు వచ్చిన కలను నిజము చేసుకునే ప్రయత్నములో, ఒక యువరాజు చేసిన సాహసకార్యముల గాధే జగదేకవీరుని కథ (Jagadeka Veeruni Katha). ఈ చిత్రము లోని పాటలు ఎంతో ప్రాచుర్యము పొందాయి.
G వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అన్నది భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పన్నుల వ్యవస్థ. దాన్ని 101వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.