The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
థగ్ లైఫ్ 2025లో విడుదలకానున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ నిర్మించిన సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
జాట్ 2025లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా సన్నీ డియోల్, రెజీనా కాసాండ్రా, రణదీప్ హూడా, ఆయేషా ఖాన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 24న విడుదల చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుండి వేరుపడి యేర్పడింది, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలలోని నగరాలకు, పట్టణాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది.
మిస్ వరల్డ్ 2025, అనేది మిస్ వరల్డ్ పోటీ 72వ ఎడిషన్ .చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈవెంట్ ముగింపులో ఎన్నికైన వారిని తన వారసురాలిగా పట్టాభిషేకం చేస్తుంది. హైదరాబాదులో 2025 మే 7 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ అందాల పోటీలలో 120 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నది.
ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం
ధరణి Archived 2023-07-11 at the Wayback Machine సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రములో ఉన్న వ్యవసాయ , వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్ . ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ( భూ పరిపాలన శాఖ ) ఆరంభించింది . దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు , ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యం.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
'క్రిస్మస్ ద్వీపం, అధికారికంగా క్రిస్మస్ ద్వీపం భూభాగం, అనేది హిందూ మహాసముద్రంలో అదే పేరుతో ఉన్న ద్వీపాన్ని కలిగి ఉన్న ఆస్ట్రేలియన్ బాహ్య భూభాగం. ఇది జావా, సుమాత్రలకు దక్షిణంగా, ఆస్ట్రేలియను ప్రధాన భూభాగంలోని అతి దగ్గరి బిందువుకు వాయువ్యంగా1550 కిమీ (840 నాటికలు మైళ్ళు) దూరంలో ఉంది. దీని వైశాల్యం 135 చదరపు కిలోమీటర్లు (52 చ.
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్వవసాయ భూముల నిర్వహణకు కోసం భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హైదరాబాదు లోని శిల్పకళా వేదిక , హైటెక్ సిటీ, మాదాపూర్ లో తేది:14 ఏప్రిల్ 2025 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భూపరిపాలనలోని ధరణి స్థానంలో కొత్త ఆర్.ఓ .ఆర్ చట్టం భూ భారతి పొర్టల్ -2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
పినాకి మిశ్రా (1959 అక్టోబరు 23) ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజు జనతాదళ్ పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. పినాకీ మిశ్రా పూరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1996లో పినాకీ మిశ్రా పూరి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అప్పటి పూరి ఎంపీ, కేంద్ర మంత్రి అయిన బ్రజ కిషోర్ త్రిపాఠి ని ఓడించారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు. 2014,2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీ తరపున చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి గెలుపొందాడు. ఇతని తాత కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా పేరు పెట్టారు.
భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా
భారత ప్రధాన న్యాయమూర్తి భారతీయ న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయి అధికారి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు అధిపతిగా, ప్రధాన న్యాయమూర్తి కేసుల కేటాయింపు, చట్టానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలతో వ్యవహరించే రాజ్యాంగ బెంచ్‌ల నియామకానికి బాధ్యత వహిస్తాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145, 1966 సుప్రీం కోర్టు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి అన్ని పనులను ఇతర న్యాయమూర్తులకు కేటాయించటానికి అధికారముంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.
2024 సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థుల జాబితా
2024 భారత సార్వత్రిక ఎన్నికల కోసం లోక్‌సభ నియోజకవర్గాలకు ఇండియా కూటమి అభ్యర్థులు ఈ క్రింది విధంగా ఉంది. 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అభ్యర్థుల సీట్ల భాగస్వామ్య సారాంశం క్రింది విధంగా ఉంది.
పెళ్ళి కాని ప్రసాద్ (2025 సినిమా)
పెళ్ళి కాని ప్రసాద్ 2025లో విడుదలైన సినిమా. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్, చాగంటి సినిమాటిక్ వరల్డ్ బ్యానర్‌పై కేవై బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించాడు. సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ, వడ్లమాని శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 3న, ట్రైలర్‌ను మార్చి 13న విడుదల చేసి, సినిమాను మార్చి 21న దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల చేశారు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 శాసనసభను ఏర్పాటు చేయడం కోసం, 2024 మే 13న రాష్ట్రంలో 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2024 భారత సాధారణ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎకకాలంలో జరిగాయి. వోట్ల లెక్కింపు 2024 జూన్ 4న జరిగింది.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.