The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
మిస్ వరల్డ్ 2025, అనేది మిస్ వరల్డ్ పోటీ 72వ ఎడిషన్ .చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈవెంట్ ముగింపులో ఎన్నికైన వారిని తన వారసురాలిగా పట్టాభిషేకం చేస్తుంది. హైదరాబాదులో 2025 మే 7 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ అందాల పోటీలలో 120 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
థగ్ లైఫ్ 2025లో విడుదలకానున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ నిర్మించిన సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్వవసాయ భూముల నిర్వహణకు కోసం భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హైదరాబాదు లోని శిల్పకళా వేదిక , హైటెక్ సిటీ, మాదాపూర్ లో తేది:14 ఏప్రిల్ 2025 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భూపరిపాలనలోని ధరణి స్థానంలో కొత్త ఆర్.ఓ .ఆర్ చట్టం భూ భారతి పొర్టల్ -2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 శాసనసభను ఏర్పాటు చేయడం కోసం, 2024 మే 13న రాష్ట్రంలో 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2024 భారత సాధారణ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎకకాలంలో జరిగాయి. వోట్ల లెక్కింపు 2024 జూన్ 4న జరిగింది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
బొత్స సత్యనారాయణ (జననం 1958 జూలై 9) ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రిగా నియమితులయ్యారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతను 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విద్యా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు. 2014,2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీ తరపున చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి గెలుపొందాడు. ఇతని తాత కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా పేరు పెట్టారు.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్‌లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్‌పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
1979, సెప్టెంబర్ 21న జమైకా లోని కింగ్‌స్టన్‌లో జన్మించిన క్రిస్టోఫర్ క్రిస్ హెన్రీ గేల్ (Christopher "Chris" Henry Gayle) వెస్ట్ఇండీస్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేయగల నైపుణ్యం ఇతనికి ఉంది. 2001 జూలైలో క్రిస్ గేల్స్, డారెన్ గంగాతో కలిసి జింబాబ్వేపై బులావయో మ్యాచ్‌లో తొలి వికెట్టుకు 215 పరుగుల భాగస్వామ్యం చేసి రికార్డు సృష్టించారు.
ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం
ధరణి Archived 2023-07-11 at the Wayback Machine సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రములో ఉన్న వ్యవసాయ , వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్ . ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ( భూ పరిపాలన శాఖ ) ఆరంభించింది . దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు , ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యం.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
భారత జాతీయ కాంగ్రెస్, (కాంగ్రెస్ పార్టీ, INC) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (1946-2020) భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత. ఇతడు అత్యధిక సినిమా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. ఇతడు ఉత్తమ నేపథ్యగాయకుడిగా ఆరు సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని స్వీకరించాడు.
బ్రహ్మపుత్ర (Brahmaputra river) (అస్సామీ భాష: ব্ৰহ্মপুত্ৰ, బెంగాలీ భాష: ব্রহ্মপুত্র} హిందీ భాష: ब्रम्हपुत्र, టిబెటన్ భాషཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం. టిబెట్‌లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నదిగా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది.
కోకోసు (కీలింగ్) దీవులు (కోకోసు దీవులు మలయి: పులు కోకోసు [కీలింగు]), అధికారికంగా కోకోసు (కీలింగ్) దీవుల భూభాగం (/ˈkoʊkəs/; కోకోసు దీవులు మలయు: పులు కోకోసు [కీలింగు]), హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ఆస్ట్రేలియను బాహ్య భూభాగం, ఇది ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య దాదాపు మధ్యలో, ఇండోనేషియా ద్వీపం సుమత్రాకు దగ్గరగా ఉన్న ఒక చిన్న ద్వీపసమూహాన్ని కలిగి ఉంది. ఈ భూభాగం ద్వంద్వ పేరు (1955లో ద్వీపాలు ఆస్ట్రేలియాలో విలీనం అయినప్పటి నుండి అధికారికంగా) ఈ దీవులను చారిత్రాత్మకంగా కోకోసు దీవులు లేదా కీలింగు దీవులు అని పిలుస్తారు. ఈ భూభాగం 27 పగడపు దీవులతో కూడిన రెండు అటాలులను కలిగి ఉంది.
1962 మే 27న ముంబాయిలో జన్మించిన రవిశంకర్ జయధ్రిత శాస్త్రి (మరాఠీ : रविशंकर जयद्रिथ शास्त्री) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతితో బ్యాటింగ్, ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ చేయగల ఈ ఆల్‌రౌండర్ ఆటగాడు 18 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి 12 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రారంభంలో బౌలర్‌గానే క్రీడా జీవితం ప్రారంభించిననూ తర్వాత బ్యాట్స్‌మెన్‌గా రాణించి బౌలింగ్ కూడా చేయగల ఆటగాడిగా మారినాడు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.