The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
పల్లా సింహాచలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విశాఖపట్నం- II శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన కుమారుడు పల్లా శ్రీనివాసరావు రెండుసార్లు గాజువాక నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.
పెంతుకోస్తు అనేది ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చినది, పెంతుకోస్తు అనగా యాబైవ రోజు. ఇజ్రాయేలియుల కాలెండర్ ప్రకారం ఈస్టర్ పండుగ తరువాత కచ్చితంగా 50 రోజులకు పెంతుకోస్తు పండుగ వస్తుంది. ప్రాచీన ఇజ్రాయేలియులు మౌంట్ సినాయ్ వద్ద మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు తరువాత 50 రోజులకు పస్కా (క్రోత్త ఫలముల) పండుగ ఆచరించేవారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
జాట్ 2025లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా సన్నీ డియోల్, రెజీనా కాసాండ్రా, రణదీప్ హూడా, ఆయేషా ఖాన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 24న విడుదల చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో విడుదల చేశారు.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.
ఈద్ ముబారక్ - Eid Mubarak ( Bengali: ঈদ মুবারক, అరబ్బీ: عيد مبارك, పర్షియన్ / ఉర్దూ: عید مُبارک, హిందీ: ईद मुबारक, మళయాళం: ഈദ് മുബാറക്) ముస్లింల సాంప్రదాయంలో ఈద్ వేళల్లో ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకునే రీతి లేదా రివాజు. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్ హా, మీలాదె నబి లేదా ఇతర పర్వదినాలకునూ ఉపయోగిస్తారు. "ఈద్" అనగా పండుగ లేదా పర్వం, "ముబారక్" అనగా ఆశీర్వదింపబడిన, శుభీకరింపబడిన, క్లుప్తంగా, "పండుగ-శుభాకాంక్షలు".
చీనాబ్ వంతెన భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆర్చి వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్ లోని రేసి జిల్లాలో, బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానంగా ఉంటుంది. వంతెన పూర్తయినప్పుడు 1,263 మీటర్ల (4,144 అడుగులు) పొడవు, ఆర్చ్ స్పాన్ దూలం 480 మీటర్ల (1,570 అడుగులు) తో, చీనాబ్ నదిపైన 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో, కౌరి వైపు వయాడక్ట్ 650 మీటర్ల (2,130 అడుగులు) పొడవుగా ఉంటుంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా
భారత ప్రధాన న్యాయమూర్తి భారతీయ న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయి అధికారి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు అధిపతిగా, ప్రధాన న్యాయమూర్తి కేసుల కేటాయింపు, చట్టానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలతో వ్యవహరించే రాజ్యాంగ బెంచ్‌ల నియామకానికి బాధ్యత వహిస్తాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145, 1966 సుప్రీం కోర్టు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి అన్ని పనులను ఇతర న్యాయమూర్తులకు కేటాయించటానికి అధికారముంది.
మిస్ వరల్డ్ 2025, అనేది మిస్ వరల్డ్ పోటీ 72వ ఎడిషన్ .చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈవెంట్ ముగింపులో ఎన్నికైన వారిని తన వారసురాలిగా పట్టాభిషేకం చేస్తుంది. హైదరాబాదులో 2025 మే 7 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ అందాల పోటీలలో 120 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
గాలి మాధవీలత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆమె జియోసింధసిస్, ఎర్త్ క్వేక్ మేనేజిమెంటు, రాక్ ఇంజనీరింగ్ లో విశేష సేవలనందిస్తున్నారు. ఇండియన్ ఇనస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ సూచనల మేరకు చీనాబ్ వంతెన డిజైన్ ప్రొవైడర్‌గా సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ మాధవీలతను నియమించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
హిందూ సామ్రాజ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా జరుపుకుంటారు.ఛత్రపతి శివాజీహిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు.1674 జూన్ 6న (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు.శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శహజీ భోస్లె, జిజాభాయి దంపతులకు జన్మించాడు.
చెరుకూరి రామోజీ రావు ( 1936 నవంబరు 16-8 2024 జూన్ 8) ఒక భారతీయ వ్యాపారవేత్త, మీడియా యజమాని సినిమా నిర్మాత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, టీవీ ఛానళ్ల ఇటివి నెట్వర్క్, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ యాజమాన్యంలోని రామోజీ గ్రూప్‌కు రామోజీరావు అధిపతిగా ఉన్నారు రామోజీరావు సినీ నిర్మాతగా వ్యాపారవేత్తగా మీడియా అధిపతిగా పత్రికా అధినేతగా అనేక రంగాలలో రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారారు. రామోజీరావు ఇతర వ్యాపార సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా ఫుడ్స్ ఈటీవీ విన్, ఒ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
కొమెర అంకారావు, ఇతను ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అడవులు సంరక్షణ, పెంపకం, వృద్ధి కోసం నడుముకట్టి, గత రెండు దశాబ్దాలుగా పైగా అలుపెరుగనిపోరాటం చేస్తూ, నల్లమల అడవిలో ప్లాస్టిక్ నిర్మూలన చేస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ సరికొత్త హరిత అడవులు సృష్టిస్తున్న, భారతీయ పర్యావరణ యోధుడు, పర్యావరణ వేత్త, నల్లమల అడవితల్లి బిడ్డగా గుర్తింపు పొందిన యువకుడు. అంకారావు తండ్రి రాములు, తల్లి ఏడుకొండలు. అంకారావు ముద్దు పేరు జాజి.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
'వచ్చిన కోడలు నచ్చింది'తెలుగు చలనచిత్రం1959 అక్టోబర్16 న విడుదల.సుధాకర్ ఫిలింస్ పతాకంపై పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జూలూరి జమున, పసుపులేటి కన్నాంబ, చిలకలపూడి సీతారామాంజనేయులు మొదలగు వారు నటించిన ఈ చిత్రo , దాసరి యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కినది. ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.
నార్డిక్ దేశాలు (నార్డిక్ అంటే ఉత్తర భాగం అని అర్థం) అనేవి భౌగోళికంగా ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతానికి చెందిన దేశాలు. ఇందులో గణతంత్ర రాజ్యాలైన స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్, ఇంకా ఫారో దీవులు, గ్రీన్లాండ్ లోని స్వతంత్ర ప్రాంతాలు, ఆలండ్ ఉన్నాయి. నార్డిక్ దేశాలు వారి జీవన విధానం, చరిత్ర, మతం, సామాజిక ఆర్థిక నమూనాలో చాలా సారూప్యతలు కలిగి ఉన్నాయి.
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్వవసాయ భూముల నిర్వహణకు కోసం భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హైదరాబాదు లోని శిల్పకళా వేదిక , హైటెక్ సిటీ, మాదాపూర్ లో తేది:14 ఏప్రిల్ 2025 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భూపరిపాలనలోని ధరణి స్థానంలో కొత్త ఆర్.ఓ .ఆర్ చట్టం భూ భారతి పొర్టల్ -2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
సంభోగ సమయములో స్త్రీ పురుషుల శరీరములు (యోని పురుషాంగముతోసహా) పరస్పర సక్తములై ఉండే స్థితి భేదములనే ' సంభోగాసనములు, బంధములు, కరణములు ' మొదలగు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. భిన్నజాతి స్త్రీపురుషులు కలిసినపుడు బాధారహితంగా సుఖించుటకు, సమానజాతి స్త్రీపురుషుల రతియందు నవ్యతను కల్పించుట శాస్త్రములయం దీ కరణభేదములు (బంధభేదములు) చెప్పబడ్డాయి. రతివేళ స్త్రీయొక్క శరీరస్థితి ననుసరించి ఈ ఆసన భేదములు ప్రధానంగా ఐదు రకాలుగా ఉన్నాయి.