The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగాప్రకటించగా , ఆయన ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2025 జూన్ 8న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
గాలి మాధవీలత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆమె జియోసింధసిస్, ఎర్త్ క్వేక్ మేనేజిమెంటు, రాక్ ఇంజనీరింగ్ లో విశేష సేవలనందిస్తున్నారు. ఇండియన్ ఇనస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ సూచనల మేరకు చీనాబ్ వంతెన డిజైన్ ప్రొవైడర్‌గా సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ మాధవీలతను నియమించారు.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
పెంతుకోస్తు అనేది ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చినది, పెంతుకోస్తు అనగా యాబైవ రోజు. ఇజ్రాయేలియుల కాలెండర్ ప్రకారం ఈస్టర్ పండుగ తరువాత కచ్చితంగా 50 రోజులకు పెంతుకోస్తు పండుగ వస్తుంది. ప్రాచీన ఇజ్రాయేలియులు మౌంట్ సినాయ్ వద్ద మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు తరువాత 50 రోజులకు పస్కా (క్రోత్త ఫలముల) పండుగ ఆచరించేవారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
చెరుకూరి రామోజీ రావు ( 1936 నవంబరు 16-8 2024 జూన్ 8) ఒక భారతీయ వ్యాపారవేత్త, మీడియా యజమాని సినిమా నిర్మాత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, టీవీ ఛానళ్ల ఇటివి నెట్వర్క్, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ యాజమాన్యంలోని రామోజీ గ్రూప్‌కు రామోజీరావు అధిపతిగా ఉన్నారు రామోజీరావు సినీ నిర్మాతగా వ్యాపారవేత్తగా మీడియా అధిపతిగా పత్రికా అధినేతగా అనేక రంగాలలో రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారారు. రామోజీరావు ఇతర వ్యాపార సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా ఫుడ్స్ ఈటీవీ విన్, ఒ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి.
పల్లా సింహాచలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విశాఖపట్నం- II శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన కుమారుడు పల్లా శ్రీనివాసరావు రెండుసార్లు గాజువాక నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.
హిందూ సామ్రాజ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా జరుపుకుంటారు.ఛత్రపతి శివాజీహిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు.1674 జూన్ 6న (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు.శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శహజీ భోస్లె, జిజాభాయి దంపతులకు జన్మించాడు.
జాట్ 2025లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా సన్నీ డియోల్, రెజీనా కాసాండ్రా, రణదీప్ హూడా, ఆయేషా ఖాన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 24న విడుదల చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో విడుదల చేశారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
చీనాబ్ వంతెన భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆర్చి వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్ లోని రేసి జిల్లాలో, బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానంగా ఉంటుంది. వంతెన పూర్తయినప్పుడు 1,263 మీటర్ల (4,144 అడుగులు) పొడవు, ఆర్చ్ స్పాన్ దూలం 480 మీటర్ల (1,570 అడుగులు) తో, చీనాబ్ నదిపైన 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో, కౌరి వైపు వయాడక్ట్ 650 మీటర్ల (2,130 అడుగులు) పొడవుగా ఉంటుంది.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) 1958 డిసెంబరు 5న జన్మించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 07న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
మిస్ వరల్డ్ 2025, అనేది మిస్ వరల్డ్ పోటీ 72వ ఎడిషన్ .చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈవెంట్ ముగింపులో ఎన్నికైన వారిని తన వారసురాలిగా పట్టాభిషేకం చేస్తుంది. హైదరాబాదులో 2025 మే 7 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ అందాల పోటీలలో 120 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నది.
సంభోగ సమయములో స్త్రీ పురుషుల శరీరములు (యోని పురుషాంగముతోసహా) పరస్పర సక్తములై ఉండే స్థితి భేదములనే ' సంభోగాసనములు, బంధములు, కరణములు ' మొదలగు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. భిన్నజాతి స్త్రీపురుషులు కలిసినపుడు బాధారహితంగా సుఖించుటకు, సమానజాతి స్త్రీపురుషుల రతియందు నవ్యతను కల్పించుట శాస్త్రములయం దీ కరణభేదములు (బంధభేదములు) చెప్పబడ్డాయి. రతివేళ స్త్రీయొక్క శరీరస్థితి ననుసరించి ఈ ఆసన భేదములు ప్రధానంగా ఐదు రకాలుగా ఉన్నాయి.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
రాష్ట్రాల వారీగా భారత జాతీయ రహదారుల జాబితా (పాత సంఖ్యలతో)
భారత "జాతీయ రహదారుల జాబితా" దేశం లోని వివిధ ప్రాంతాల వారీగా భారత జాతీయ రహదారి నిర్వహక సంస్థ నిర్వహించే రహదారుల జాబితా.ఇవి దేశం లోనే ముఖ్యమైన పొడవైన, అత్యదికంగా ఉపయోగించ బడే రోడ్లు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్ 7 ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి దక్షిణాన తమిళనాడు లోని కన్యాకుమారిని కలుపుతూన్న 2369 కి.మీ పొడవయిన రోడ్డు.