The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
బిర్సా ముండా (1875–1900) లేదా బిర్సా భగవాన్ భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు.19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు, తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
గాలి మాధవీలత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఆమె జియోసింధసిస్, ఎర్త్ క్వేక్ మేనేజిమెంటు, రాక్ ఇంజనీరింగ్ లో విశేష సేవలనందిస్తున్నారు. ఇండియన్ ఇనస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ సూచనల మేరకు చీనాబ్ వంతెన డిజైన్ ప్రొవైడర్‌గా సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ మాధవీలతను నియమించారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
హిందూ సామ్రాజ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా జరుపుకుంటారు.ఛత్రపతి శివాజీహిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు.1674 జూన్ 6న (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు.శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శహజీ భోస్లె, జిజాభాయి దంపతులకు జన్మించాడు.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం
ధరణి Archived 2023-07-11 at the Wayback Machine సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రములో ఉన్న వ్యవసాయ , వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్ . ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ( భూ పరిపాలన శాఖ ) ఆరంభించింది . దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు , ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యం.
చీనాబ్ వంతెన భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆర్చి వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్ లోని రేసి జిల్లాలో, బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానంగా ఉంటుంది. వంతెన పూర్తయినప్పుడు 1,263 మీటర్ల (4,144 అడుగులు) పొడవు, ఆర్చ్ స్పాన్ దూలం 480 మీటర్ల (1,570 అడుగులు) తో, చీనాబ్ నదిపైన 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో, కౌరి వైపు వయాడక్ట్ 650 మీటర్ల (2,130 అడుగులు) పొడవుగా ఉంటుంది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం -2009 (RTE-2009) అనేది 4 ఆగస్టు 2009న రూపొందించబడిన భారత పార్లమెంటు చట్టం, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A లో ఉంది. భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టం 1 ఏప్రిల్ 2010న అమల్లోకి వచ్చినప్పటి నుండి విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కుగా అందించే 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.
మిస్ వరల్డ్ 2025, అనేది మిస్ వరల్డ్ పోటీ 72వ ఎడిషన్ .చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈవెంట్ ముగింపులో ఎన్నికైన వారిని తన వారసురాలిగా పట్టాభిషేకం చేస్తుంది. హైదరాబాదులో 2025 మే 7 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ అందాల పోటీలలో 120 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నది.
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్వవసాయ భూముల నిర్వహణకు కోసం భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హైదరాబాదు లోని శిల్పకళా వేదిక , హైటెక్ సిటీ, మాదాపూర్ లో తేది:14 ఏప్రిల్ 2025 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భూపరిపాలనలోని ధరణి స్థానంలో కొత్త ఆర్.ఓ .ఆర్ చట్టం భూ భారతి పొర్టల్ -2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు
ఇంగ్లీషు పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు 1999.మార్చి 11 న విడుదలైన తెలుగు చిత్రం.వి. ఎం. సి.ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.సురేష్ వర్మ దర్శకుడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
చిత్రదుర్గ, నగరం బళ్ళారినుండి షిమోగా, దావణెగెరే వెళ్ళు మార్గంలో, బళ్ళారినుండి 125కి.మీ దూరంలో ఉంది.అలాగే బెంగళూరు-దావణేగెరె (బెంగళూరు-పుణె జాతీయరహదారి-4) రాస్తాలో, బెంగుళూరుకు 210కి.మీ దూరంలో ఉంది. బళ్ళారి-బెంగళూరు రహదారిలో బళ్ళారికి 105 కి.మీ దూరంలో చళ్ళెకెరే అను పట్టణం నుండి 20కి.మీ.దూరంలో ఈ నగరం ఉంది. ఈ నగరం పేరుమీదనే జిల్లా ఉంది.
'నార్ఫోక్ ఐలాండు ( NOR-fək, locally NOR-fohk;Norf'k Ailen) అనేది పసిఫిక్ మహాసముద్రంలో న్యూజిలాండ్, న్యూ కాలెడోనియా మధ్య ఉన్న ఆస్ట్రేలియా బాహ్య భూభాగం, ఇది ఆస్ట్రేలియా ఎవాన్సు హెడ్ నుండి తూర్పున 1,412 కిలోమీటర్లు (877 మై.), లార్డు హోవే ద్వీపం నుండి సుమారు 900 కిలోమీటర్లు (560 మై.) దూరంలో ఉంది. పొరుగున ఉన్న ఫిలిపు ద్వీపం, నేపియను ద్వీపం లతో కలిపి మూడు దీవులు సమిష్టిగా నార్ఫోకు ద్వీపం భూభాగంను ఏర్పరుస్తాయి. 2021 జనాభా లెక్కలు ప్రకారం దాని మొత్తం వైశాల్యం సుమారు 35 కి.మీ2 (14 చ.
పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకము (Mid Day Meal Program) అంటారు. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. ఇందులో అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెడతారు.
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
జాతీయ విద్యా ప్రణాళికా చట్రం - 2005
జాతీయ విద్యా ప్రణాళికా చట్రం 2005 (NCF 2005) అనేది భారతదేశంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ద్వారా 2005లో ప్రచురించబడిన నాల్గవ జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్. గతంలో దీనిని 1975, 1988, 2000 సంవత్సరాలలో ప్రచురించారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.