The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
భర్త మహాశయులకు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిరించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ను & గ్లింప్స్‌ని 2025 నవంబర్ 10న, టీజర్‌ను 2025 డిసెంబర్ 21న విడుదల చేశారు.
భారత పార్లమెంటు, (లేదా సంసద్) అనేది భారత గణతంత్ర రాజ్య అత్యున్నత శాసనసభ. ఇది రాజ్యసభ (రాష్ట్రాల మండలి), లోక్‌సభ (ప్రజలసభ లేదా హౌస్ ఆఫ్ పీపుల్) లతో కూడిన ద్విసభ శాసనసభ. భారత గణతంత్ర రాజ్య అధ్యక్షుడు, శాసనసభ అధిపతిగా, పార్లమెంటు సభను పిలిపించడానికి, ప్రోరోగ్ చేయడానికి లేదా లోక్‌సభను రద్దు చేయడానికి పూర్తి అధికారాలను కలిగి ఉంటారు.
సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్ప దేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి, ఇతర సర్పాలు సుబ్రమణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి.
తిథి అంటే : వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య, అదే సూర్యచంద్రులు ఒకరికి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
నేతాజీ జయంతి లేదా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, అధికారికంగా పరాక్రమ్ దివస్ లేదా పరాక్రమ్ దివస్ (అక్షరాలా 'శౌర్య దినోత్సవం') అని పిలుస్తారు, ఇది ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజును పురస్కరించుకుని భారతదేశంలో జరుపుకునే జాతీయ కార్యక్రమం. . దీనిని ప్రతి సంవత్సరం జనవరి 23న జరుపుకుంటారు. ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆలిండియా రేడియో (అధికారికముగా ఆకాశవాణి) (హిందీ: आकाशवाणी) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార , ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి (బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన దూరదర్శన్ యొక్క సోదర విభాగం.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియనే ఎన్నికల వ్యవస్థగా పిలువబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వాతంత్ర్యం 2004 లో జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలోగల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
శంబాల 2025లో విడుదలైన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 7న, ట్రైలర్‌ను నవంబర్ 1న నటుడు ప్రభాస్ విడుదల చేయగా, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుండి వేరుపడి యేర్పడింది, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలలోని నగరాలకు, పట్టణాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది.
చెరబండరాజు (1944 - జూలై 2, 1982) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి" ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత. అతను ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుందని గాఢంగా నమ్మిన వ్యక్తి. అతనికి మహాకవి శ్రీశ్రీ తన "మరోప్రస్థానం" కావ్యాన్ని అంకితమిచ్చాడు.