The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
నేతాజీ జయంతి లేదా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, అధికారికంగా పరాక్రమ్ దివస్ లేదా పరాక్రమ్ దివస్ (అక్షరాలా 'శౌర్య దినోత్సవం') అని పిలుస్తారు, ఇది ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజును పురస్కరించుకుని భారతదేశంలో జరుపుకునే జాతీయ కార్యక్రమం. . దీనిని ప్రతి సంవత్సరం జనవరి 23న జరుపుకుంటారు. ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియనే ఎన్నికల వ్యవస్థగా పిలువబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వాతంత్ర్యం 2004 లో జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలోగల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
ఇందర్బీర్ సింగ్ "ఇష్" సోధీ (జననం 1992 అక్టోబరు 31) భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించిన న్యూజిలాండ్ క్రికెటర్, అతను అన్ని ఫార్మాట్లలో న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు, దేశీయ క్రికెట్లో కాంటర్బరీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను కుడిచేతి లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు, కుడిచేతితో బ్యాటింగ్ చేస్తాడు. అతను 2018 జనవరిలో T20I బౌలర్లలో నం.1 ర్యాంకింగ్‌కు చేరుకున్నాడు.
కానిస్టేబుల్ కనకం 2025లో విడుదలైన వెబ్ సిరీస్. మీటోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించాడు. వర్ష బొల్లమ్మ, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను ఆగష్టు 8న విడుదల చేసి, సిరీస్‌ను ఆగస్టు 14 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భర్త మహాశయులకు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిరించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ను & గ్లింప్స్‌ని 2025 నవంబర్ 10న, టీజర్‌ను 2025 డిసెంబర్ 21న విడుదల చేశారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ భారతీయ రైల్వేలచే నిర్వహించబడే సామాన్య ప్రజానీకానికి అందుబాటులో సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సేవ. ఇది 800 కిమీ (500 మైళ్ళు) కంటే ఎక్కువ దూరంలో ఉన్న లేదా ఇప్పటికే ఉన్న సేవలతో ప్రయాణించడానికి పది గంటల కంటే ఎక్కువ సమయం పట్టే నగరాలను కలుపుతూ ఎయిర్ కండిషన్ లేని, తక్కువ-ధర, స్లీపర్ సౌకర్యంతో పాటు రిజర్వ్ చేయబడని కోచ్ లు కలిగిన రైలుసేవ. ఈ రైలు సెట్ కు ఇరువైపులా ఇంజిన్లు ఉంటాయి.
ఎమిలీ షెంకెల్ (ఆంగ్లం: Emilie Schenkl) జనవరి 26, 1910లో ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె 23 ఏళ్ల ప్రాయంలో వియన్నా, ఆస్ట్రియా(యూరప్)లో చికిత్స పొందుతున్న సుభాష్ చంద్రబోస్ 'ద ఇండియన్ స్ట్రగుల్' అనే పుస్తకం రాయడంలో సహాయకురాలిగా నియమితురాలైంది. ఎమిలీ షెంకెల్ 1934 జూన్ నుంచి 34 ఏళ్ల సుభాష్ చంద్రబోస్ తో కలిసి పని చేయడం ప్రారంభించింది.
విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు. అతను 2021 ఆగష్టు 10న పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అతను రెండవసారి 2022 జూన్ 22 నుండి వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అధికారంలో ఉన్నాడు.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
సాధారణంగా సఫావిద్ ఇరాన్,ممالک محروسه ایران, Mamâlek-e Mahruse-ye Irânసఫావిద్ పర్షియా شاهنشاهی صفوی లేదా సఫావిద్ సామ్రాజ్యం అని పిలువబడే ఇరాన్ రక్షిత రాజ్యాలు (ఫార్సీ: ممالک محروسه ایران, మమలెకు-ఎ మహ్రూసే-యే ఇరాన్) అతిపెద్ద, ఎక్కువ కాలం పాటు కొనసాగిన ఇరానియను సామ్రాజ్యాలలో ఒకటి. దీనిని 1501 నుండి 1736 వరకు సఫావిదు రాజవంశం పాలించింది, అయితే ఇస్ఫాహాన్ ఆఫ్ఘన్ల వశమైన 1722వ సంవత్సరంలోనే దీని పాలన ముగిసిందని మరికొందరు పేర్కొంటారు. ఇది తరచుగా ఆధునిక ఇరాన్ చరిత్రకు నాందిగా పరిగణించబడుతుంది, అలాగే గన్‌పౌడరు సామ్రాజ్యాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది.
చెరబండరాజు (1944 - జూలై 2, 1982) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి" ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత. అతను ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుందని గాఢంగా నమ్మిన వ్యక్తి. అతనికి మహాకవి శ్రీశ్రీ తన "మరోప్రస్థానం" కావ్యాన్ని అంకితమిచ్చాడు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
ఆజాద్ హింద్ ఫౌజ్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆగ్నేయాసియాలో 1942 సెప్టెంబరు 1 న భారతీయ స్వాతంత్ర్య యోధులు, జపాన్ సామ్రాజ్యం కలిసి ఏర్పాటు చేసిన సాయుధ శక్తి. బ్రిటిషు పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం దీని లక్ష్యం. రెండవ ప్రపంచ యుద్ధపు ఆగ్నేయాసియా యుద్ధరంగంలో జరిగిన యుద్ధంలో ఇది జపాను సైనికులతో కలిసి పోరాడింది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.