The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
భర్త మహాశయులకు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిరించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ను & గ్లింప్స్‌ని 2025 నవంబర్ 10న, టీజర్‌ను 2025 డిసెంబర్ 21న విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల జాబితా
భారతదేశంలోని తెలంగాణలోని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల గురించి తెలుపుతుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. కార్పొరేషన్ల చైర్మన్లు, నామినేటెడ్ పోస్టుల పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది.
తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
ఈ వ్యాసం తెలంగాణలోని నగరపాలక సంస్థలను, పురపాలక సంఘాలను వివరించే అన్ని పట్టణ స్థానిక సంస్థలను గురించి తెలుపుతుంది. ఇందులోని వివరాలు భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా గణాంక డేటా ప్రకారం ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి నాటికి పట్టణ స్థానిక సంస్థలు మొత్తం 147 ఉన్నాయి.
బాబు గోగినేని హైదరాబాదుకు చెందిన ప్రముఖ హేతువాది, మానవవాది . ఏప్రిల్ 14, 1968న జన్మించిన 'రాజాజీ రామనాథబాబు గోగినేని' తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో ఫ్రెంచ్ భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు అంతర్జాతీయ మానవత, నైతిక సంఘమునకు (International Humanist and Ethical Union) అధ్యక్షునిగా పనిచేశాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర 2014 నవంబరు 28న విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. జేఆర్ పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్ గుప్త నిర్మించిన ఈ సినిమాకు శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో సుమన్, రమ్యకృష్ణ, రంగనాథ్, సాయి కిరణ్, సందీప్తి, శోభ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించగా, సాలూరి వాసురావు సంగీతం అదించాడు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు. ప్రస్తుతం 16 జట్లు ఉన్నాయి, ఇందులో ఐసీసీ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మొదటి పది జట్లు, టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపిక చేయబడిన ఆరు ఇతర జట్లు ఉన్నాయి.
'పండంటి కాపురం' తెలుగు కుటుంబ కథా చిత్రం,1972 జూలై 21 న విడుదల.లక్ష్మీదీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, దేవిక, జూలూరి జమున, ప్రభాకర్ రెడ్డి, బెంగుళూరు సరోజాదేవి, సామర్ల వేంకట రంగారావు, రాజబాబు, అల్లు రామలింగయ్య, రాధా కుమారి, రామ్మోహన్, కుమారి సుజాత (జయసుధ), మాస్టర్ నరేశ్, బేబీ సులక్షణ, పండరిబాయి, మిక్కిలినేని, ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
లాలా లజపత్ రాయ్ (1865 జనవరి 28-1928 నవంబరు 17) (ఆంగ్లం: Lala Lajpat Rai) - (పంజాబీ భాష: ਲਾਲਾ ਲਜਪਤ ਰਾਯ, لالا لجپت راے; హిందీ భాష: लाला लाजपत राय) భారత్ కు చెందిన రచయిత, రాజకీయ నాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకే గ్రామంలో జనవరి 28, 1865 న జన్మించాడు. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయి, నవంబరు 17, 1928 న.తుది శ్వాస విడిచాడు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్,సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
సిక్కు సామ్రాజ్యం అనేది భారత ఉపఖండంలోని పంజాబ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన ఒక ప్రాంతీయ శక్తి. ఇది 1799లో మహారాజా రంజిత్ సింగ్ లాహోర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధం తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఓడిపోయి, జయించబడిన 1849 వరకు ఉనికిలో ఉంది. 19వ శతాబ్దం మధ్యలో దాని ఉచ్ఛస్థితిలో, ఈ సామ్రాజ్యం ఉత్తరాన గిల్గిట్ మరియు టిబెట్ నుండి దక్షిణాన సింధ్ ఎడారుల వరకు, పశ్చిమాన ఖైబర్ కనుమ నుండి తూర్పున సట్లెజ్ వరకు విస్తరించి ఉంది, మరియు ఎనిమిది ప్రావిన్సులుగా విభజించబడింది.
పొదరిల్లు (బుల్లితెర ధారావాహిక)
పొదరిల్లు 2025, డిసెంబర్ 1న స్టార్ మాలో ప్రారంభమైన ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారంచేయబడుంది.