The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
లాలా లజపత్ రాయ్ (1865 జనవరి 28-1928 నవంబరు 17) (ఆంగ్లం: Lala Lajpat Rai) - (పంజాబీ భాష: ਲਾਲਾ ਲਜਪਤ ਰਾਯ, لالا لجپت راے; హిందీ భాష: लाला लाजपत राय) భారత్ కు చెందిన రచయిత, రాజకీయ నాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకే గ్రామంలో జనవరి 28, 1865 న జన్మించాడు. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయి, నవంబరు 17, 1928 న.తుది శ్వాస విడిచాడు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అనేది అజిత్ పవార్ నాయకత్వంలోని ఒక భారతీయ రాజకీయ విభాగం. ఇది శరద్ పవార్ నేతృత్వంలోని ప్రధాన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయింది. ఈ వర్గానికి ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి 41 మంది ఎమ్మెల్యేలు, నాగాలాండ్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు, భారత పార్లమెంటులో 2 ఎంపీలు ఉన్నారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం)
యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ఆఫ్ ఇండియా (ఆంగ్లం: University Grants Commission of India) అనేది UGC చట్టం 1956[2] ప్రకారం భారత ప్రభుత్వంలోని ఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ఉన్నత విద్య ప్రమాణాలు.సమన్వయం, నిర్ణయం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. ఇది భారతదేశంలోని విశ్వవిద్యాలయాలకు గుర్తింపును అందిస్తుంది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితా
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖకు ఉప అధిపతి, మంత్రుల మండలిలో రెండవ అత్యున్నత స్థాయి మంత్రి. 2024 డిసెంబరు 5 నుండి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులుగా అధికారంలో ఉన్నారు.
అర్జిత్ సింగ్ (జననం 25 ఏప్రిల్ 1987) భారతదేశానికి చెందిన సినీ గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన 2005లో, ఫేమ్ గురుకుల్ రియాలిటీ షోలో పాల్గొని గాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు, అరిజిత్ సింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు & ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్నాడు. అర్జిత్ సింగ్ కు కళా రంగానికి చేసిన సేవకుగాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం అవార్డును జనవరి 25న ప్రకటించింది.
అన్నగారు వస్తారు 2025లో విడుదలైన సినిమా. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించాడు. కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 28న, ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 12న విడుదల చేశారు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖకు అధిపతి. శాసనసభకు జరిగిన ఎన్నికల తరువాత, గవర్నరు అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తాడు. నియమితుడు మహారాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యుడు కానట్లయితే, వారు ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఆ రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎన్నుకోబడాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది.
భర్త మహాశయులకు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిరించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ను & గ్లింప్స్‌ని 2025 నవంబర్ 10న, టీజర్‌ను 2025 డిసెంబర్ 21న విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల జాబితా
భారతదేశంలోని తెలంగాణలోని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల గురించి తెలుపుతుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. కార్పొరేషన్ల చైర్మన్లు, నామినేటెడ్ పోస్టుల పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
ఈ వ్యాసం తెలంగాణలోని నగరపాలక సంస్థలను, పురపాలక సంఘాలను వివరించే అన్ని పట్టణ స్థానిక సంస్థలను గురించి తెలుపుతుంది. ఇందులోని వివరాలు భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా గణాంక డేటా ప్రకారం ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి నాటికి పట్టణ స్థానిక సంస్థలు మొత్తం 147 ఉన్నాయి.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
మహారాష్ట్ర శాసనసభలోని మొత్తం 288 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబరు 20న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో 66.05% పోలింగ్ నమోదైంది. ఇది 1995 తర్వాత అత్యధికం.
ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 28 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం(రంపచోడవరం),అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
బారామతి లోక్‌సభ నియోజకవర్గం (Baramati Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. కేంద్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇక్కడి నుంచి 6 సార్లు విజయం సాధించాడు. తొలిసారి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తరఫున, 3 సార్లు కాంగ్రెస్ తరఫున, ఆ తర్వాత రెండు సార్లు నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలుపొందినాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్,సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరిగే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ జాతరకు సంబందించిన పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ సచివాలయంలో ఆవిష్కరించారు. మేడారం జాతర భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 సెప్టెంబరు 26 - 1946 జూన్ 17) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు. ప్రస్తుతం 16 జట్లు ఉన్నాయి, ఇందులో ఐసీసీ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మొదటి పది జట్లు, టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపిక చేయబడిన ఆరు ఇతర జట్లు ఉన్నాయి.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.