The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..
ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది.
మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.
రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
కళానిధి మారన్ (జననం 1964 జూలై 24) ఒక భారతీయ బిలియనీర్ మీడియా యజమాని. ఆయన భారతదేశంలోని అతిపెద్ద మీడియా సమ్మేళనాలలో ఒకటైన సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. ఆయన బహుళ టెలివిజన్ ఛానళ్లు, వార్తాపత్రికలు, వారపత్రికలు, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సేవలు, ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ (సన్ పిక్చర్స్), మూడు క్రికెట్ జట్టు ఫ్రాంచైజీలను కలిగి ఉన్నాడు: ఇండియన్ ప్రీమియర్ లీగ్, సన్రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికాలో ఎస్ఎ 20 లీగ్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఇంగ్లాండులోని ది హండ్రెడ్ లో సన్రైజర్ లీడ్స్.
జైలర్ 2023లో విడుదలైన యాక్షన్ కామెడీ సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం రజనీకాంత్ యొక్క 169వ చిత్రం అయిన తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రకటించబడింది, జూన్‌లో అధికారికంగా జైలర్ అనే టైటిల్‌ను ప్రకటించారు. రజినీకాంత్, శివరాజ్‌కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 10న ఏషియన్ మల్టీప్లెక్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు విడుదల చేశాయి.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
ప్రభాస్గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు
పంచాయితీరాజ్ వ్యవస్థను తొలిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవది. 1959 నవంబరు 1 న, ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితి, బ్లాకు పంచాయితీ సమితి, జిల్లా పరిషత్తు లతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది. 1986లో ప్రజలవద్దకు పాలన అనే నినాదంతో 20-30 గ్రామాలను మండలంగా చేర్చి, బ్లాకు స్థాయిలో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయ ఆచార్యుడు, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త. ఈయన ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పాశ్చాత్య నాగరికతను మార్చివేసాయి. లూథర్ ధర్మ శాస్త్రము పోప్ ఆధిక్యతను ప్రశ్నించింది.
నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇది ఒక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర రాజ్యాంగ, చట్టపరమైన అధికారం కలిగిన సంస్థ. ఇది భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్సు 243 జెడ్ఎ, 243 కె కింద ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.