The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
గిరిబాబు (1946 జూన్ 8 - 2026 నవంబరు14) గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మా⁸త. ఆయన సుమారు 4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటించాడు .ఆయన ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఆయన కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు.
బిర్సా ముండా (1875 నవంబరు 15 – 1900 జూన్ 9) ముండా తెగకు చెందిన భారతీయ ఆదివాసి స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ రాజ్ సమయంలో బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం జార్ఖండ్)లో వెలిసిన తెగ మత మిలీనేరియన్ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. దీనివల్ల భారత స్వాతంత్ర్య ఉద్యమం చరిత్రలో ఆయన ముఖ్యమైన వ్యక్తిగా మారాడు.
మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
అగ్ని (Sanskrit: अग्नि [ˈɐgni], అంటే 'నిప్పు') హిందూ మతంలో అగ్ని దేవుడు. ఈయన ఆగ్నేయ దిశకు సంరక్షక దైవం (దిక్పాలకుడు). ఈ కారణం చేతనే హిందూ దేవాలయాలలో ఆగ్నేయ మూలల్లో అగ్ని దేవుడి విగ్రహాలు లేదా ఆయనకు సంబంధించిన గుర్తులు కనిపిస్తాయి.హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ భౌతిక ప్రపంచం ఏర్పడటానికి ఐదు ముఖ్యమైన మూలకాలు కారణం.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2024 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
మెరుపు దాడి భ్రమరాంబికా మూవీస్ పతాకంపై పి.యన్.రామచంద్రరావు దర్శకత్వంలో నటుడు గిరిబాబు 1984లో నిర్మించిన యాక్షన్/అడ్వెంచర్ హిట్ చిత్రం. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో నిర్మించబడిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రాజాగా హీరో సుమన్, గండడుగా హీరో గిరిబాబు, భానుగా హీరో భానుచందర్, శివంగిగా సుమలత, మాలాదేవిగా జయమాలిని, ప్రొఫెసర్ వర్మగా రంగనాధ్, మృతసంజీవరాయుడుగా గొల్లపూడి మారుతీరావు, బహదూర్ గా ప్రభాకర రెడ్డి, అంజిగా సారథి ప్రధాన పాత్రధారులుగా నటించారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది.
అనిల్ కుమార్ రావిపూడి (జననం 23 నవంబర్ 1982) తెలుగు సినీ రచయిత, దర్శకుడు. ఆయన యాక్షన్ కామెడీ చిత్రం పటాస్ (2015) తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు, ఉత్తమ తొలి దర్శకుడు-తెలుగుగా SIIMA అవార్డును గెలుచుకున్నారు. ఆ తరువాత రెండు యాక్షన్ కామెడీలు సుప్రీం (2016) & రాజా ది గ్రేట్ (2017) తరువాత కామెడీ F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019) లకు దర్శకత్వం వహించాడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం"లో ఈయన ప్రభావము చాలా ఉంది.
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం. మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి.
జెన్సన్ హువాంగ్ (ఆంగ్లం: Jensen Huang; జననం: 1963 ఫిబ్రవరి 17) ఒక తైవానీస్, అమెరికన్ వ్యాపార కార్యనిర్వాహకుడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన ఎన్విడియా (Nvidia Corporation)కు వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, మాజీ సీఈఓ. 2026లో ఫోర్బ్స్ అతని నికర విలువను 200 బిలియన్ డాలర్లకు పైగా అంచనా వేసింది, దీంతో అతను ప్రపంచంలో ఏడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సార్ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజర్‌ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.