The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
ముంగిస (Mongoose) అనేది 'హెర్పెస్టిడే' (Herpestidae) కుటుంబానికి చెందిన ఒక చిన్న మాంసాహార క్షీరదం. ఇవి ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా,, దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో కనిపిస్తాయి. నాగుపాము వంటి అత్యంత విషపూరితమైన పాములతో అత్యంత వేగంగా, ధైర్యంగా పోరాడి వాటిని చంపి తినగలిగే అసాధారణ సామర్థ్యానికి ముంగిసలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ప్రత్యగాత్మ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం 1969, జూన్ 6వ తేదీన విడుదలయ్యింది.అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత , జంటగా నటించిన ఈ చిత్రం లో చిత్తూరు నాగయ్య, గుమ్మడి , అంజలీ దేవి,నాగభూషణం, ఎస్ వరలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, భారత ప్రభుత్వం చే ఈచిత్రం ఎంపిక కాబడింది. ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.
[[Category:Articles lacking in-text citations --> from 2023 ఆగస్టు<~--]] అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 - ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన, మా వారి మంచితనం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.
మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.
కింజరాపు ఎర్రన్నాయుడు (23 ఫిబ్రవరి, 1957 - 2 నవంబర్, 2012 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్‌వీప్‌గా, నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రైల్వే, అగ్రికల్చర్ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా, పార్లమెంట్ హౌస్‌లో ఫుడ్ కమిటీ ప్రతినిధిగా వివిధ పదవులు నిర్వహించాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
నిధి రజ్దాన్ (జననం 11 ఏప్రిల్ 1977) ఒక భారతీయ పాత్రికేయురాలు, టెలివిజన్ వ్యక్తి. ఆమె ఎన్డీటీవీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎన్డీటీవీ 24x7 న్యూస్ డిబేట్ షో లెఫ్ట్, రైట్ & సెంటర్, వారపు డిబేట్ షో ది బిగ్ ఫైట్ యొక్క ప్రాథమిక యాంకర్. 1999 నుండి, రజ్దాన్ అనేక రకాల వార్తా కార్యక్రమాలను కవర్ చేసింది, వరుస కార్యక్రమాలను నిర్వహించింది, తరచుగా వార్తల దృశ్యం నుండి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు 1న జరపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్‌గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.
2026 ఆంధ్రప్రదేశ్ నగరపాలక, పురపాలక ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి **2026 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు** నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడ్డాయి.
బల్మూరి వెంకట్ నర్సింగరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
ఎనుముల రేవంత్ రెడ్డి (జననం 8 నవంబర్ 1969) తెలంగాణ రెండవ & ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
దివ్య భారతి (Hindi pronunciation: [dɪʋjaː bʱaːrtiː]; 25 ఫిబ్రవరి 1974 – 5 ఏప్రిల్ 1993) హిందీ, తెలుగు చిత్రాలలో నటించిన ప్రముఖ భారతీయ నటి. తన అద్భుతమైన నటన, ఉత్సాహం, అందానికి ప్రసిద్ధి చెందిన ఆమె తన కాలంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు, నంది అవార్డును గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత నగర మేయర్ల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 నగరాలలో ఉన్న నగర పాలక సంస్థలకు (Municipal Corporations) మేయర్ అధిపతిగా ఉంటారు. నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అన్ని విధులు అధికారికంగా మేయర్ పేరుతోనే నిర్వహించబడతాయి. మేయర్‌ను నగరంలోని తొలి పౌరుడు (First Citizen)గా కూడా పరిగణిస్తారు.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నడియాడ్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం || హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో శ్రీమహావిష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి స్థితి కర్త, లయ కర్త, సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మం, సర్వేశ్వరుడు.
మూస:Infobox chemical నీరు, ఉదకం లేదా జలం (Water) అనేది సకల జీవుల మనుగడకు అత్యవసరమైన ఒక సహజ రసాయన పదార్థం. దీని రసాయన సాంకేతిక నామం H2O. అనగా ఒక నీటి అణువులో రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు సమయోజనీయ బంధం (Covalent bond) ద్వారా కలసి ఉంటాయి. భూమి మీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత అత్యంత ముఖ్యమైనది నీరే.
2026 తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జనవరి 27న విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.