The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు 1న జరపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
ముంగిస (Mongoose) అనేది 'హెర్పెస్టిడే' (Herpestidae) కుటుంబానికి చెందిన ఒక చిన్న మాంసాహార క్షీరదం. ఇవి ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా,, దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో కనిపిస్తాయి. నాగుపాము వంటి అత్యంత విషపూరితమైన పాములతో అత్యంత వేగంగా, ధైర్యంగా పోరాడి వాటిని చంపి తినగలిగే అసాధారణ సామర్థ్యానికి ముంగిసలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..
నిధి రజ్దాన్ (జననం 11 ఏప్రిల్ 1977) ఒక భారతీయ పాత్రికేయురాలు, టెలివిజన్ వ్యక్తి. ఆమె ఎన్డీటీవీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎన్డీటీవీ 24x7 న్యూస్ డిబేట్ షో లెఫ్ట్, రైట్ & సెంటర్, వారపు డిబేట్ షో ది బిగ్ ఫైట్ యొక్క ప్రాథమిక యాంకర్. 1999 నుండి, రజ్దాన్ అనేక రకాల వార్తా కార్యక్రమాలను కవర్ చేసింది, వరుస కార్యక్రమాలను నిర్వహించింది, తరచుగా వార్తల దృశ్యం నుండి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం || హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో శ్రీమహావిష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి స్థితి కర్త, లయ కర్త, సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మం, సర్వేశ్వరుడు.
2026 ఆంధ్రప్రదేశ్ నగరపాలక, పురపాలక ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి **2026 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు** నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడ్డాయి.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నడియాడ్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ప్రత్యగాత్మ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం 1969, జూన్ 6వ తేదీన విడుదలయ్యింది.అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత , జంటగా నటించిన ఈ చిత్రం లో చిత్తూరు నాగయ్య, గుమ్మడి , అంజలీ దేవి,నాగభూషణం, ఎస్ వరలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, భారత ప్రభుత్వం చే ఈచిత్రం ఎంపిక కాబడింది. ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
2021 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 57 మున్సిపాల్టీలు, 18 నగర పంచాయతీలకు 10 మార్చి 2021న ఎన్నికలు జరిగాయి .
డా.వాకిటి శ్రీహరి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2025 జూన్ 8న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, చేయగా, జూన్ 11న పశుసంవర్థక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, క్రీడలు & యువజన సర్వీసుల శాఖలను కేటాయించింది. డా.వాకిటి శ్రీహరి 2025 జూన్ 12న ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమితుడయ్యాడు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 శాసనసభను ఏర్పాటు చేయడం కోసం, 2024 మే 13న రాష్ట్రంలో 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2024 భారత సాధారణ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎకకాలంలో జరిగాయి. వోట్ల లెక్కింపు 2024 జూన్ 4న జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత నగర మేయర్ల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 నగరాలలో ఉన్న నగర పాలక సంస్థలకు (Municipal Corporations) మేయర్ అధిపతిగా ఉంటారు. నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అన్ని విధులు అధికారికంగా మేయర్ పేరుతోనే నిర్వహించబడతాయి. మేయర్‌ను నగరంలోని తొలి పౌరుడు (First Citizen)గా కూడా పరిగణిస్తారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాలంలో, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.