The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.
పరిటాల శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన యువ నాయకుడు. రాయలసీమ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన పరిటాల కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం జిల్లా కేంద్రంగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను సమన్వయం చేయడంలోనూ, ప్రజా సమస్యలపై గళం ఎత్తడంలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )
మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను )ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా (2021–2026) వ్యవహరించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్సార్ కాంగ్రెస్) విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా, విశాఖ జిల్లా భీమునిపట్నం శాసనసభా నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇంచార్జిగా పని చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ (జననం 2001 డిసెంబరు 28) భారత క్రికెట్ జట్టు తరపున ఆడే అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2023 వెస్టిండీస్ లో జరిగిన మొదటి టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, టెస్ట్ క్రికెట్ లో తన మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ఆయన దేశీయ క్రికెట్లో ముంబై తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడతాడు.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
టిప్పూ సుల్తాన్ (పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు - మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం (1750 నవంబరు 20, దేవనహళ్ళి – 1799 మే 4, శ్రీరంగపట్నం), హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమా(ఫక్రున్నీసా)ల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు.
గిరిబాబు (1946 జూన్ 8 - 2026 నవంబరు14) గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మా⁸త. ఆయన సుమారు 4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటించాడు .ఆయన ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఆయన కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు.
దేవదత్ పాడిక్కల్ (జననం 7 జూలై 2000) భారత క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఆయన భారత అండర్-19 జట్టు తరపున ఆడి, జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ ద్వారా భారత జట్టుతో అరంగేట్రం చేశాడు.
ప్రబోధిని ఏకాదశి (प्रबोधिनी एकादशी/ప్రబోధినీ ఏకాదశీ), దీనిని దేవ ఉత్థాన ఏకాదశి (देव उत्तान एकादशी / దేవ ఉత్తాన ఏకాదశీ) అని కూడా పిలుస్తారు, ఇది హిందూ మాసమైన కార్తీకంలోని శుక్ల పక్షంలో 11వ చాంద్రమాన రోజు (ఏకాదశి). భగవంతుడైన విష్ణువు నిద్రిస్తున్నాడని విశ్వసించే నాలుగు నెలల చాతుర్మాస్య కాలం ముగింపును ఇది సూచిస్తుంది. విష్ణువు శయని ఏకాదశి రోజున నిద్రించి, ఈ రోజున మేల్కొంటాడని భక్తుల నమ్మకం.
సేనాపతి 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్‌ను నటుడు సాయి ధరమ్ తేజ్ 12డిసెంబర్ 2021న విడుదల చేయగా, ట్రైలర్‌ను 21 డిసెంబర్ 2021న విడుదల చేశారు.
పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004, 2014లో కోవూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఎనుముల రేవంత్ రెడ్డి (జననం 8 నవంబర్ 1969) తెలంగాణ రెండవ & ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
అనుమాన పక్షి 2026లో తెలుగులో విడుదలైన కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక, స్నేహ రాజేష్ జగ్తియాని, విహాన్ దండ్ నిర్మించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, రాశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 జూన్ 9న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 14న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 18న విడుదల చేశారు.
తులసి వివాహ ( సంస్కృతం : తులసి వివాహం , romanized : romanized: Tulasī Vivāha , గుజరాతీ : તુલસી િવાહ, కన్నడ : తులసి వివాహం , రోమనైజ్డ్ : తులసి వివాహం , తెలుగు తులసి వివాహం Tulasi Kaḷyāṇaṁ , మలయాళం : తులసి కల్యాణం , రోమనైజ్డ్ : Tuḷasi kalyaṇam , Tamil : తులసి కల్యాణం , romanized: Tulasi Kaḷyaṇam , lit. 'తులసి వివాహం ', మరాఠీ : తుళశీచం లగ్న , రోమనైజ్డ్ : Tuḷśīca lagna, lit.' తులసి కళ్యాణం'), తులసి కల్యాణం అని కూడా పిలుస్తారు, ఒక హిందూ ఆచారం, దీనిలో తులసి లేదా పవిత్ర తులసి (లక్ష్మి మూర్తిమత్వం), శాలిగ్రామం లేదా ఉసిరి కొమ్మ (విష్ణువు ప్రతిరూపాలు ) మధ్య సింబాలిక్ ఆచార వివాహం జరుగుతుంది. హిందూ మతంలో తులసి వివాహం వర్షాకాలం ముగింపును, వివాహ కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.