The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (ఆంగ్లం:International Men's Day లేదా IMD) ప్రతి సంవత్సరం నవంబరు 19 న అంతర్జాతీయా స్థాయిలో జరుపబడే ఉత్సవం. 1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ చే ఈ దినము ప్రారంభించబడిననూ, ట్రినిడాడ్ , టొబాగో దేశస్థులు దీనికి కొత్త ఊపిరులు ఊదారు. దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుండి క్రమం తప్పక జరుపుతున్నారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఒడిశా (ఒరియా: ଓଡ଼ିଶା) ( పాత పేరు ఒరిస్సా) తూర్పు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం . దీనికి ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నాయి. ఇది విస్తీర్ణంలో 8 వ అతిపెద్ద రాష్ట్రం, జనాభా ప్రకారం 11 వ అతిపెద్ద రాష్ట్రం.
గిరిబాబు (1946 జూన్ 8 - 2026 నవంబరు14) గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మా⁸త. ఆయన సుమారు 4 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటించాడు .ఆయన ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఆయన కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు.
మడావి హిడ్మా (1974 - 2025 నవంబరు 18) భారతీయ నక్సలైట్, అతను తన నియామకం సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు. ఛత్తీస్‌గఢ్ భద్రతా దళాలపై జరిగిన వివిధ దాడులకు, 2013లో దర్భా లోయలో జరిగిన నక్సల్ దాడికి హిడ్మాకు బాధ్యత ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆయన ఉన్నాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
ఎనుముల రేవంత్ రెడ్డి (జననం 8 నవంబర్ 1969) తెలంగాణ రెండవ & ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
2026 ఆంధ్రప్రదేశ్ నగరపాలక, పురపాలక ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి 2026 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడ్డాయి.
హెన్రీ మైఖేల్ నికోల్స్ (జననం 1991, నవంబరు 15) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. న్యూజీలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కాంటర్‌బరీ తరపున ఆడుతున్నాడు. ఇతనికి ఇద్దరు అన్నలు ఉన్నారు, వారిలో ఒకరు విల్లీ నికోల్స్ (బ్లాక్ క్యాప్స్, వైట్ ఫెర్న్‌లకు మీడియా కరస్పాండెంట్.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
బాబు గోగినేని హైదరాబాదుకు చెందిన ప్రముఖ హేతువాది, మానవవాది . ఏప్రిల్ 14, 1968న జన్మించిన 'రాజాజీ రామనాథబాబు గోగినేని' తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో ఫ్రెంచ్ భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు అంతర్జాతీయ మానవత, నైతిక సంఘమునకు (International Humanist and Ethical Union) అధ్యక్షునిగా పనిచేశాడు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా నాగేశ్వర్ రావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్‌లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 13న విడుదల చేయగా, సినిమా నవంబర్ 21న విడుదల చేశారు.
గురు ప్రార్థన || ఓం వందేఽహం మంగళాత్మానం భాస్వంతంవేదవిగ్రహమ్ | యజ్ఞవల్క్యం మునిశ్రేష్ఠం జిష్ణుం హరిహర ప్రభుమ్ || జితేంద్రియం జితక్రోధం సదాధ్యానపరాయణమ్ | ఆనందనిలయం వందే యోగానంద మునీశ్వరమ్ || ఏవం ద్వాదశ నామాని త్రిసంధ్యా యః పఠేన్నరః | యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్ || ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః | కణ్వకాత్యాయనాది మహర్షిభ్యో నమః || అది కురు పాంచాల దేశము. అందు గంగ ప్రవహించెడిది. ఆ నదీ తీరమున చమత్కార పురమను నగరం ఉంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2024 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) అనేది ఆంధ్ర రాష్ట్రం లోని ఉత్తర భాగం. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగా పరిగణించబడేవి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 వలన వీటితోపాటు కొత్తగా ఏర్పడిన, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, పోలవరం జిల్లాలు కూడా ఉత్తరాంధ్రలో భాగమే.
అనిల్ కుమార్ రావిపూడి (జననం 23 నవంబర్ 1982) తెలుగు సినీ రచయిత, దర్శకుడు. ఆయన యాక్షన్ కామెడీ చిత్రం పటాస్ (2015) తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు, ఉత్తమ తొలి దర్శకుడు-తెలుగుగా SIIMA అవార్డును గెలుచుకున్నారు. ఆ తరువాత రెండు యాక్షన్ కామెడీలు సుప్రీం (2016) & రాజా ది గ్రేట్ (2017) తరువాత కామెడీ F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019) లకు దర్శకత్వం వహించాడు.
ఆకాష్ దీప్ (జననం 15 డిసెంబర్ 1996) భారతదేశానికి చెండియాన్ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టుకు, దేశీయ క్రికెట్‌లో బెంగాల్ క్రికెట్ జట్టుకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు, బెంగాల్ ప్రో టీ20 లీగ్‌లో సర్వోటెక్ సిలిగురి స్ట్రైకర్స్‌కు కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా & కుడిచేతి లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు. ఆకాష్ దీప్ బీహార్‌లోని డెహ్రీలో జన్మించి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పెరిగాడు.
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం
కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం. మహబూబ్ నగర్ జిల్లా జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి.