The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
డకోయిట్: ఎ లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన భారతీయ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18, 2025న విడుదల చేయగా, సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
ముకుల్ దలీప్ చౌదరి (జననం 6 ఆగస్టు 2004) భారతీయ క్రికెటర్, అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు. అతను దేశీయ క్రికెట్లో రాజస్థాన్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడతాడు. చౌదరి 2022–23 రంజీ ట్రోఫీలో జనవరి 17, 2023న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.2025–26 విజయ్ హజారే ట్రోఫీలో డిసెంబర్ 24, 2025న లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
బల్మూరి వెంకట్ నర్సింగరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
వెంకటేశ్ అయ్యర్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రం తరపున ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఆయన న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఐపీఎల్-2022 వేలంలో కేకేఆర్ ఫ్రాంఛైజీ రూ.8 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది.
వెనిజులా, దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలో కరేబియన్ సముద్రంలోని ఒక తీర దేశం. దీన్ని అధికారికంగా " వెనిజులా బోలివారియ గణతంత్రం " అంటారు. ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ , టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 km2 (353,841 sq mi) జనసంఖ్య 3,17,75,371.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
హవాయి ( hə-WY-ee; Hawaiian: Hawaiʻi [həˈvɐjʔi, həˈwɐjʔi]) అనేది యునైటెడ్ స్టేట్స్ యొక్క ఒక ద్వీప రాష్ట్రం; ఇది పసిఫిక్ మహాసముద్రంలో, అమెరికా ప్రధాన భూభాగంకు నైరుతి దిశలో సుమారు 2,000 miles (3,200 km) దూరంలో ఉంది. (అలాస్కాతో పాటు) అమెరికా ప్రధాన భూభాగంతో భౌగోళికంగా కలసి లేని రెండు రాష్ట్రాలలో ఇది ఒకటి. ఇది ఉత్తర అమెరికా ప్రధాన భూభాగంపై లేని ఏకైక రాష్ట్రం; ఒక ద్వీపసమూహంగా ఉన్న ఏకైక రాష్ట్రం; కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ఏకైక రాష్ట్రం; ఫ్లోరిడాతో పాటు, తన పరిధిలో ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతాలను కలిగి ఉన్న కేవలం రెండు రాష్ట్రాలలో ఒకటి; టెక్సాస్‌తో పాటు, అమెరికా రాష్ట్రాలుగా మారకముందు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సార్వభౌమ దేశాలుగా వెలుగొందిన రెండు అమెరికా రాష్ట్రాలలో ఒకటి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ (జననం 2001 డిసెంబరు 28) భారత క్రికెట్ జట్టు తరపున ఆడే అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2023 వెస్టిండీస్ లో జరిగిన మొదటి టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, టెస్ట్ క్రికెట్ లో తన మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ఆయన దేశీయ క్రికెట్లో ముంబై తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడతాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సత్యశోధక్ సమాజ్ అనేది మహాత్మా జ్యోతిబా ఫూలే మహారాష్ట్రలోని పూణేలో, 1873 సెప్టెంబరు 24లో స్థాపించిన సాంఘిక సంస్కరణ సమాజము. అణగారిన వర్గాల వారికి, శూద్రులకు, దళితులకు, ముఖ్యంగా మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ఈ సమాజము యొక్క ముఖ్య ఉద్దేశం. జ్యోతీబా సతీమణి సావిత్రి బాయి మహిళా సమాజ విభాగానికి నాయకత్వం వహించేవారు.
జీ 2 2026లో విడుదలకానున్న తెలుగు భాష యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమా. 2018లో విడుదలైన స్పై యాక్షన్ సినిమా 'గూఢచారి'కి సీక్వెల్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించాడు.
మహమ్మద్ రజబ్ అలీ, (జనవరి 1 1920/ ఏప్రిల్ 10 1996) 1920 జనవరి 1న ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు. రజబ్ అలీ గారి తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద వీరికీ మొదటి సంతానం ఖాసిం బీ, మూడవ సంతానం మొయినుద్దిన్ కాగా, రెండవ సంతానం మహమ్మద్ రజబ్ అలీ గారు. మహమ్మద్ రజబ్ అలీ గారు వారి విద్యాభ్యాసం వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగింది.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
పింఛను, అంటే ఏవరైన వ్యక్తికి ప్రతి నెల కొంత సొమ్మును జీవన భృతిగా ఇవ్వడం. భారతదేశంలో పింఛన్ లేదా పింఛను పొందేవారు పలు రకాలుగా ఉన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలలో వారి రిటైర్ మెంట్ అనంతరం నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను అయితే, పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు లేదా అర్హులైన వారికి ప్రభుత్వం తరపున నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.
హోమియోపతీ (Homeopathy) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారతదేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా అది పొందుటలేదనుట అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపించవచ్చు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.