The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
ముకుల్ దలీప్ చౌదరి (జననం 6 ఆగస్టు 2004) భారతీయ క్రికెటర్, అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు. అతను దేశీయ క్రికెట్లో రాజస్థాన్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడతాడు. చౌదరి 2022–23 రంజీ ట్రోఫీలో జనవరి 17, 2023న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.2025–26 విజయ్ హజారే ట్రోఫీలో డిసెంబర్ 24, 2025న లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
డకోయిట్: ఎ లవ్ స్టోరీ 2026లో విడుదలకానున్న భారతీయ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18న విడుదల చేయగా, సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
వెనిజులా, దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలో కరేబియన్ సముద్రంలోని ఒక తీర దేశం. దీన్ని అధికారికంగా " వెనిజులా బోలివారియ గణతంత్రం " అంటారు. ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ , టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 km2 (353,841 sq mi) జనసంఖ్య 3,17,75,371.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
విసెంటే ఫెర్రర్ మోంచో ( 1920 ఏప్రిల్ 9 – 2009 జూన్ 19) ఒక జెస్యూట్ మిషనరీ, అతను దక్షిణ భారతదేశంలో స్థాపించిన మిషన్‌లో పేదల జీవితాలను మెరుగుపరచడానికి తన జీవితాన్ని గడిపాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో 2.5 మిలియన్ల మంది పేదలకు సహాయాన్ని అందజేస్తూ మానవతావాద ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఈయన స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.
మెరుపు దాడి భ్రమరాంబికా మూవీస్ పతాకంపై పి.యన్.రామచంద్రరావు దర్శకత్వంలో నటుడు గిరిబాబు 1984లో నిర్మించిన యాక్షన్/అడ్వెంచర్ హిట్ చిత్రం. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో నిర్మించబడిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రాజాగా హీరో సుమన్, గండడుగా హీరో గిరిబాబు, భానుగా హీరో భానుచందర్, శివంగిగా సుమలత, మాలాదేవిగా జయమాలిని, ప్రొఫెసర్ వర్మగా రంగనాధ్, మృతసంజీవరాయుడుగా గొల్లపూడి మారుతీరావు, బహదూర్ గా ప్రభాకర రెడ్డి, అంజిగా సారథి ప్రధాన పాత్రధారులుగా నటించారు.
బాయ్స్ హాస్టల్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో 'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో 'బాయ్స్ హాస్టల్' పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించిన ఈ సినిమాకు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్ట్ 19న విడుదల చేసి, సినిమాను ఆగస్ట్ 26న విడుదల చేశారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
అనుభవించు రాజా 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, కశిష్‌ఖాన్, అజయ్, పోసాని కృష్ణ మురళి, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు రామ్ చరణ్ 22 సెప్టెంబర్ 2021న విడుదల చేయగా, ట్రైలర్‌ను నవంబర్ 17న నటుడు నాగార్జున విడుదల చేయగా, సినిమాను నవంబర్ 26న విడుదల చేశారు.
బాలభారతము వీనస్ మహీజా పిక్చర్స్ బ్యానర్‌పై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో సి.హెచ్.ప్రకాశరావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ పౌరాణిక సినిమా 1972, డిసెంబర్ 7వ తేదీన విడుదల అయ్యింది. ఈ చిత్రంలో సామర్ల వెంకట రంగారావు, అంజలీదేవి,బేబీ శ్రీదేవి, హరనాథ్, ఎస్ వరలక్ష్మి,కాంతారావు మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.
కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గజపతినగరం శాసనసభా స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యపై 24,302 ఓట్ల మెజార్టీతో గెలిచారు. శ్రీనివాస్ వాణిజ్యవేత్తగా, సాఫ్ట్ వేర్ నిపుణుడిగా పనిచేసాడు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జీ 2 2026లో విడుదలకానున్న తెలుగు భాష యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమా. 2018లో విడుదలైన స్పై యాక్షన్ సినిమా 'గూఢచారి'కి సీక్వెల్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించాడు.
పొదరిల్లు (బుల్లితెర ధారావాహిక)
పొదరిల్లు 2025, డిసెంబర్ 1న స్టార్ మాలో ప్రారంభమైన ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారంచేయబడుంది.
చండ్ర రాజేశ్వరరావు (జూన్ 6, 1915 - ఏప్రిల్ 9, 1994) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న కమ్మ రైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో ఆనారోగ్యకారణాల వల్ల విరమించుకున్నాడు.
కొన్స్టన్టిన్ (థెయొఫిలొస్ కొడుకు)
కొన్స్టన్టీన్ (ఆంగ్లం:Constantine) లేదా కొన్స్టన్టినొస్ (గ్రీకు:Κωνσταντῖνος) అమొరియొన్ (Ἀμόριον) వంశపు శైశవ రాజకుమారుడు. సుమారుగా 820లు/830లులో పుట్టి, 836 ముందు వరకు బతికిన ఇతను బిజన్టియొన్ (Βυζάντιον) సామ్రాజ్య మహారాజు ఐన వాళ్ళ నాన్న థెయొఫిలొస్తో (Θεόφιλος) పాటు సహ చక్రవర్తిగా ఉన్నాడు. ఇతని జీవిత విశేషాలపై అంత స్పష్టత లేదు కానీ 820ల్లోనో, 830ల్లోనో పుట్టాడు అనీ, పుట్టిన వెంటనే సహ-చక్రవర్తిగా నియమితుడు అయ్యాడనీ తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన విద్యార్థి విభాగం. ఈ విభాగం ఇందిరా గాంధీ 1971 ఏప్రిల్ 9న కేరళ స్టూడెంట్స్ యూనియన్ & పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఛత్ర పరిషత్‌లను విలీనం చేసి ఎన్ఎస్యూఐ సంస్థను ఏర్పాటు చేశారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యుఐ) ఎఐసిసి ఇన్‌ఛార్జ్‌గా కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ 06 జూలై 2023న నియమించింది.
ఆయుష్ బదోని (జననం 3 డిసెంబర్ 1999) దేశీయ క్రికెట్లో ఢిల్లీ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడే భారతీయ క్రికెటర్. ఆయన 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరపున, 2021 జనవరి 11న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు. ఆయుష్ బదోని ఫిబ్రవరి 2022లో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.