The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
లవకుశ సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా, లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించగా, ఎన్.టి.రామారావు, అంజలీదేవి, మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, కాంతారావు, చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రధారులుగా 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు. సీతారాములు పట్టాభిషిక్తులు అయ్యాకా చాకలి తిప్పడు నిందవేశాడని రాజారాముడు గర్భవతియైన సీతాదేవిని అడవుల్లో వదలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణ గానం చేయడం, రామ అశ్వమేథయాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
యుఫోరియా 2026లో విడుదలైన సోషల్ డ్రామా సినిమా. శ్రీమతి రాగిణి గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 1న, ట్రైలర్‌ను 2026 జనవరి 17న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేశారు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
క్వామే కోఫి ఎన్క్రుమా (21 సెప్టెంబర్ 1909 – 27 ఏప్రిల్ 1972) ఘానాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సిద్ధాంతకర్త మరియు విప్లవకారుడు. ఆయన గోల్డ్ కోస్ట్‌కు 1952 నుండి 1957 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1957లో యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత, ఆయన ఘానా తొలి ప్రధానమంత్రి మరియు తరువాత అధ్యక్షుడిగా (1957–1966) కొనసాగారు.
శాశ్వత ఖాతా సంఖ్య (ఆంగ్లం: Permanent Account Number) ఇది పాన్ కార్డుగా అందరికి పరిచయం. PAN Card అనేది అక్షరాలు అంకెలు కలగలిసి ఉన్న యునిక్ సంఖ్యని భారత ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం గుర్తింపబడిన న్యాయబద్దమైన ఎంటిటీస్ కు జారీ చేయబడుతుంది. ఇది భారతీయ ఆదాయపు పన్ను విభాగం (ఇండియన్ ఇన్ కమ్ టాక్స్ డిపార్త్ మెంట్) జారీ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 - ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఇతను 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇతని మంత్రివర్గం లోనే కలసి మంత్రులుగా పనిచేశారు.
జయ జయహే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం.ఈ గీతాన్ని అందెశ్రీ రచన చేశాడు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన 'జయ జయహే తెలంగాణ' గీతం 9 చరణాలతో రాష్ట్ర గీతం ఉంటుంది. పూర్తి గీతాన్ని 13:30 నిమిషాల నిడివితో ఒకటి, రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2:30 నిమిషాల నిడివితో మరొక రాష్ట్ర గీతాన్ని అందె శ్రీ, ఎంఎం కీరవాణి రూపొందించారు.
తెన్నేటి కృష్ణప్రసాద్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాపట్ల నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత 18వ లోక్‌సభలో స్పీకర్ చైర్లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహించడంలో తనకు సహకరించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించిన చైర్పర్సన్ల ప్యానెల్లో తెన్నేటి కృష్ణప్రసాద్ నియమితుడయ్యాడు.
లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
మిస్టేక్ 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. ఎ.ఎస్.పి.మీడియా హౌస్ బ్యానర్‌పై అభినవ్ సర్దార్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించాడు. అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వర్, సుజిత్ కుమార్, తేజ్ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 25న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ఆగష్టు 4న విడుదల చేశారు.