The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
ఈస్టర్ డే అనేది క్రైస్తవ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి 22, ఏప్రిల్ 25 మధ్య వచ్చే వసంత విషువత్తు తరువాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత మొదటి ఆదివారం నాడు జరుపుకుంటారు. పవిత్ర బైబిల్ యేసుక్రీస్తు పునరుత్థానానికి దారితీసిన, అనుసరించే సంఘటనలను వివరిస్తుంది, విశ్వాసులకు గొప్ప, శక్తివంతమైన కథనాన్ని అందిస్తుంది.
సర్ఫరాజ్ నౌషాద్ ఖాన్ (జననం 22 అక్టోబర్ 1997) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశీయ క్రికెట్లో ముంబై తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సర్ఫరాజ్ 2014, 2016లో ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మిస్టేక్ 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. ఎ.ఎస్.పి.మీడియా హౌస్ బ్యానర్‌పై అభినవ్ సర్దార్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించాడు. అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వర్, సుజిత్ కుమార్, తేజ్ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 25న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ఆగష్టు 4న విడుదల చేశారు.
హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
ఆయ్ 2024లో విడుదలైన సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాకు అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించాడు. నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను జులై 23న విడుదల చేయగా, సినిమాను ఆగస్ట్ 15న విడుదలైంది.
క 2024లో విడుదలైన పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 15న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి, అక్టోబర్ 31న విడుదలైంది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 - ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఇతను 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇతని మంత్రివర్గం లోనే కలసి మంత్రులుగా పనిచేశారు.
బెంచ్ లైఫ్ 2024లో విడుదలైన భారతీయ తెలుగు భాషా నాటకం స్ట్రీమింగ్ టెలివిజన్ సిరీస్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నీహారిక కొణిదెల నిర్మించగా, మానస శర్మ రచించి దర్శకత్వం వహించాడు. వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్ , ఆకాంక్ష సింగ్ , రాజేంద్ర ప్రసాద్, నయన్ సారిక, వెంకటేష్ కాకుమాను & తనికెళ్ళ భరణి నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 12న సోనీలివ్ లో ప్రీమియర్ చేయబడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
నరోడోమ్ సిహానుక్ (31 అక్టోబర్ 1922 – 15 అక్టోబర్ 2012) కాంబోడియా దేశానికి రాజు, రాష్ట్రాధిపతి మరియు ప్రధానమంత్రి గా పనిచేశారు. ఆయనను సమ్డెచ్ యూవ్ (అర్థం: "రాజు తండ్రి") అని పిలుస్తారు. ఆయన జీవితకాలంలో కాంబోడియా అనేక రాజకీయ వ్యవస్థలను అనుభవించింది — ఫ్రెంచ్ పరిరక్షిత రాజ్యం (1953 వరకు), జపాన్ ఆధీన రాష్ట్రం (1945), స్వతంత్ర రాజ్యం (1953–1970), ఖ్మేర్ రిపబ్లిక్ (1970–1975), ఖ్మేర్ రూజ్ పాలన (1975–1979), వియత్నాం మద్దతు కమ్యూనిస్టు ప్రభుత్వం (1979–1989), మరియు చివరికి 1993 నుంచి మళ్లీ రాజ్యంగా మారింది.
యుఫోరియా 2026లో విడుదలైన సోషల్ డ్రామా సినిమా. శ్రీమతి రాగిణి గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 1న, ట్రైలర్‌ను 2026 జనవరి 17న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేశారు.
విష్ణు విన్యాసం 2026లో విడుదల అయిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. హేమ & షాలిని జి సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిరించిన ఈ సినిమాకు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించాడు. శ్రీ విష్ణు, నయన్ సారిక, సత్య, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 18న, ట్రైలర్‌ను ఫిబ్రవరి న విడుదల చేసి సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేశారు.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
గం గం గణేశా 2024లో విడుదలైన తెలుగు సినిమా.హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాత్సవ, వెన్నెల కిశోర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 సెప్టెంబర్ 15న, ట్రైలర్‌ను మే 20న విడుదల చేసి సినిమాను మే 31న విడుదల చేశారు. ఈ సినిమా 2024 జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.