The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో 2026 ఏప్రిల్ 23 నుండి 29 వరకు నిర్వహించబడనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు 4 మే 2026న జరగనుంది మరియు అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి.
నాదెండ్ల భాస్కరరావు (1935 జూన్ 23 - 2026 ఏప్రిల్ 22) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1984 ఆగస్టు 16 నుండి 1984 సెప్టెంబరు 16వ తేది వరకు ఒక నెలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గలలో పలు మంత్రిత్వ శాఖల మంత్రిగా పని చేశాడు.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్‌లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్‌పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)
పంచాయితీ గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ. దీనినే స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థని, భారతదేశంలో పంచాయతీ రాజ్ అని అంటారు. నేపాల్‌లో కూడా ఇలాంటి పంచాయితీ వ్యవస్థ నడుస్తుంది.
మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29, 1958 - జూన్ 25, 2009) అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ "థ్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
1980 జూలై 3 న పంజాబ్ లోని జలంధర్‌లో జన్మించిన హర్భజన్ సింగ్ (Harbhajan Singh) (Punjabi: ਹਰਭਜਨ ਸਿੰਘ) భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.1998లో టెస్ట్, వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న హర్భజన్ సింగ్ 2001లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫి జట్టులో పిల్ల్వబడ్డాడు.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఏప్రిల్ (April), గ్రెగోరియన్, జులియన్ కేలెండర్ ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో నాలుగవ నెలగా ఉంది.ఈ నెలకు 30 రోజులు ఉన్నాయి.ఈ పదం లాటిన్ భాష నుండి ఉద్భవించింది.ఏప్రియల్ పేరు గ్రీకు దేవత అనే ఆఫ్రొడైట్ (ఆఫ్రోస్) పేరు మీద పెట్టబడిందని కొంత మంది నమ్మకం. ఏప్రియల్, చెట్లు చిగిర్చి, పూలు పూసే వసంత ఋతువులో ఒక భాగంగా ఉంది.
శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 - మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.
లియాటి జోసెఫ్ అనోయి (Samoan pronunciation: [a.noˈaʔ.i]; జననం మే 25, 1985), తన రింగ్ పేరు రోమన్ రెయిన్స్ గా ప్రసిద్ధి చెందిన, ఒక అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు, మరియు మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ప్రస్తుతం ఆయన WWE సంస్థలో 2010 నుండి పనిచేస్తూ, రా బ్రాండ్‌లో ప్రదర్శనలు ఇస్తున్నారు మరియు ప్రస్తుతం ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ గా తన మొదటి టైటిల్ పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రొఫెషనల్ రెజ్లర్లలో ఒకరిగా భావించబడుతున్న రెయిన్స్, ఆయన 1,316 రోజుల పాటు WWE యూనివర్సల్ ఛాంపియన్ గా కొనసాగడం ద్వారా ఆ టైటిల్ చరిత్రలోనే అత్యంత దీర్ఘకాల పరిపాలనను సాధించారు.
భూత్ బంగ్లా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 2026 భారతీయ హిందీ భాషా హాస్య భయానక చిత్రం, బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం చేయగా, పరేష్ రావల్, జిష్షూసేన్ గుప్తా, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బీ (ద్విపాత్రాభినయం) మొదలైనవారు నటించారు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, మనోజ్ జోషి నటించిన భూల్ భులయ్యా (2007) తర్వాత ప్రియదర్శన్ రూపొందించిన రెండవ హిందీ భాషా భయానక హాస్య చిత్రం ఇది.
రాజ్‌పుత్ చిత్రకళ (ఆంగ్లం: Rajput painting) 16వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు భారతదేశానికి కు చెందిన స్వతంత్ర హిందూ సామంత రాజ్యాలలో విలసిల్లిన చిత్రకళ. మొఘల్ చిత్రకళ ఆ కాలానికి సమకాలీనం అయితే, రాజ్‌పుత్ చిత్రకళ మాత్రం సాంప్రదాయికం మరియు రసాత్మకం. ఇందులో పలు విభాగాలు ఉన్నవి: రాజస్థానీ చిత్రకళ (పశ్చిమ భారత చిత్రకళ), మధ్య భారత చిత్రకళ మరియు పహారీ చిత్రకళ.
ముఖేష్ చౌదరి (జననం జూలై 6, 1996) భారతదేశానికి చెందిన క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ముఖేష్ చౌదరి 2017–18 రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున తన ఫస్ట్-క్లాస్ నవంబర్ 9, 2017న, 2019 అక్టోబర్ 7న లిస్ట్ ఏ అరంగేట్రం చేసి, 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరపున ఆడాడు.
దేవదత్ పాడిక్కల్ (జననం 7 జూలై 2000) భారత క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఆయన భారత అండర్-19 జట్టు తరపున ఆడి, జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ ద్వారా భారత జట్టుతో అరంగేట్రం చేశాడు.
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. 2013 నవంబరు 16 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది.
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల నుండి ప్రతినిధులను ఎన్నుకోవడానికి 2021 ఏప్రిల్ 6న పదహారవ తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) దశాబ్దాల పాలనకు ముగింపు పలికి ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) విజయం సాధించింది. డిఎంకె నాయకుడు ఎంకె స్టాలిన్ తమిళనాడు ఎనిమిదవ ముఖ్యమంత్రి అయ్యాడు.
పెళ్ళి చేసి చూడు (1988 సినిమా)
డ్పెళ్ళిచేసి చూడు 1988 లో విడుదలైన తెలుగు సినిమా. కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి. కౌసల్య నిర్మించింది రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు. 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ప్రభుత్వం
గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు.ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం.
ట్రూ లవర్ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల జాబితా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉప జాతీయ అధికార కార్యనిర్వాహక శాఖకు అధిపతి. మంత్రుల మండలికి ముఖ్యమంత్రి అధిపతి. ముఖ్యమంత్రికి మంత్రివర్గంలో మంత్రులను గవర్నరు ద్వారా నియమించే అధికారం ఉంది.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
ఎం.కెగా, డా.కళైజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K (జూన్ 3, 1924 - ఆగష్టు 7, 2018) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి తాను మరణించేవరకు, తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011).