The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో 2026 ఏప్రిల్ 23 నుండి 29 వరకు నిర్వహించబడనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు 4 మే 2026న జరగనుంది మరియు అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
నాదెండ్ల భాస్కరరావు (1935 జూన్ 23 - 2026 ఏప్రిల్ 22) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1984 ఆగస్టు 16 నుండి 1984 సెప్టెంబరు 16వ తేది వరకు ఒక నెలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గలలో పలు మంత్రిత్వ శాఖల మంత్రిగా పని చేశాడు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29, 1958 - జూన్ 25, 2009) అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ "థ్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు.
ట్రూ లవర్ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.
భూత్ బంగ్లా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 2026 భారతీయ హిందీ భాషా హాస్య భయానక చిత్రం, బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం చేయగా, పరేష్ రావల్, జిష్షూసేన్ గుప్తా, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బీ (ద్విపాత్రాభినయం) మొదలైనవారు నటించారు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, మనోజ్ జోషి నటించిన భూల్ భులయ్యా (2007) తర్వాత ప్రియదర్శన్ రూపొందించిన రెండవ హిందీ భాషా భయానక హాస్య చిత్రం ఇది.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అసాంటే సామ్రాజ్యం ( Asante Twi: Asanteman), దీనిని అశాంతి సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు, ఇది ఒక అకాన్ రాజ్యం. ఇది 1701 నుండి 1901 వరకు, ప్రస్తుతం ఘనాగా పిలువబడే ప్రాంతంలో కొనసాగింది. ఇది అశాంతి ప్రాంతం నుండి విస్తరించి, ఘనాలోని అధిక భాగాన్ని, అలాగే ఐవరీ కోస్ట్, టోగోలోని కొన్ని భాగాలను కూడా తన పరిధిలోకి తెచ్చుకుంది.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
1980 జూలై 3 న పంజాబ్ లోని జలంధర్‌లో జన్మించిన హర్భజన్ సింగ్ (Harbhajan Singh) (Punjabi: ਹਰਭਜਨ ਸਿੰਘ) భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.1998లో టెస్ట్, వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న హర్భజన్ సింగ్ 2001లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫి జట్టులో పిల్ల్వబడ్డాడు.
సీవీ ఆనంద్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి & మాజీ క్రికెట్ క్రీడాకారుడు. సీవీ ఆనంద్ 2021 డిసెంబరు 24 నుండి 2023 అక్టోబరు 12 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించాడు. ఆయన 2017లో అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి అందుకున్నాడు.
పాట్రిక్ జేమ్స్ కమిన్స్ (ఆంగ్లం: Pat Cummins; జననం 1993 మే 8) ఒక ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటర్, అతను టెస్ట్ ఇంకా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అతను ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. 2023 జనవరి నాటికి, కమిన్స్ ICC టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
లుంగిసానీ ట్రూ-మ్యాన్ ఎన్గిడి (జననం 1996 మార్చి 29) దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ప్రొఫెషనల్ క్రికెటరు. 2018 దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డులలో, అతను ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. 2020 జూలైలో, క్రికెట్ దక్షిణాఫ్రికా వార్షిక అవార్డుల వేడుకలో ఎన్గిడి వన్డేలకు, T20I లకూ కూడా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ (1874 ఏప్రిల్ 25 - 1937 జూలై 20) ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థ పితామహుడుగా గుర్తింపు పొందాడు. అతను రేడియో యొక్క ఆవిష్కర్త 1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నాడు.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)
వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం, రాజన్న జిల్లా లోని ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 162 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
మ్యాడ్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.