The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో 2026 ఏప్రిల్ 23 నుండి 29 వరకు నిర్వహించబడనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు 4 మే 2026న జరగనుంది మరియు అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి.
ట్రూ లవర్ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.
లుంగిసానీ ట్రూ-మ్యాన్ ఎన్గిడి (జననం 1996 మార్చి 29) దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ప్రొఫెషనల్ క్రికెటరు. 2018 దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డులలో, అతను ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. 2020 జూలైలో, క్రికెట్ దక్షిణాఫ్రికా వార్షిక అవార్డుల వేడుకలో ఎన్గిడి వన్డేలకు, T20I లకూ కూడా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
విశ్వామిత్రుడు హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. గాయత్రీ మంత్ర సృష్టి కర్తగా, శ్రీరామునకు గురువుగా, హరిశ్చంద్రుని పరీక్షించినవానిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవానిగా, శకుంతలకు తండ్రి అందువలన భరతునకు తాతగా గుర్తిస్తారు.
మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29, 1958 - జూన్ 25, 2009) అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ "థ్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
నాదెండ్ల భాస్కరరావు (1935 జూన్ 23 - 2026 ఏప్రిల్ 22) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1984 ఆగస్టు 16 నుండి 1984 సెప్టెంబరు 16వ తేది వరకు ఒక నెలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గలలో పలు మంత్రిత్వ శాఖల మంత్రిగా పని చేశాడు.
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
తారాస్ హ్రిహొరోవిచ్ షెవ్చెంకో (Ukrainian: Тарас Григорович Шевченко; Ukrainian pronunciation: [tɐˈraz‿ɦrɪˈɦɔrowɪt͡ʃ ʃeu̯t͡ʃɛnko]; Russian: Тарас Григорьевич Шевченко, romanized: Taras Grigoryevich Shevchenko; 9 మార్చి 1814 – 10 మార్చి 1861) ఒక ఉక్రేనియన్ కవి, రచయిత, కళాకారుడు, ప్రజా మరియు రాజకీయ నాయకుడు, జానపద శాస్త్రవేత్త మరియు జనజాతి శాస్త్రవేత్త. ఆయన ఉక్రేనియన్ భాషలో కవిత్వం రచించారు మరియు రష్యన్ భాషలో గద్య రచనలు (తొమ్మిది నవలలు, ఒక డైరీ, మరియు తన ఆత్మకథ) చేశారు. షెవ్చెంకో ఉక్రెయిన్‌పై రష్యా పరిపాలన ఉన్న కాలంలో, ఒక పేద సర్ఫ్ కుటుంబంలో జన్మించాడు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
మ్యాడ్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.
నారీ నారీ నడుమ మురారి (2026 సినిమా)
నారీ నారీ నడుమ మురారి 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిరించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 22న విడుదల చేశారు.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుండి వేరుపడి యేర్పడింది, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలలోని నగరాలకు, పట్టణాలకు ఈ సంస్థ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
భూత్ బంగ్లా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 2026 భారతీయ హిందీ భాషా హాస్య భయానక చిత్రం, బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం చేయగా, పరేష్ రావల్, జిష్షూసేన్ గుప్తా, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బీ (ద్విపాత్రాభినయం) మొదలైనవారు నటించారు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, మనోజ్ జోషి నటించిన భూల్ భులయ్యా (2007) తర్వాత ప్రియదర్శన్ రూపొందించిన రెండవ హిందీ భాషా భయానక హాస్య చిత్రం ఇది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్‌లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్‌పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
కొలెస్టరాల్ లేదా కొలెస్టరోల్ (ఆంగ్లం Cholesterol) అనేది మన శరీరాలలో ఉండే ఒక రకం కావరం (lipid) లేదా ఒక రకం కొవ్వు (fat) పదార్థం. శాస్త్రీయ భాష మాట్లాడేటప్పుడు కొవ్వు (fat) కీ కావరం (lipid) కీ అర్ధంలో రవ్వంత తేడా ఉంది; కాని సాధారణంగా ప్రజలు ఈ తేడాని గుర్తించరు. ఇంగ్లీషులో ఈ cholesterol మాట చివర '-ol' శబ్దం గమనార్హం.
రైటర్ పద్మభూషణ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. సుహాస్, టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 03న విడుదలైంది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
భారత్ రాష్ట్ర సమితి (ఆంగ్లం: Bharat Rashtra Samithi), అనేది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం 2001లో ఏర్పాటుచేయబడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు 2022 అక్టోబరు 5న భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడింది. 2022 డిసెంబరు 9న తెలంగాణ భవన్లో జరిగిన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్, పార్టీ జెండాను ఆవిష్కరించాడు.
ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా ఆడజన్మ (1970 సినిమా) ఆడజన్మ అన్న సినిమా జి.ఆర్.రావు దర్శకత్వంలో సిహెచ్.నారాయణరావు, బి.సరోజ ప్రధాన పాత్రధారులుగా నటించిన 1951 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాను మోడరన్ థియేటర్స్ పతాకంపై మాడరన్ థియేటర్స్ లిమిటెడ్ వారు నిర్మించారు. దీనికి తోలేటి రచన చేయగా, ఎస్.దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు.