The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
విదుతలై చిరుతైగల్ కట్చి (దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా, దళిత్ పాంథర్స్ ఇయ్యక్కం, దళిత పాంథర్స్ ఉద్యమం) అనేది తమిళనాడు రాష్ట్రంలో క్రియాశీలంగా ఉన్న కుల ఆధారిత వివక్షను ఎదుర్కోవడానికి ప్రయత్నించే భారతీయ సామాజిక ఉద్యమం, రాజకీయ పార్టీ. పార్టీ తమిళ జాతీయవాదానికి కూడా బలమైన ప్రాధాన్యతనిస్తుంది. చెన్నైకి చెందిన న్యాయవాది థోల్ తిరుమవల్వన్ దీని ఛైర్మన్ కాగా, రచయిత రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు ఒక రాష్ట్ర న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమిళనాడు శాసనసభకు ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఎం.కెగా, డా.కళైజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K (జూన్ 3, 1924 - ఆగష్టు 7, 2018) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి తాను మరణించేవరకు, తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011).
17వ తమిళనాడు శాసనసభలోని మొత్తం 234 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2026 ఏప్రిల్ 23న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 2026 మే 4న భారత ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.1% పోలింగ్ నమోదైంది.
రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, (జననం:1954 ఏప్రిల్ 23) ఒక భారతీయ రాజనీతిజ్ఞుడు, అతను ప్రస్తుత బీహార్ 29వ గవర్నరుగా 2023 ఫిబ్రవరి 14 నుండి అధికారంలో ఉన్నారు. అతను గతంలో హిమాచల్ ప్రదేశ్ 21వ గవర్నర్‌గా పనిచేశాడు, గోవా నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన మొదటి వ్యక్తి. అతను గోవా ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసాడు.
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు. 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.
తోల్కప్పియన్ తిరుమావళవన్ ( థోల్. తిరుమావళవన్, 1962 ఆగస్టు 17న జన్మించారు), తమిళనాడు రాజకీయ నాయకుడు . అతను లిబరేషన్ టైగర్స్ పార్టీ నాయకుడు, అణగారిన ప్రజల పురోగతి కోసం చట్టం, సమాజం, రాజకీయాలు వంటి అనేక రంగాలలో తనను తాను పాలుపంచుకోవడం ద్వారా తమిళనాడులోని సంపవార్ (పరైయర్) ప్రజల ప్రముఖ నాయకులలో ఒకరిగా పనిచేస్తున్నారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
డకోయిట్: ఎ లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన భారతీయ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18, 2025న విడుదల చేయగా, సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
కంజీవరం నటరాజన్ అన్నాదురై (15 సెప్టెంబరు 1909 – 3 ఫిబ్రవరి 1969) తమిళనాడు రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు. ఇతడు 1967-1969ల మధ్యకాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రపు 5వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను, తమిళనాడులోను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో ద్రావిడ పార్టీకి చెందిన తొలి వ్యక్తి.
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
ఆల్ ఇండియా అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళనాడు రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒక భారతీయ రాజకీయ పార్టీ. ఇది ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నుండి విడిపోయి 1972 అక్టోబరు 17 న ఎం. జి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల జాబితా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉప జాతీయ అధికార కార్యనిర్వాహక శాఖకు అధిపతి. మంత్రుల మండలికి ముఖ్యమంత్రి అధిపతి. ముఖ్యమంత్రికి మంత్రివర్గంలో మంత్రులను గవర్నరు ద్వారా నియమించే అధికారం ఉంది.
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుంది. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్ హంట్ జయంతి రోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు. వివిధ సమస్యలతో భాదపడుతున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
కనిమొళి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గం నుండి గెలిచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. కనిమొళి రాజకీయాల్లోకి రాకముందు ది హిందూ సబ్ ఎడిటర్, కుంగుమం అనే తమిళ వార పత్రికకు ఇన్ ఛార్జి ఎడిటర్‌గా, సింగపూర్ కేంద్రంగా పని చేసే తమిళ పత్రిక తమిళ్ మురసుకు సంపాదకురాలిగా పని చేసింది.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
రాబర్ట్ ఎడ్వర్డ్ టర్నర్ III (నవంబర్ 19, 1938 – మే 6, 2026) ఒక అమెరికన్ వ్యాపారవేత్త, టెలివిజన్ నిర్మాత, మీడియా అధిపతి మరియు దాత. ఆయన సీఎన్ఎన్ ను స్థాపించారు, ఇది ప్రపంచంలో మొదటి 24 గంటల కేబుల్ వార్తా ఛానల్. అదనంగా, ఆయన డబ్ల్యూటీబీఎస్ ను స్థాపించారు, ఇది కేబుల్ టెలివిజన్‌లో సూపర్స్టేషన్ భావనకు పునాది వేసింది.
అభిషేక్ బెనర్జీ (రాజకీయ నాయకుడు)
అభిషేక్ బెనర్జీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా, డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తృణమూల్ స్టూడెంట్ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
అర్షిన్ కులకర్ణి భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో మహారాష్ట్ర తరపున ఆడుతున్నాడు, ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. అర్షిన్ కులకర్ణి 2023లో భారత్ అండర్-19 ఆసియాకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి బ్యాటింగ్‌లో 70 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
వినాయక్ శుక్లా (జననం 1994 జూన్ 18) భారతదేశంలో జన్మించిన క్రికెటరు. అతను ఒమన్ జాతీయ క్రికెట్ జట్టు తరపున కుడిచేతి వాటం వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు 2026 జనవరి నాటికి జట్టుకు వైస్ కెప్టెన్‌గా పనిచేస్తున్నాడు. అతను 2024 పురుషుల గల్ఫ్ T20I ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఒమన్ జాతీయ జట్టు తరపున రంగప్రవేశం చేశాడు.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
భారత రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర స్థాయిలో భారత రాష్ట్రపతికి సమానమైన అధికారాలు, విధులు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నర్లు ఉండగా, లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీతో సహా కేంద్ర భూభాగాల్లో ఉన్నారు . గవర్నర్ నామమాత్రపు అధిపతిగా వ్యవహరిస్తారు, అయితే నిజమైన అధికారం రాష్ట్రాలలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వారి మంత్రిమండలిపై, కేంద్ర పాలితప్రాంతాల్లో, లెఫ్టినెంట్ గవర్నర్ లేదా నిర్వాహకుడి (Administrator) వద్ద ఉంది.
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, English: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); Bengali: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ.