The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
విదుతలై చిరుతైగల్ కట్చి (దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా, దళిత్ పాంథర్స్ ఇయ్యక్కం, దళిత పాంథర్స్ ఉద్యమం) అనేది తమిళనాడు రాష్ట్రంలో క్రియాశీలంగా ఉన్న కుల ఆధారిత వివక్షను ఎదుర్కోవడానికి ప్రయత్నించే భారతీయ సామాజిక ఉద్యమం, రాజకీయ పార్టీ. పార్టీ తమిళ జాతీయవాదానికి కూడా బలమైన ప్రాధాన్యతనిస్తుంది. చెన్నైకి చెందిన న్యాయవాది థోల్ తిరుమవల్వన్ దీని ఛైర్మన్ కాగా, రచయిత రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.
టిప్పూ సుల్తాన్ (పూర్తి పేరు సుల్తాన్ ఫతే అలి టిప్పు - మైసూరు పులిగా ప్రశిద్ది గాంచినవాడు. ఇతడి జీవిత కాలం (1750 నవంబరు 20, దేవనహళ్ళి – 1799 మే 4, శ్రీరంగపట్నం), హైదర్ అలీ అతని రెండవ భార్య ఫాతిమా(ఫక్రున్నీసా)ల ప్రథమ సంతానం. టిప్పుకి మంచి కవిగా పేరు వుండేది ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొట్టమొదటి చర్చి నిర్మించాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు ఒక రాష్ట్ర న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమిళనాడు శాసనసభకు ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు. 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.
తోల్కప్పియన్ తిరుమావళవన్ ( థోల్. తిరుమావళవన్, 1962 ఆగస్టు 17న జన్మించారు), తమిళనాడు రాజకీయ నాయకుడు . అతను లిబరేషన్ టైగర్స్ పార్టీ నాయకుడు, అణగారిన ప్రజల పురోగతి కోసం చట్టం, సమాజం, రాజకీయాలు వంటి అనేక రంగాలలో తనను తాను పాలుపంచుకోవడం ద్వారా తమిళనాడులోని సంపవార్ (పరైయర్) ప్రజల ప్రముఖ నాయకులలో ఒకరిగా పనిచేస్తున్నారు.
ఎం.కెగా, డా.కళైజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K (జూన్ 3, 1924 - ఆగష్టు 7, 2018) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి తాను మరణించేవరకు, తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011).
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
డకోయిట్: ఎ లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన భారతీయ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18, 2025న విడుదల చేయగా, సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల జాబితా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉప జాతీయ అధికార కార్యనిర్వాహక శాఖకు అధిపతి. మంత్రుల మండలికి ముఖ్యమంత్రి అధిపతి. ముఖ్యమంత్రికి మంత్రివర్గంలో మంత్రులను గవర్నరు ద్వారా నియమించే అధికారం ఉంది.
17వ తమిళనాడు శాసనసభలోని మొత్తం 234 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2026 ఏప్రిల్ 23న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 2026 మే 4న భారత ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.1% పోలింగ్ నమోదైంది.
హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
జాతీయ పింఛను పథకం (ఆంగ్లం: National Pension System) 2004 తరువాత చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంప్రదాయ పించను పద్ధతిని రద్దు చేసి కొత్త పించను పతాకాన్ని ప్రవేశ పెట్టారు. అదే జాతీయ పించను విధానము / నేషనల్ పెన్షన్ సిస్టం. తరువాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టం లేదా ఎన్.పి.ఎస్ ను తప్పనిసరి చేశాయి.
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, English: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); Bengali: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.
కంజీవరం నటరాజన్ అన్నాదురై (15 సెప్టెంబరు 1909 – 3 ఫిబ్రవరి 1969) తమిళనాడు రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు. ఇతడు 1967-1969ల మధ్యకాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రపు 5వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను, తమిళనాడులోను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో ద్రావిడ పార్టీకి చెందిన తొలి వ్యక్తి.
సతీ లీలావతి 2026లో విడుదలకానున్న వినోదాత్మక సినిమా. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగమోహన్ బాబు ఎం, రాజేష్.టి నిర్మించిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, నరేష్, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 జులై 29న, ట్రైలర్‌ను ఫిబ్రవరి న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేయనున్నారు.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
శ్యాంప్రసాద్ ముఖర్జీ, (1901, జూలై 6) ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు.
పోక్సో చట్టం (POCSO Act) అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offenses Act, 2011) ని 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012గా 2012 నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
బండారు సత్యనారాయణ మూర్తి అయ్యప్ప (జననం 1992, అక్టోబరు 27) ఆంధ్ర ప్రదేశ్ తరపున ఆడిన ఒక భారతీయ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. 2018, జూలైలో, అతను 2018–19 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా బ్లూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2018, డిసెంబరులో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేసింది.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్‌లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్‌పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
తెలుగు వికీపీడియా (తెవికీ) ఒక ఆన్లైన్ విజ్ఞానసర్వస్వం. 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు భాషా వికీపీడియాలో ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని లిఖిత ఆధారాలతో ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. అమెరికాలో ఉన్న వికీమీడియా ఫౌండేషను అనే స్వచ్ఛంద సంస్థ పలు భాషలలో నెలకొల్పిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాలలో ఇది ఒకటి.