The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మనోజ్ కుమార్ భారతిరాజ ( 1976 సెప్టెంబరు 11- 2025 మార్చి 25) తమిళ సినిమా నటుడు దర్శకుడు. ఆయన ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు. మనోజ్ 1999లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు మనోజ్ భారతి రాజా నటించిన సినిమాలలో సముద్రం (2001), కడల్ పూక్కల్ (2001) అల్లీ అర్జున (2002), వరుశమెల్లం వసంతం (2002) ఈరా నీలం (2003), అన్నకోడి (2013), బేబీ (2015), మానాడు (2021), విరుమన్ (2022) సినిమాలు ఆయనకు మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి.
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. భార్గవ్ ఆర్ట్స్ పతాకం మీద కొన్ని చిత్రాలు (మనిషికో చరిత్ర, చిలిపిమొగుడు, ముక్కుపుడక) నిర్మించిన ఎస్.గోపాలరెడ్డి, తమిళంలో విజయవంతమైన భారతీరాజా చిత్రం 'మణ్ వాసనై' (మట్టి వాసన) ను తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు. తాతమ్మ కల (బాలనటునిగా బాలకృష్ణ తొలిచిత్రం) కాంబినేషన్ గుర్తు చేస్తూ భానుమతి, బాలకృష్ణ తాతమ్మగా ఈ చిత్రంలో నటించారు.
భూత్ బంగ్లా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 2026 భారతీయ హిందీ భాషా హాస్య భయానక చిత్రం, బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం చేయగా, పరేష్ రావల్, జిష్షూసేన్ గుప్తా, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బీ (ద్విపాత్రాభినయం) మొదలైనవారు నటించారు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, మనోజ్ జోషి నటించిన భూల్ భులయ్యా (2007) తర్వాత ప్రియదర్శన్ రూపొందించిన రెండవ హిందీ భాషా భయానక హాస్య చిత్రం ఇది.
జమదగ్ని 1988 జూలై 16న విడుదలైన భారతీయ తెలుగు-భాష యాక్షన్ చిత్రం, ఘట్టమనేని కృష్ణ, కైకాల సత్యనారాయణలు ఒక జిత్తులమారి రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా పోరాడే పాత్రికేయుని పాత్రలలో నటించారు. రాధ కథానాయికగా నటించగా, సుమలత, చారు హాసన్, గొల్లపూడి మారుతీరావు, కాకినాడ శ్యామల ఇతర సహాయక పాత్రలు పోషించారు. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.
సార్ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజర్‌ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
చింతలపాటి శ్రీనివాస రాజు ఒక భారతీయ పారిశ్రామికవేత్త పెట్టుబడిదారు . చింతలపాటి శ్రీనివాసరాజు సత్యం కంప్యూటర్స్ ఐ లాబ్స్ టీవీ9 లాంటి సంస్థలను స్థాపించాడు. చింతలపాటి శ్రీనివాసరాజు టీవీ9 - తెలుగు మీడియా గ్రూప్ ను తిరుపతిలో శ్రీ సిటీని కూడా స్థాపించారు, శ్రీ సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి "ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీ".
భూమిలో ముడి చమురు నిక్షేపాలు భూమిమీద, నీటిలో జీవించే ఆల్గే (నాచు), ప్లాంక్టన్ (పూలు పూయని నీటి మొక్కలు) చనిపోవడం ద్వారా తయారవుతోంది. ఆల్గే, ప్లాంక్టన్ చనిపోయిన తరువాత ఇవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురవుతాయి. ఇలా కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాల పాటు భూమి లోపలి పొరలలో జరిగే మార్పులకు లోనై హైడ్రోకార్బన్స్ (ముడి చమురు అణువులు) గా రూపాంతరం చెందుతాయి.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup), లేదా క్లుప్తంగా ప్రపంచ కప్, అని పేరొందిన ఫుట్‌బాల్ పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చు. ఈ పోటీలో ఫుట్‌బాల్ ఆటలో వాసికెక్కిన జాతీయ జట్లు, తమ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆటలపోటీలు 1930 లో మొదలయ్యి, నాలుగేళ్ళకోసారి (1942,46 లో ద్వితీయ ప్రపంచ యుద్ధం మూలాన తప్ప) కొనసాగుతూ వస్తున్నాయి.
శ్రీజ ఆకుల' ప్రఖ్యాత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, ఈమె 2022 ఏప్రిల్ లో జరిగిన 83వ సీనియర్ జాతీయ, అంతర్రాష్ట్రీయ టేబుల్ టెన్నిస్ పోటీలలో మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్ లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో ఆచంట శరత్ కమల్ తో మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాన్ని సాధించింది. శ్రీజ ఆకుల 2024లో భారత నెం.1 భారతీయ మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ (ఆంగ్లం: Lionel Messi), 1987 జూన్ 24లో జన్మించారు అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు, ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు, ఒక రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం.