The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మనోజ్ కుమార్ భారతిరాజ ( 1976 సెప్టెంబరు 11- 2025 మార్చి 25) తమిళ సినిమా నటుడు దర్శకుడు. ఆయన ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు. మనోజ్ 1999లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు మనోజ్ భారతి రాజా నటించిన సినిమాలలో సముద్రం (2001), కడల్ పూక్కల్ (2001) అల్లీ అర్జున (2002), వరుశమెల్లం వసంతం (2002) ఈరా నీలం (2003), అన్నకోడి (2013), బేబీ (2015), మానాడు (2021), విరుమన్ (2022) సినిమాలు ఆయనకు మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
జమదగ్ని 1988 జూలై 16న విడుదలైన భారతీయ తెలుగు-భాష యాక్షన్ చిత్రం, ఘట్టమనేని కృష్ణ, కైకాల సత్యనారాయణలు ఒక జిత్తులమారి రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా పోరాడే పాత్రికేయుని పాత్రలలో నటించారు. రాధ కథానాయికగా నటించగా, సుమలత, చారు హాసన్, గొల్లపూడి మారుతీరావు, కాకినాడ శ్యామల ఇతర సహాయక పాత్రలు పోషించారు. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు.
సార్ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజర్‌ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.
త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం' లేదా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం అని పిలువబడే త్రిపుర ప్రభుత్వం, త్రిపుర దాని 8 జిల్లాలకు అత్యున్నత పాలక అధికారం సాగించే సంస్థ. ఇందులో త్రిపుర గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసనశాఖ ఉంటాయి. భారతదేశం లోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, త్రిపుర రాష్ట్ర అధిపతి గవర్నరు, కేంద్రప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తాడు.
ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. భార్గవ్ ఆర్ట్స్ పతాకం మీద కొన్ని చిత్రాలు (మనిషికో చరిత్ర, చిలిపిమొగుడు, ముక్కుపుడక) నిర్మించిన ఎస్.గోపాలరెడ్డి, తమిళంలో విజయవంతమైన భారతీరాజా చిత్రం 'మణ్ వాసనై' (మట్టి వాసన) ను తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు. తాతమ్మ కల (బాలనటునిగా బాలకృష్ణ తొలిచిత్రం) కాంబినేషన్ గుర్తు చేస్తూ భానుమతి, బాలకృష్ణ తాతమ్మగా ఈ చిత్రంలో నటించారు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నారమల్లి శివప్రసాద్ (జూలై 11, 1951 - సెప్టెంబరు 20, 2019) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు.ఈయన నారా చంద్రబాబు నాయుడు గారికి బాల్య స్నేహితుడు కూడా. తిరుపతిలో డాక్టర్‌గా పనిచేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
రామ్ ప్రసాద్ బిస్మిల్ (1897 జూన్ 11 -1927 డిసెంబరు 19) ఇతను భారతీయ విప్లవకారుడు. ఇతను 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర వంటివాటిలో పాల్గొని బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాడు. స్వాతంత్ర్య సమరయోధుడు కావడంతో పాటుగా రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలంపేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాసిన కవి.
భారత ప్రధాన మంత్రి, భారత ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడుగా, కేంద్రమంత్రుల మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ, నామమాత్ర, ఉత్సవ సంబంధమైన దేశాధినేత అయినప్పటికీ, ఆచరణలో సాధారణంగా, కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి, వారు ఎన్నుకున్న మంత్రుల మండలికే ఉంటుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన శాసనమండలి అయిన లోక్‌సభ, భారత పార్లమెంటు దిగువసభలో మెజారిటీతో పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
తెలుగు వికీపీడియా (తెవికీ) ఒక ఆన్లైన్ విజ్ఞానసర్వస్వం. 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు భాషా వికీపీడియాలో ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని లిఖిత ఆధారాలతో ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. అమెరికాలో ఉన్న వికీమీడియా ఫౌండేషను అనే స్వచ్ఛంద సంస్థ పలు భాషలలో నెలకొల్పిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాలలో ఇది ఒకటి.