The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
పీర్ల పండుగ అనేది కర్బలా యుద్ధాన్ని స్మరించుకునే ఉత్సవంగా, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలచే జరుపబడే సంతాప పర్వదినం. ఈ పండుగ అషుర్ఖానాలుగా పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాల్లో సంతాప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతుంది. మొహర్రం సందర్భంలో, ఆలంలు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ పండుగలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది.ఊరేగింపులో విభిన్న కుటుంబాలు, వ్యక్తులు విరాళంగా ఇచ్చిన అనేక ఆలంలు భాగస్వామ్యం అవుతాయి.ఉదాహరణకు, తెలంగాణలోని నరసర్లపల్లె వంటి కొన్ని గ్రామాల్లో, ఒకే కుటుంబం తరతరాలుగా ఆలంలను విరాళంగా అందిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
పద్మశ్రీ భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం.పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం భారతరత్న, రెండవది పద్మ విభూషణ్ మూడవది పద్మ భూషణ్, నాలుగవది పద్మశ్రీ.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2026
పద్మ పురస్కారం భారతదేశ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం. 2026వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన - 131 మంది (పద్మ విభూషణ్ పురస్కారం - 5, పద్మభూషణ్ పురస్కారం - 13, పద్మశ్రీ పురస్కారం - 113) పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో 2 జంటలు (ఇద్దరికీ కలిపి ఒక పురస్కారంగానే లెక్కిస్తారు), 19 మంది మహిళలు ఉన్నారు.
స్టెల్లా జెప్కోస్గీ రుట్టో (జననం: 12 డిసెంబర్ 1996) కెన్యా-రొమేనియన్ స్టీపుల్‌చేజ్ రన్నర్ . కెన్యాకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆమె 2012 ప్రపంచ U20 ఛాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 21 ఫిబ్రవరి 2022న, ఆమె తన అంతర్జాతీయ విధేయతను కెన్యా నుండి రొమేనియాకు మార్చుకుంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
అశ్వత్ మారిముత్తు భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు , స్క్రీన్ రైటర్. ఆయన 2020లో ఓ మై కడవులే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ‘ఓహ్ మై కడవులే’ సినిమా బాగుందని నటుడు మహేశ్‌బాబు ట్విటర్ పోస్ట్ చేయడంతో ఆయన ట్విటర్ ఖాతా ఫేమస్ అయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
వేణుమాధవ్ (సెప్టెంబరు 28, 1969 - సెప్టెంబరు 25, 2019) తెలుగు సినిమా హాస్యనటుడు. ఆయన ప్రధానంగా తెలుగు సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, స్థానిక యాసలను అనుకరిస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సుమారు 500కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.
లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ (ఆంగ్లం: Lionel Messi), 1987 జూన్ 24లో జన్మించారు అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు, ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు, ఒక రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం.
సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.
దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 8, 1972) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985, సాధారణంగా "ఎన్డిపిఎస్"చట్టం అని పిలుస్తారు. ఇది భారతదేశం యొక్క పార్లమెంటు రూపొందించిన చట్టం, ఈ చట్టం వలన ఏదైనా మాదక ఔషధం లేదా మానసిక పదార్థాన్ని తినే వ్యక్తిని లేదా ఉత్పత్తి చేసే / తయారీ/ పెంపకం, స్వాధీనం (కలిగి ఉండటం), అమ్మకం, కొనుగోలు, రవాణా లేదా నిల్వ చేసే వ్యక్తిని నిషేధిస్తుంది. "'నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ బిల్లు, 1985"' 1985 ఆగస్టు 23 లో లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.
మా ఇంటి మహాలక్ష్మి (1959 సినిమా)
మా ఇంటి మహాలక్ష్మి హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు సినిమా. 1959లో విడుదలైన ఈ సినిమాలో హరనాధ్ కథానాయకుడుగానూ, జమున నాయకిగాను నటించారు. ఈ సినిమాను హైదరాబాదులో అప్పట్లో కొత్తగా నిర్మించిన సారథి స్టూడియోలో నిర్మించారు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
యాస్మీన్ అని కూడా పిలువబడే యాస్మిన్ , పాకిస్తానీ సినిమాల్లో తన నటనకు ప్రసిద్ధి చెందిన పాకిస్తానీ నటి. ఆమె కెరీర్ రెండు దశాబ్దాలకు పైగా విస్తరించింది, ఆ సమయంలో ఆమె పాకిస్తాన్ సినిమా స్వర్ణయుగం చిత్రాలలో ప్రముఖ మహిళగా, సహాయక పాత్రలలో కనిపించింది . షౌకత్ హుస్సేన్ రిజ్వీతో వివాహం తర్వాత ఆమె నటన నుండి రిటైర్ అయ్యింది .
కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) 2024లో విడుదలైన తెలుగు సినిమా. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్ బ్యానర్‌పై రాకింగ్ రాకేశ్ నిర్మించిన ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించాడు, కథ నవీన్ కోల అందించాడు. రాకింగ్ రాకేశ్, అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 19న విడుదల చేసి, సినిమా నవంబర్ 22న విడుదలైంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అనేది ఇంటింటి లెక్కింపు, ముందే నింపిన ఫారాలు, పాత ఓటరు డేటా ధ్రువీకరణ ద్వారా ఓటరు జాబితాలను ధ్రువీకరించడానికి, సవరించడానికి భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ఒక ప్రక్రియ. అర్హులైన పౌరులు తప్పిపోకుండా చూసుకుంటూ, మరణించిన, శాశ్వతంగా మార్చబడిన, నకిలీ, పౌరులు కాని ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా భారతదేశం అంతటా ఓటర్ల జాబితాలు కచ్చితమైనవని నిర్ధారించడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లక్ష్యం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను 2025 అక్టోబరు 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించాడు.
బెర్బెరిన్ తెలుపు లేదా పసుపు, స్ఫటికాకార, నీటిలో కరిగే ఆల్కలాయిడ్, బార్బెర్రీ లేదా గోల్డెన్సీల్ నుండి లభిస్తుంది, దీనిని యాంటీపైరోటిక్, యాంటీ బాక్టీరియల్, జీర్ణకారి మందుగా ఉపయోగిస్తారు.రసాయన ఫార్ములాC20H19NO5.బెర్బెరిన్ ఒక ఆర్గానిక్ హెటెరోపెంటాసైక్లిక్ సమ్మేళనం, ఆల్కలాయిడ్ యాంటీబయాటిక్, బొటానికల్ యాంటీ ఫంగల్ ఏజెంట్, బెర్బెరిన్ ఆల్కలాయిడ్.హైడ్రాస్టిస్ కెనాడెన్సిస్ L., బెర్బెరిడేసి మొక్కల నుండి వెలికి తీసే ఆల్కలాయిడ్. ఇది అనేక ఇతర మొక్కలలో కూడా కనిపిస్తుంది. ఇది ఆంత్రేతరంగా సాపేక్షంగా విషపూరితమైనది, కానీ వివిధ పరాన్నజీవి, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు, యాంటీడైరియాల్గా నోటి ద్వారా తీసుకునే మందుగా ఉపయోగించబడుతుంది.బెర్బెరిన్ అనేది గోల్డెన్సల్, బార్బెర్రీ, ఒరెగాన్ ద్రాక్షతో సహా అనేక బొటానికల్ ఉత్పత్తులలో కనిపించే క్వాటర్నరీ అమ్మోనియా సమ్మేళనం, ఇది స్థూలకాయం, మధుమేహం, హైపర్లిపిడెమియా, గుండె వైఫల్యం, హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్ వంటి అనేక పరిస్థితుల కోసం దాని ఉద్దేశించిన యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాల కోసం ఉపయోగించబడుతుంది.,పెద్ద ప్రేగు అడెనోమా నివారణకు కూడా ఉపయోగింపబడుతుంది.