The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
పీర్ల పండుగ అనేది కర్బలా యుద్ధాన్ని స్మరించుకునే ఉత్సవంగా, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలచే జరుపబడే సంతాప పర్వదినం. ఈ పండుగ అషుర్ఖానాలుగా పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాల్లో సంతాప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతుంది. మొహర్రం సందర్భంలో, ఆలంలు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ పండుగలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది.ఊరేగింపులో విభిన్న కుటుంబాలు, వ్యక్తులు విరాళంగా ఇచ్చిన అనేక ఆలంలు భాగస్వామ్యం అవుతాయి.ఉదాహరణకు, తెలంగాణలోని నరసర్లపల్లె వంటి కొన్ని గ్రామాల్లో, ఒకే కుటుంబం తరతరాలుగా ఆలంలను విరాళంగా అందిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
వెనిజులా, దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలో కరేబియన్ సముద్రంలోని ఒక తీర దేశం. దీన్ని అధికారికంగా " వెనిజులా బోలివారియ గణతంత్రం " అంటారు. ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ , టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 km2 (353,841 sq mi) జనసంఖ్య 3,17,75,371.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
రాజులుగా (క్షత్రియులు)పిలవబడే ఈ కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.వీరు తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు హిందూ మతాన్ని ఆచరించారు.నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్టా, ఉభయ గోదావరి జిల్లాలలోను, విశాఖ,విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు ఓసి విభాగానికి చెందుతారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రంలో బీసీ చెందుతారు.వీరు స్థానికంగా భూస్వామ్య కులంగా పిలుస్తారు.బ్రిటీష్ పాలన వీరు జమీందారులుగా ఉండేవారు.ఆంధ్ర ప్రాంతంలో అసలు క్షత్రియ వర్ణం లేనప్పటికీ ప్రస్తుతం క్షత్రియ హోదాలో కొనసాగుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 2002 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రాజులు జనాభాలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నారూ.ప్రధానంగా కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.
పీర్ల పండుగ అనేది కర్బలా యుద్ధాన్ని స్మరించుకునే ఉత్సవంగా, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలచే జరుపబడే సంతాప పర్వదినం. ఈ పండుగ అషుర్ఖానాలుగా పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాల్లో సంతాప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతుంది. మొహర్రం సందర్భంలో, ఆలంలు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ పండుగలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది.ఊరేగింపులో విభిన్న కుటుంబాలు, వ్యక్తులు విరాళంగా ఇచ్చిన అనేక ఆలంలు భాగస్వామ్యం అవుతాయి.ఉదాహరణకు, తెలంగాణలోని నరసర్లపల్లె వంటి కొన్ని గ్రామాల్లో, ఒకే కుటుంబం తరతరాలుగా ఆలంలను విరాళంగా అందిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
క్రికెట్ క్రీడలో, స్లెడ్జింగ్ అంటే ప్రత్యర్థి ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా మాటలతో భయపెట్టడం. దీని ఉద్దేశం, ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం, తద్వారా వారి ఆటను దెబ్బతీయడం లేదా తప్పులు చేసేలా చేయడం. క్రీజులో ఉన్న బ్యాట్స్మన్లు, బౌలరు, కొంతమంది సన్నిహిత ఫీల్డర్లూ ఒకరికొకరు వినబడేంత దగ్గరగా ఉంటారు కాబట్టి, ఈ దూషణలు వారిపై ప్రభావం చూపుతాయి.
బంకించంద్ర ఛటర్జీ (27 జూన్, 1838 - 8 ఏప్రిల్, 1894) (బంకించంద్ర ఛటోపాధ్యాయ; బెంగాలీ: বঙ্কিম চন্দ্র চট্টোপাধ্যায়; ఆంగ్లం: Bankim Chandra Chatterjee), 'ఛటోపాధ్యాయ్' ని బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు.
గుల్షన్ దేవయ్య భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2010లో 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి షైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని షైతాన్‌లో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.
దాదాపు 300 సంవత్సరాల క్రితం ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ నుంచి, మక్కా షరీఫ్ నుంచి 12 మంది తరఖ్‌మాన్ల్ అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటకలో హైదర్అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది. వారు దేశంలో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి, ఇస్లామేతరులకు, మధ్య యుద్ధం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
2026 జూన్ 24న, రెండు భారీ స్ట్రైక్-స్లిప్ భూకంపాలు వాయువ్య మరియు మధ్య వెనిజులా ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఈ రెండు భూకంపాల భూకంప కేంద్రాలు (ఎపికేంటర్లు) యారకూయ్ (Yaracuy) రాష్ట్రంలోని వెరోస్ (Veroes) మునిసిపాలిటీలో నమోదయ్యాయి. మొదటి భూకంపం రెక్టార్ స్కేలుపై తీవ్రతతో స్థానిక సమయం సాయంత్రం 18:04 గంటలకు సంభవించింది; దీనిని ప్రాథమిక భూకంపం (ఫోర్‌షాక్)గా వర్గీకరించారు.
క 2024లో విడుదలైన పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 15న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి, అక్టోబర్ 31న విడుదలైంది.
చెట్టు మీద దెయ్యం నాకెం భయ్యం అనేది 2026, జూన్ 26న విడుదలైన తెలుగు హర్రర్ కామెడీ సినిమా. గణేష్ భారి సమర్పణలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్, తల్లాడ సాయికృష్ణ నిర్మించిన ఈ సినిమాకు తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు, విజయ్ నిట్టల, బాలు వంగపండు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act) భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు.
ఎస్. వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి
సతీష్‌రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయనాయకులు, ఇతను 04-09-2014 న ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన ఈయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ ఎ.చక్రపాణి 04-09-2014 న ప్రకటించారు.
వేణుమాధవ్ (సెప్టెంబరు 28, 1969 - సెప్టెంబరు 25, 2019) తెలుగు సినిమా హాస్యనటుడు. ఆయన ప్రధానంగా తెలుగు సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, స్థానిక యాసలను అనుకరిస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సుమారు 500కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.
ప్రీతిక (జననం 1992 మే 29) మాజీ భారతీయ నటి, మోడల్, చలనచిత్ర కాలమిస్ట్, ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్, చిత్రాలలో నటిస్తుంది. ఆమె 2010లో చిక్కు బుక్కు తమిళ చిత్రంలో తొలిసారిగా నటించింది. బెంతెహా (2013-14)తో టెలివిజన్ అరంగేట్రం చేసిన ఆమె ఆలియా జైన్ అబ్దుల్లా పాత్రను పోషించినందుకు బాగా ప్రసిద్ది చెందింది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.