The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
నికోల్ జెఫాన్యా (జననం 24 జనవరి 1999), వృత్తిపరంగా నికి (స్టైలైజ్డ్ ఆల్ క్యాప్స్) గా ప్రసిద్ధి చెందింది, ఇండోనేషియా గాయని-పాటల రచయిత. ఆమె ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో ఉంది, రికార్డ్ లేబుల్ 885 తో సంతకం చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె మొదటి పూర్తి-నిడివి స్టూడియో ఆల్బమ్ మూన్‌చైల్డ్ (2020) విడుదలైంది, ఎన్‌ఎంఇ ద్వారా సంవత్సరపు ఉత్తమ ఆసియా ఆల్బమ్‌లలో ఒకటిగా ఎంపికైంది.
పీర్ల పండుగ అనేది కర్బలా యుద్ధాన్ని స్మరించుకునే ఉత్సవంగా, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలచే జరుపబడే సంతాప పర్వదినం. ఈ పండుగ అషుర్ఖానాలుగా పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాల్లో సంతాప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతుంది. మొహర్రం సందర్భంలో, ఆలంలు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ పండుగలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది.ఊరేగింపులో విభిన్న కుటుంబాలు, వ్యక్తులు విరాళంగా ఇచ్చిన అనేక ఆలంలు భాగస్వామ్యం అవుతాయి.ఉదాహరణకు, తెలంగాణలోని నరసర్లపల్లె వంటి కొన్ని గ్రామాల్లో, ఒకే కుటుంబం తరతరాలుగా ఆలంలను విరాళంగా అందిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
హిందూ సామ్రాజ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా జరుపుకుంటారు.ఛత్రపతి శివాజీహిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు.1674 జూన్ 6న (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు.శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శహజీ భోస్లె, జిజాభాయి దంపతులకు జన్మించాడు.
ఎస్. వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి
సతీష్‌రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయనాయకులు, ఇతను 04-09-2014 న ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన ఈయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ ఎ.చక్రపాణి 04-09-2014 న ప్రకటించారు.
35 చిన్న కథ కాదు 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మించిన ఈ సినిమాకు నందకిషోర్ దర్శకత్వం వహించాడు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 9న, సినిమాను సెప్టెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం
ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. 1955లో తొలిసారి ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1978లో రద్దయ్యింది. 2009లో తిరిగి షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన నియోజకవర్గంలా మరలా ఏర్పడింది.
గుల్షన్ దేవయ్య భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2010లో 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి షైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని షైతాన్‌లో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.
సేషెల్స్ ), అధికారికంగా " సేషెల్స్ రిపబ్లిక్ " హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశం. 115 ద్వీపాల దేశం రాజధాని విక్టోరియా, తూర్పు ఆఫ్రికాకు తూర్పున 1,500 కిలోమీటర్ల (932 మైళ్ళు) దూరంలో ఉంది. ఇతర సమీపంలోని ద్వీప దేశాలు, భూభాగాలు కొమొరోస్, మయొట్టె (ఫ్రాన్స్ ప్రాంతం), మడగాస్కర్, రీయూనియన్ (ఫ్రాన్సు ప్రాంతం), దక్షిణసరిహద్దులో మారిషస్, అలాగే తూర్పు సరిహద్దులో మాల్దీవులు, బ్రిటీషు హిందూ మహాసముద్రం ఉన్నాయి.
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు 2004, ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుప్రభాత సినీ క్రియేషన్స్ బ్యానరులో జిగిని నాగభూషణం నిర్మించిన ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆదిత్య ఓం, సంగీత, భాగ్యరాజా, సునీల్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.
అట్లూరి పిచ్చేశ్వరరావు (1925 ఏప్రిల్ 12 - 1966 సెప్టెంబర్ 26) తెలుగు కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత. పిచ్చేశ్వరరావు భారత నౌకాదళంలో మెకానికల్ ఇంజనీరుగా, విశాలాంధ్ర పత్రికలో సహాయ సంపాదకునిగా, తెలుగు సినిమా రంగంలో స్క్రిప్టు రచయితగా పనిచేశాడు. సాహిత్య రంగంలో అనేక కథలు, రేడియో నాటికలు, సినిమా స్క్రిప్టులు, వెండితెర నవలలు రాసిన ఇతనికి తెలుగు సాహిత్య రంగంలో హిందీ సాహిత్య అనువాదకునిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
కేప్ వర్దె లేదా కేబో వెర్డే అధికారికంగా కాబో వెర్డే రిపబ్లిక్ కేంద్ర అట్లాంటిక్ మహాసముద్రంలో 10 అగ్నిపర్వత ద్వీపసమూహం విస్తరించి ఉన్న ఒక ద్వీప దేశం. ఇందులో అజోరెస్, కానరీ ఐలాండ్స్, మదీరా, సావేజ్ దీవులతో పాటు మాకారోనెసియా పర్యావరణ ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. పురాతన కాలంలో ఈ ద్వీపాలు "బ్లెస్డ్ దీవులు" లేదా "అదృష్టకరమైన ద్వీపాలు"గా సూచించబడ్డాయి.
లౌకికవాదాన్ని సాధారణంగా పౌర వ్యవహారాలకు సంబంధిచినదిగా లేదా జాతీయావాదం నుండి మతాన్ని వేరుచేయడం అని నిర్వచించారు. యాంటిక్లెరికలిజం, నాస్తికత్వం, సహజత్వం లేదా ప్రభుత్వ సంస్థల నుండి మతపరమైన చిహ్నాలను తొలగించడం వంటివి ఈ పదానికి విస్తృత అర్ధాలుగా సూచించవచ్చు. లౌకికవాదం అనే పదాన్ని మొట్టమొదట 1851 లో బ్రిటిష్ రచయిత జార్జ్ హోలీయోక్ ఉపయోగించారు .
బంకించంద్ర ఛటర్జీ (27 జూన్, 1838 - 8 ఏప్రిల్, 1894) (బంకించంద్ర ఛటోపాధ్యాయ; బెంగాలీ: বঙ্কিম চন্দ্র চট্টোপাধ্যায়; ఆంగ్లం: Bankim Chandra Chatterjee), 'ఛటోపాధ్యాయ్' ని బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.