The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్వవసాయ భూముల నిర్వహణకు కోసం భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హైదరాబాదు లోని శిల్పకళా వేదిక , హైటెక్ సిటీ, మాదాపూర్ లో తేది:14 ఏప్రిల్ 2025 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భూపరిపాలనలోని ధరణి స్థానంలో కొత్త ఆర్.ఓ .ఆర్ చట్టం భూ భారతి పొర్టల్ -2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం -2009 (RTE-2009) అనేది 4 ఆగస్టు 2009న రూపొందించబడిన భారత పార్లమెంటు చట్టం, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A లో ఉంది. భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టం 1 ఏప్రిల్ 2010న అమల్లోకి వచ్చినప్పటి నుండి విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కుగా అందించే 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మూడవ తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నవంబరు 30న జరిగాయి. ఓట్లు లెక్కింపు 2023 డిసెంబరు 03న జరిగింది.ఎన్నికల సంఘం ఫలితాలు అదేరోజు ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-64, బీఆర్ఎస్-39, బీజేపీ-8, ఎంఐఎం-7, సీపీఐ-1 ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.
నీరా ఆర్య 1902 మార్చి 5న ఉత్తర ప్రదేశ్ లోని ఖేక్రా నగర్ లో వ్యాపారవేత్త సేథ్ ఛజుమాల్ కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుండి నిజమైన జాతీయవాది, స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో భాగం కావాలనే దార్శనికత ఎల్లప్పుడూ ఉండేది. కలకత్తాలో తండ్రి వ్యాపారం చక్కగా సాగడంతో ( అతని వ్యాపారం దేశవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ కలకత్తా అతని వ్యాపారానికి కేంద్రంగా ఉంది) కారణంతో కలకత్తాలో ఆమె చదువు కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ OBE, FNA, FASc, FRS (1893 జూన్ 29 - 1972 జూన్ 28) భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంకశాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి.మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధిచెందినాడు. అతను గణాంక కొలత అయిన "మహలనోబిస్ డిస్టెన్స్" ద్వారా గుర్తింపబడ్డాడు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
రాజులుగా (క్షత్రియులు)పిలవబడే ఈ కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.వీరు తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు హిందూ మతాన్ని ఆచరించారు.నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్టా, ఉభయ గోదావరి జిల్లాలలోను, విశాఖ,విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు ఓసి విభాగానికి చెందుతారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రంలో బీసీ చెందుతారు.వీరు స్థానికంగా భూస్వామ్య కులంగా పిలుస్తారు.బ్రిటీష్ పాలన వీరు జమీందారులుగా ఉండేవారు.ఆంధ్ర ప్రాంతంలో అసలు క్షత్రియ వర్ణం లేనప్పటికీ ప్రస్తుతం క్షత్రియ హోదాలో కొనసాగుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 2002 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రాజులు జనాభాలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నారూ.ప్రధానంగా కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.
దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఉద్భవించిన హిందూ రాజవంశాల సమూహాన్ని నాయక రాజవంశాలు అని సూచిస్తారు. మధురై నాయకులు, తంజావూరు నాయకులు వంటి రాజవంశాల పాలకులు విజయనగర సామ్రాజ్యం క్రింద సైనిక గవర్నర్లుగా పనిచేశారు. తళ్ళికోట యుద్ధం తరువాత వీరిలో చాలామంది తమను స్వతంత్రులుగా ప్రకటించుకుని స్వంత రాజ్యాలను స్థాపించుకున్నారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
సేషెల్స్ ), అధికారికంగా " సేషెల్స్ రిపబ్లిక్ " హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశం. 115 ద్వీపాల దేశం రాజధాని విక్టోరియా, తూర్పు ఆఫ్రికాకు తూర్పున 1,500 కిలోమీటర్ల (932 మైళ్ళు) దూరంలో ఉంది. ఇతర సమీపంలోని ద్వీప దేశాలు, భూభాగాలు కొమొరోస్, మయొట్టె (ఫ్రాన్స్ ప్రాంతం), మడగాస్కర్, రీయూనియన్ (ఫ్రాన్సు ప్రాంతం), దక్షిణసరిహద్దులో మారిషస్, అలాగే తూర్పు సరిహద్దులో మాల్దీవులు, బ్రిటీషు హిందూ మహాసముద్రం ఉన్నాయి.
జూలియా ఎవెలిన్ మోర్లే (ఆంగ్లం: Julia Morley; 1939 అక్టోబరు 25) ఒక ఆంగ్ల వ్యాపారవేత్త, స్వచ్ఛంద సేవకురాలు, మాజీ మోడల్. ఆమె మిస్ వరల్డ్, మిస్టర్ వరల్డ్ పోటీలను నిర్వహించే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కు ఛైర్మన్, సీఈఓ. ఆమె మిస్ వరల్డ్ సృష్టికర్త దివంగత ఎరిక్ మోర్లే (Eric Morley) భార్య, ఆయన ఈ పోటీని జూలై 1951లో ప్రారంభమైనప్పటి నుండి 2000లో ఆయన మరణించే వరకు నిర్వహించాడు.
భారత దేశంలోని బాల బాలికలకు, గర్బవతులకు (ముఖ్యంగా పేద వారి పిల్లలకు, పేద మహిళలకు) పుష్టికరమైన ఆహారము (సంపూర్ణ ఆహారము) అందటంలేదని, వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము, ఆంగన్వాడీ (Anganwadi) కేంద్రాల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ఆంగన్వాడీ కేంద్రం సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వం కొంత వాటా, రాష్ట్రప్రభుత్వం కొంత వాటా కలిపి, జీతంగా ఇస్తాయి. ప్రభుత్వం ఇచ్చే వేతనం ఈ కేంద్రాలలో సేవలు అందించే ఆంగన్వాడీ కేంద్రాల సిబ్బంది (కార్యకర్త) కి కేంద్ర ప్రభుత్వము, రూ.
మిషన్ వాత్సల్య కేంద్ర ప్రాయోజిత పథకం, ఈ పథకం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (SDGs) అనుగుణంగా అభివృద్ధి, పిల్లల రక్షణ లక్ష్యాలను సాధించడానికి పనిచేస్తుంది. బాలల హక్కులు, న్యాయవాదం, అవగాహనకు ప్రాధాన్యత ఇస్తుంది, అదే సమయంలో "పిల్లలను విడిచిపెట్టవద్దు" అనే మార్గదర్శక సూత్రం కింద పనిచేస్తుంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అవసరాలు, డిమాండ్లకు అనుగుణంగా మిషన్ వాత్సల్య పథకం కింద నిధులు విడుదల చేస్తారు.
దాదాపు 300 సంవత్సరాల క్రితం ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ నుంచి, మక్కా షరీఫ్ నుంచి 12 మంది తరఖ్‌మాన్ల్ అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటకలో హైదర్అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది. వారు దేశంలో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి, ఇస్లామేతరులకు, మధ్య యుద్ధం జరిగింది.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.